How to Register Mobile Number in SBI Net Banking in Telugu - భారతీయ స్టేట్ బ్యాంక్
How to Register Mobile Number in SBI Net Banking in Telugu - భారతీయ స్టేట్ బ్యాంక్
నెట్ బ్యాంకింగ్‌కు మీ మొబైల్ నెంబరు రిజిస్టర్ చేసుకోలేదా?
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) నెట్ బ్యాంకింగ్‌కు మీ మొబైల్ నెంబరు రిజిస్టర్ చేసుకోలేదా? అయితే.. ఈ ఏడాది డిసెంబరు 1వ తేదీ తర్వాత మీ నెట్ బ్యాంకింగ్ బ్లాక్ కానుంది. దీనికి సంబంధించిన ప్రకటనను ఎస్‌బీఐ వినియోగదారుల కోసం తమ వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. ‘ఇంటర్నెట్ బ్యాంకింగ్ యూజర్లు.. వెంటనే మీ మొబైల్ నెంబరును రిజిస్టర్ చేయించుకోండి. లేదంటే డిసెంబరు 1, 2018 నుంచి మీ ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలు నిలిపివేయబడును’ అని ఎస్‌బీఐ తన ప్రకటనలో పేర్కొంది. ఇచ్చిన గడువు లోపు మొబైల్ నెంబరును రిజిస్టర్ చేసుకోవాల్సిందిగా సూచించింది. ఖాతాదారుల బ్యాంకింగ్ లావాదేవీలకు సంబంధించి ఎప్పటికప్పుడు ఎస్‌ఎంఎస్, ఈ మెయిల్ అలర్ట్‌ల ద్వారా యూజర్లకు తప్పనిసరిగా తెలియజేయాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) జులై 6, 2017లో అన్ని బ్యాంకులకు సర్క్యులర్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే ఎస్‌బీఐ నెట్‌బ్యాంకింగ్‌కు మొబైల్ నెంబరును రిజిస్టర్ చేసుకోవాల్సిందిగా ఖాతాదారులకు సూచించింది.
Your SBI net banking facility may
get blocked if mobile number is not registered by December 1, 2018
- SBI State Bank of India Net Banking users have to register your mobile number with the bank by December 1, 2018. If they do not register it before the deadline, they will not be able to access their net banking account after December 1, i.e., it will be blocked.
- The bank has intimated all the Net Banking users on its Internet banking website 'onlinesbi' that they need to register their mobile number through the branch (unless already done) or else their Internet banking may be blocked.
- "Attention INB users, please register your mobile number with us immediately, if not already done, through Branch, failing which the Internet Banking Facility may be blocked with effect from 01.12.2018", says the online SBI website.
- Therefore, if your mobile number is not already registered with SBI for your account, then it is better that you do it as soon as possible.
- Remember the website states that the mobile number must be registered through a bank branch. Therefore, it appears that you are mandatory required to visit your bank branch to register your mobile number.
- According to a Reserve Bank of India (RBI) circular dated July 6, 2017, banks must ask their customers to mandatory register for SMS alerts and email alerts wherever available email ID is available for electronic banking transactions. Electronic banking transactions include Internet banking, mobile banking, and so on. The bank's efforts appear to be an attempt to comply with the RBI's circular.
Check whether Your Mobile Number Registered OR Not
Users can also check if your mobile number is registered with the bank by logging in to their net-banking facility. Here's how they can check it:ఎస్‌బీఐ నెట్ బ్యాంకింగ్‌తో మొబైల్ నెంబర్ రిజిస్ట్రర్ అయిందో లేదో చెక్ చేసుకునే ప్రక్రియ
- onlinesbi.com అనే ఎస్‌బీఐ నెట్ బ్యాంకింగ్ వెబ్‌సైట్‌ను సందర్శించాలి.
- లాగిన్, పాస్‌వర్డ్ వివరాలను నమోదు చేయాలి
- ఆ తర్వాత ‘మై అకౌంట్ అండ్ ప్రొఫైల్’ ట్యాబ్‌ను క్లిక్ చేయాలి
- ‘ప్రొఫైల్’ ట్యాబ్‌పై క్లిక్ చేయాలి
- పర్సనల్ డిటైల్స్/మొబైల్ అనే ఆప్షన్‌ను క్లిక్ చేయాలి
- ఆ తర్వాత ప్రొఫైల్ పాస్‌వర్డ్ నమోదు చేయాలి(ప్రొఫైల్ పాస్‌వర్డ్, యూజర్ పాస్‌వర్డ్ వేరువేరుగా ఉండాలి)
- ఒక్కసారి ప్రొఫైల్ పాస్‌వర్డ్‌ను విజయవంతంగా నమోదు చేసిన తర్వాత, రిజిస్ట్రర్ మొబైల్ నెంబర్, ఈమెయిల్(ముందే రిజిస్ట్రర్ అయి ఉంటే) డిస్‌ప్లే అవుతుంది.