ఉద్యోగ , ఉపాధ్యాయ మిత్రులకు స్వాగతం సుస్వాగతం పి అర్ టి యు పినపాక మండల శాఖ ......

Teachers (Employees) Income Tax Software 2024- 25 Available now ........

DEPARTMENTAL-TEST

Departmental Examinations Online Apply.
 డిపార్ట్ మెంట్ టెస్ట్ సిలబస్ ను  MP3 ఫార్మేట్ లో వినండి
   SERVICE PENSION CALCULATION
   SSC SCHEMES GOT 97 GOT 88
     RTE ACT 2009 Departmental tests
    GRATUITY EOT-141
    PENSION CALCULATION RULES
    FAMILY PENSION PROBLEMS
  GRATUITY CALCULATION
 TYPES OF PENSION
  HOW TO CALCULATE GRATUITY


*ఏ డిపార్ట్ మెంట్ టెస్ట్ ఎవరికి ?*
తెలంగాణ ప్రభుత్వ శాఖపరమైన పరీక్షలు (Departmental Tests) నోటిఫికేషన్ విడుదల చేసినపుడల్లా అసలు డిపార్టుమెంటల్ పరీక్షలు ఎవరు రాయాలనే సందేహం చాలామంది ఉపాధ్యాయుల్లో ఉంటుంది. దానిపై కొంత వివరణ మీ కోసం అందించే ప్రయత్నం చేస్తున్నాము.G.O.Ms.No.29&30 Edn తేది: 23-06-2010 ప్రకారం

*EOT(141) & GOT(88&97)*
 *SGT/LPT/PETలకి 24 ఇయర్స్ స్కేల్ కోసం.*
*SA లకి 12 ఇయర్స్ స్కేల్ కోసం.*
 *HM పదోన్నతి కోసం*

*PAT (ప్రొఫెషనల్ అడ్వాన్సుమెంట్ టెస్ట్)*
*ఇది Inter + D.ed టీచర్ల కోసం.*
 *18 ఇయర్స్ స్కేల్ కోసం*
 *వీరికి 24 ఇయర్స్ స్కేల్ ఇవ్వరు.*
 *కారణం బీ.ఎడ్ లేదు కాబట్టి.*

*HM a/c టెస్ట్*
*ఇది కేవలం ఎయిడెడ్ టీచర్ల కోసం.*
*ఇంతకూ మునుపు మునిసిపల్ టీచర్లకు ఉండేది.* కానీ మునిసిపల్ టీచర్లకు సర్వీస్ రూల్స్(GO. 320,321 etc..) వచ్చినప్పటి నుండి వీరికి కూడా EOT, GOT తప్పకుండ పాస్ కావాలని వుంది.
 *కానీ 2019 DEC వరకు మాత్రమే ఎవరైనా eot got లేకుండా ఒక HM అకౌంట్ టెస్ట్ మాత్రమే ఉండే  మునిసిపల్ టీచర్స్కు ఉపయోగపడుతుంది.*  ఆ తరవాత HM ప్రమోషన్ కావాలి అనేవారు మాత్రము EOT, GOT తప్పకుండా పాస్ ఐ ఉండాలి
 *SGT/LPT/PET లకి 24 ఇయర్స్ స్కేల్ కోసం.*
*SA లకి 12 ఇయర్స్ స్కేల్ కోసం.*

*CODE--37*
 *who have not studied telugu as 2nd.language in inter/degree , should pass department test for telugu code--37 for HM promotion.*
*SOT(simple orientation test)*
*Only for Gr--1 pandits.*

*************************************

సందేహం :
పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే డిపార్టుమెంటల్ పరీక్షలలో Spl.Language Tests Telugu,Hindi,Urdu ఎవరు రాయాలి?
 సమాధానం :
-ఇంటర్మీడియేట్ ఆ పై స్థాయిలో తెలుగు ఒక భాషగా చదవనివారు Spl.language Test in Telugu(P.code-37) రాయాల్సి ఉంటుంది.
-10వ తరగతి ఆ పై స్థాయిలో హింది/ఉర్దూ ఒక భాషగా చదవని వారు Spl.language Test in Hindi/Urdu రాయాల్సి ఉంటుంది.

పదోన్నతులు(PROMOTIONS):
-స్కూల్ అసిస్టెంట్ లు  గజిటెడ్ ప్రధానోపాధ్యాయుల ప్రమోషన్ పొందుటకు GOT,EOT పరీక్షలు ఉత్తీర్ణులు కావాలి.
- సర్వీసు లో ఒక్క ప్రమోషన్ కూడా తీసుకొనివారు 45 సం॥ వయస్సు దాటితే ప్రస్తుతము పనిచేయుచున్న క్యాటగిరి నుండి పై క్యాటగిరి కి  ఎటువంటి శాఖాపరమైన పరీక్షలు ఉత్తీర్ణత పొందాల్సిన అవసరం లేదు.
- 50 సం॥ పైబడినవారు ప్రమోషన్ కొరకు ఎటువంటి శాఖాపరమైన పరీక్షలు ఉత్తీర్ణత పొందాల్సిన అవసరం లేదు.

 Spl.Language Test Higher&Lower Standard paper Code.37 ఎవరు వ్రాయాలి:
 - ఇంటర్మీడియట్ ఆ పై స్థాయిలో తెలుగు ఒక భాషగా చదవని ఉపాధ్యాయులు (Higher Standard) వ్రాయాలి.పదవ తరగతి ఆ పై స్థాయిలో హిందీ/ఉర్దూ ఒక భాషగా చదవని ఉపాధ్యాయులు (Lower Standard) వ్రాయాలి.

డిపార్టుమెంటల్ పరీక్షకు హాజరయ్యే ఉపాధ్యాయులకు OD సౌకర్యం ఉంటుందా?
 - ఫండమెంటల్ రూల్ 9(6)(b)(iii) ప్రకారం నిర్బంధ శాఖీయ పరీక్షకు(Compulsory) హాజరగుటకు ఎన్నిసార్లైనా OD సౌకర్యం కల్పించవచ్చును.అయితే ఐచ్చిక పరీక్షకు(OPTIONAL) హాజరగుటకు రెండుకంటే ఎక్కువసార్లు OD  రాయితీని ఇవ్వరాదు.

TSPSC Departmental Test Results

*APPSC Departmental Test May'2013 Results

డిపార్ట్ మెంట్ టెస్ట్ - ఆన్లైన్ విధానం
1. అభ్యర్థి గంట ముందు డిపార్ట్మెంట్ టెస్ట్ పరీక్షా కేంద్రంలో హాజరు అవ్వాలి.
2. పరీక్షా సమయానికి 30 నిమిషాలకు ముందు గేట్లు మూసివేయబడతాయి.
3. రిజిస్ట్రేషన్ పక్రియ పూర్తయిన తరువాత ఏ అభ్యర్థిని లోపలికి అనుమతించరు.
4. మీకు కేటాయించిన కంప్యూటర్ సిస్టమ్ నందు పరీక్షల లింక్ Login స్క్రీన్ అందుబాటులో ఉంటుంది. ఒకవేళ అలా లేకపోతే అక్కడి పర్యవేక్షకుడికి తెలియజేయాలి.
5. పరీక్ష సమయానికి 10 నిమిషాల ముందు login అవ్వాలి.

Login I d=ROLL NUMBER
PASSWORD=పరీక్షరోజు ఇవ్వబడుతుంది.

6. ఇన్విజిలేటర్ Passwordను ఉదయం పరీక్షకు గం 8:50 నిమిషాలకు, మద్యాహ్నం అయితే 1.50 నిమిషాలకు ప్రకటిస్తారు.
7. Login అయ్యిన తరువాత తెరపై ఫ్రొపైల్ ఇన్ పర్ మేషన్ లో మీ వివరాలను చెక్ చేసుకుని Confirm పై క్లిక్ చేయాలి.
8. ప్రశ్నలను మరియు ఆప్షన్ లను Copy చేయటం గానీ, నోట్ చేయడం గానీ చేయకూడదు. అలా చేసినచో తీవ్రమైన చర్యలు తీసుకోబడును.
9. Exam instructions ను చదువుకున్న తరువాత I AM READY TO BEGIN పై క్లిక్ చేయాలి.
10. ప్రశ్నల యొక్క జవాబులను గుర్తించడానికి మౌస్ ను మాత్రమే వాడాలి.
11. ఈ ఆన్ లైన్ పరీక్ష నందు టైమర్ కనబడుతుంది. ఇంకా మిగిలి ఉన్న సమయాన్ని దానిలో తెలుసుకోవచ్చు.
12. ఒక ప్రశ్నకు జవాబు తీసివేయాలంటే CLEAR RESPONSE బటన్ పై నొక్కాలి.
13. ప్రశ్నకు జవాబు గుర్తించిన తరువాత SAVE AND NEXT బటన్ పై క్లిక్ చేయాలి. అపుడు ఆ సమాధానం Save చేయబడి తరువాత ప్రశ్న వస్తుంది.
14. మీ యొక్క ప్రతిస్పందనలను బట్టి ప్రశ్నలకు రంగు మారుతూ ఉంటుంది.
15. ప్రశ్నల Font సైజును ఇన్విజిలేటర్ అనుమతితో పెంచుకోవచ్చును.
16. ఎట్టి పరిస్థితులలోనూ Keyboard ముట్టుకోరాదు. ముట్టుకుంటే ID lock అవుతుంది. అప్పుడు ఇన్విజిలేటర్ సహాయం తీసుకోవలెను.
17. పరీక్షా సమయంలో రఫ్ వర్క్ కొరకు ఇచ్చిన షీట్ పై మీ లాగిన్ ఐడి, Password రాయాలి
18. SECTION NAME పై కర్సర్ ను ఉంచి ఆ సెక్షన్ నందు జవాబులు గుర్తించిన, గుర్తించని ప్రశ్నలను తెలుసుకోవచ్చు.
19. PWD అభ్యర్థులకు 120 నిముషాల తరువాత కూడా మరొక 20 నిముషాల సమయం తరువాత SUBMIT బటన్ అందుబాటులో ఉంటుంది.
20. ఏదైనా సాంకేతిక కారణాల వల్ల పరీక్ష మధ్యలో System logout అయ్యితే మనం answer చేసినవి save అయ్యి ఉంటాయి,ఏ టైమ్ లో పరీక్ష ఆగిపోయిందో ఆ టైమ్ నుండే మరలా పరీక్ష మొదలౌతుంది.