TSGLI

TS GO 92 TSGLI Slab Rates Table 2022

రివైజ్డ్ స్కేల్స్ ననుసరించి టి.ఎస్.జి.ఎల్.ఐ రేట్లు - రూల్స్

ప్రభుత్వం, G.O.MS.No.92, Fin. తేదీ: 16.08.2021 ద్వారా TSGLI ప్రీమియం స్లాబ్ రేటు తేదీ: 1.8.2021 నుండి పెంచబడినది.


స్లాబురేట్ల పైన కాకుండా బేసిక్ పే పై 20% వరకు ప్రీమియం చెల్లించవచ్చు. (G.O.Ms.No.26 తేది: 22-02-1995)

TSGLI ముఖ్యాంశాలు:

  • 56 సంవత్సరాల వయస్సు నిండిన వారు కొత్త పాలసీ చేయుటకు అర్హులు కాదు.
  • Enhance చేసిన ప్రిమీయం Proposals ను 56 సంవత్సరాల వయస్సు నిండకముందే జిల్లా ఇన్సూరెన్స్ కార్యాలయంలో అందజేయాలి.
  • ఇన్సూరెన్స్ కార్యాలయం వారికి ఉద్యోగి ప్రిమీయం ఎప్పటినుండి Enhance చేసాడనే అంశం తో పనిలేదు. అప్లికేషన్ 56 సం౹౹ లోపు కార్యాలయంలో అందజేసారా లేదా అనేది ముఖ్యం.
  • 56 సం౹౹ లోపు ప్రిమీయం పెంచినప్పటికీ సకాలంలో కార్యాలయంలో అప్లికేషన్ దాఖలు చేయనట్లయితే, అలాంటి పెంచిన మొత్తానికి బాండ్ ఇవ్వరు. కానీ పెంచిన మొత్తం సొమ్మును తరువాత ఉద్యోగి ఖాతాలో జమచేయబడుతుంది.
  • పై సందర్భంలో Enhance చేయకముందు ఎంతైతే మొత్తం కట్ అవుతుందో అంతే మొత్తాన్ని కట్ చేయాల్సిందిగా DDO కి సమాచారం అందించాలి.
  • తదుపరి Form.12 ను పూరించి దానికి ఉద్యోగి సాలరీ బ్యాంక్ పాస్ బుక్ జిరాక్స్ జతచేసి జిల్లా ఇన్సూరెన్స్ కార్యాలయంలో అందజేస్తే Enhance అమౌంట్ మీ ఖాతాలో జమచేస్తారు.

Forms & Applications: