నూతన పెన్షన్ విధానము (CPS) వివరాలు
ఈ నూతన పెన్షన్ విధానము ది: 1.9.2004 నుండి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరియు రాష్ట్ర ప్రభుత్వం కూడా జీవో నెం.653, 654, 655, తేది: 22.9.2004 ప్రకారంగా ది:1.9.2004 నుండి ఉద్యోగము నందు చేరిన ప్రతివారికి అమలులోకి తీసుకొనివచ్చినది. ఈ స్కీములో చేరిన వారికి ZPPF A/c మరియు GPF A/c లు తెరువబడవు.
గమనిక: ఎప్పటికప్పుడు జరుగు మార్పుల కొరకు అధికారిక వెబ్సైట్ను చూడవచ్చును.
ముఖ్యమైన లింకులు:
- NPS Official Website Click Here
- CPS Employees Login Click Here
- CPS Related Forms Download
- CPS Account Holders Mobile App
- How to Reset PRAN Details Phone Email Address
Check CPS Subscription Details
Enter your Emp ID, DDO code, PRAN Number and Again EMP ID. You will get all your CPS Subscription in order from the date of appointment.
ఉపసంహరణ (Withdrawals)
ఈ ఖాతా నందు జమ చేయబడిన మొత్తమునకు ప్రస్తుతము లోన్ సౌకర్యం లేదు. 3 రకాలైన ఉపసంహరణలకు మాత్రమే అవకాశం కలదు. జీవో నెం.62 తేదీ: 7.3.2014 ద్వారా విధివిధానాలను పొందుపరచటమైనది.
- ఉద్యోగి పదవీ విరమణ (Retirement): ప్రభుత్వ ఉద్యోగి 58/61 సం॥ల సర్వీసు పూర్తిచేసిన తదుపరి నిల్వయున్న మొత్తం నుండి 60% మాత్రమే చెల్లించబడును. మిగిలిన 40% (ఐ.ఆర్.డి.ఎ) వారు సూచించిన లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలో పెట్టుబడి పెడతారు. దానిని 70సం॥ల వయస్సు వరకు ప్రతినెల పెన్షన్ రూపంలో చెల్లించబడును. 70 సం॥ల తదుపరి మిగిలినది చెల్లిస్తారు. ఒకవేళ మరణించినచో నామినీకి చెల్లించెదరు. దీనిని క్లెయిమ్ చేయుటకు గాను సంబంధిత 101 జీఎస్ ప్రొఫార్మా ద్వారా విధివిధానాల ప్రకారంగా దరఖాస్తు చేసుకోవాలి.
- రాజీనామా (Resignation): రాజీనామా నాటికి అకౌంట్ నందు నిల్వయున్న మొత్తం నుండి 20% మాత్రమే చెల్లించబడును. మిగిలిన 80% పెన్షన్ రూపంలో చెల్లించబడును. దీనిని క్లెయిమ్ చేయుటకు గాను సంబంధిత 102 జీసి ప్రొఫార్మా ద్వారా విధివిధానాల ప్రకారంగా దరఖాస్తు చేసుకోవాలి.
- సర్వీసులో మరణం (Death): సర్వీసులో ఉండగా మరణించినట్లయితే నామినీకి నిల్వయున్న మొత్తం 100% చెల్లించబడును. దీనిని క్లెయిమ్ చేయుటకు గాను సంబంధిత 103 జీడి ప్రాఫార్మా ద్వారా విధినిధానాల ప్రకారంగా దరఖాస్తు చేసుకోవాలి.
పైన తెలుపబడిన ఉపసంహరణలు, క్లెయిమ్ లను సంబంధిత డి.డి.ఓ.ల ద్వారా క్రింద తెలుపబడిన వారికి పంపుకోవలెను.
CRA ADDRESS:
NSDL e-Governance Infrastructure Limited,
1st Floor, Time Tower, Kamala Mills Compound,
Senapati Bapat Marg, Lower Parel, Mumbai-400 013,
Tel: (022) 2499 4200 | CRA call centre: 1800 222 990
PFRDA Address:
Pension Fund Regulatory & Dev. Authority,
1st floor, ICADR Building, Plot No.06, Vasant Kunj,
Institutional Area, Phase-Il, New Delhi 110070.
Tel: +91-11-26897948/49, Fax: 91-11-26897938, Call: 1800 110 708.
ముఖ్యాంశాలు
- దివి: 1.9.2004 నుండి ఉద్యోగంలో చేరిన ప్రతివ్యక్తి ఈ స్కీం నందు నిర్భంధంగా (టైర్-1) ఒక మెంబరుగా చేరి ప్రతినెల జీతము (బేసిక్ పే + డీఏ) మొత్తముపై 10% కంట్రిబ్యూషన్ ను జనరల్ ప్రావిడెంట్ ఫండ్ మాదిరిగా సంబంధిత డి.డి.వో లు విధిగా జీతం గాని, ఎరియర్ జీతము నుండి రికవరి చేసి క్రింద తెలుపబడిన పద్దులకు జీవో ఎం.ఎస్.నెం.-151 తేదీ: 2.7.2007 ప్రకారం జమ చేయుదురు.
తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ కంట్రిబ్యూషన్:- 8342 - Other Deposit
- 117 - Defined Contribution Pension Scheme for Govt. Employees
- 04 - TS State Govt. Employees Contributory Pensions Scheme
- 001 - Employees Contribution
- 002 - Govt. Contribution
- పై విధంగా ఒక ఉద్యోగి కంట్రిబ్యూషన్ చేసిన మొత్తమునకు అంతే మొత్తమును క్రింద తెలుపబడిన పద్దులకు జీవో ఎం.ఎస్.నెం. 151 తేదీ: 2.7.2007 ప్రకారంగా జమ చేయబడును.
- 2071 - Pension & Other Retirement Benefits
- 001 - Civil
- 117 - Contribution to contributory Pension
- 320 - Contribution
- AP State Aided Education Institution Head of Account:
- 8332 - Other Deposits
- 117 - Contributory pension scheme
- SH(05) - TS Aided Educational Institution Employees
- 001 - Employees contribution
- 002 - Govt Contribution
- పై విధంగా జమ చేయబడిన మొత్తమును విత్డ్రా చేయటానికి వీలులేని టైర్-1 అకౌంట్ లో వుంచుతారు. నిర్భంధంగా ఉండే టైర్-1 అకౌంట్ కాకుండా అదనంగా టైర్-2 అకౌంట్ను ఎంచుకొని కంట్రిబ్యూట్ చేసుకొని, అందులో జమ చేయబడిన మొత్తం నుండి ఉద్యోగి ఇష్టపడినపుడు తన అవసరాల కోసం withdrawal చేసుకొను అవకాశం కలదు.
- పై విధంగా జమ చేయబడిన మొత్తము నోడల్ అధికారుల ద్వారా (DDO/STO/DTO) New Pension Scheme Contribution Accounting Network ద్వారా నేరుగా Trustee Bank (Axis) నందు సంబంధిత ఉద్యోగి యొక్క PRAN A/C నందు జమచేయబడి, PFRDA నియమించబడిన 3 Pension Fund Managers నందు ఈ క్రింది విధంగా పెట్టుబడి పెట్టబడును:
- (1) LIC Pension Fund : 31%
- (2) SBI Pension Fund Pvt. Ltd. : 40%
- (3) UTI Retirement Solution Ltd. : 29%
- లావాదేవీలను చూచుటకు గాను ది: 21.11.2008 కుదిరిన ఒప్పందం మేరకు Central Record Keeping Agency అయిన National Security Depository Limited Bombay వారికి పూర్తిగా అప్పగించబడింది.
- దీనిలో భాగంగా ఉపాధ్యాయులకు CPS Index Number స్థానంలో నూతన కేటాయింపే PRAN No. కేటాయింపు, Master Details మార్పు కోసం, Duplicate PRAN కొరకు మన రాష్ట్రం నందు NSDL వారు ఈ క్రింది Facility Centre ను ఏర్పాటు చేశారు:
Karvy Consultant Limited
8-2-60/K, Avenue H, Street No.1 Road No.10, Opp:Bank of Baroda, Near HSBC, Banjara Hills, Hyderabad. Ph: 040-23512454 - CPS వర్తించే ప్రతి ఉపాధ్యాయుడు విధులలో చేరిన వెంటనే ట్రెజరీ ఐడీ నెం. పొందిన వెంటనే S1 ఫారం ద్వారా PRAN A/c. No. కోసం Facility Center కు సంబంధిత నోడల్ ఆఫీసర్స్ ద్వారా (DDO/STO) పంపుకొని PRAN KIT విధిగా పొందాలి.
- మాస్టర్ డిటైల్స్ మార్పుకోసం మరియు Duplicate PRAN CARD కొరకు S2 ద్వారా పంపుకొని సవరించుకోవాలి.
- PRAN KIT ద్వారా వచ్చే I-PIN పూర్తిగా మరచిపోయిన సందర్భంలో వెబ్సైట్ ద్వారా Reissue of I-PIN తిరిగి పొందే అవకాశము కలదు.
- అదేవిధంగా టోల్ ఫ్రీ నెం. 1800-220-080 ద్వారా Re-issue of T-PIN ను పొందవచ్చును.
Check CPS Missing Credits
- CPS ఉద్యోగ ఉపాధ్యాయులు తమ జీతంలో నుండి deduct అయిన CPS amount ను నియామకపు తేదీ నుండి నెల వారీ statement రూపంలో ఇక్కడ చూసుకోవచ్చు.
- దీని ద్వారా Missing Credits ఏవైనా ఉంటే సులభంగా identify చేసే అవకాశం ఉంటుంది.
- Treasury శాఖ వారు CPS Missing Credits ను IFMIS ద్వారా upload చెయ్యవలసిందిగా DDO లకు సూచించారు.
- తమ యొక్క CPS Missing credits ఏవైనా ఉంటే వెంటనే DDO కి అందించాలి.
- కింది లింక్ లో Employee Treasury ID type చేసి, Submit పైన ట్యాప్ చేసి, నెల వారీ CPS deductions statement ను Token Number తో సహా చూసుకోవచ్చు.
Video Guide
Designed & Developed for Teachers | www.prturambabu.in