తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల కోసం అమలులో ఉన్న ఎంప్లాయ్ హెల్త్ స్కీం (EHS) కు సంబంధించి ఒకే కుటుంబంలో రెండుసార్లు (Double Contribution) చందా కట్ అయిన వారికి అదనంగా వసూలైన మొత్తాన్ని రిఫండ్ చేయడానికి ఆర్థిక శాఖ (TFR Department) తాజా మార్గదర్శకాలను విడుదల చేసింది
💠 EHS హెల్త్ కార్డ్ డౌన్‌లోడ్ విధానం
- Step 1: క్రింది లింక్ ఓపెన్ చేసి Employee Login ఆప్షన్‌ను ఎంచుకోండి.
- Step 2: మీ వివరాలతో OTP Based Login ద్వారా లాగిన్ అవ్వండి.
- Step 3: User Name: మీ Employee ID నే యూజర్ నేమ్‌గా ఉపయోగించండి.
🏥 New Health Scheme వర్తించే ఆసుపత్రుల లిస్ట్
మొత్తం 886 ఆసుపత్రుల జాబితాను ఆన్‌లైన్‌లో పొందవచ్చు. మీ జిల్లాలోని ఆసుపత్రుల వివరాలు, వారి ఫోన్ నెంబర్ల కోసం క్రింది లింక్‌ను ఉపయోగించండి.
- లింక్ క్లిక్ చేసి, వచ్చిన పేజీలో మీ జిల్లా పేరును ఎంచుకోండి.
- ఆసుపత్రుల పేర్లు, ఫోన్ నెంబర్లు కనిపిస్తాయి. వారికి కాల్ చేసి మీకు కావలసిన సహాయం/సమాచారం పొందవచ్చు.
📞 EHS ట్రస్ట్ - సందేహాలు, సలహాలు, కంప్లైంట్స్
ఎంప్లాయ్ హెల్త్ స్కీంకి సంబంధించి ఏవైనా ఫిర్యాదులు లేదా సందేహాలు ఉంటే క్రింది విభాగాలను సంప్రదించగలరు:
| విభాగం (Wing) | మొబైల్ నెంబర్ | ఇ-మెయిల్ ID |
|---|---|---|
| EHS Wings | - | ehftg@aarogyasri.gov.in |
| Grievances | 8333817455 | C154@aarogyasri.gov.in |
| Pharma | 8333817411 | TG_C305@aarogyasri.gov.in |
| Operations Wing (Preauthorisations, Claims) |
8333817332 | TG_D109@aarogyasri.gov.in |
EHS డబుల్ డిడక్షన్ రిఫండ్ - ముఖ్యాంశాలు
EHS చందా ఎంత?
ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ప్రతి నెలా ఉద్యోగులు, పెన్షనర్ల Basic Pay / Basic Pension లో 1.5% మొత్తాన్ని EHS చందాగా మినహాయిస్తున్నారు.
డబుల్ డిడక్షన్ జరిగే పరిస్థితులు
ఒకే కుటుంబంలో ఈ క్రింది సందర్భాల్లో రెండుసార్లు EHS చందా కట్ అయ్యే అవకాశం ఉంటుంది:
- భార్య, భర్త ఇద్దరూ రెగ్యులర్ ప్రభుత్వ ఉద్యోగులు కావడం.
- ఒకరు ప్రభుత్వ ఉద్యోగి, మరొకరు పెన్షనర్ లేదా కుటుంబ పెన్షనర్ కావడం.
- ఒకే వ్యక్తి సర్వీస్ పెన్షన్‌తో పాటు ఫ్యామిలీ పెన్షన్ కూడా పొందుతున్న సందర్భం.
- ఒకే కుటుంబంపై రెండుసార్లు EHS చందా మినహాయించిన ఇతర సమానమైన సందర్భాలు.
రీఫండ్ విధానం (Refund Process)
1. రెగ్యులర్ ప్రభుత్వ ఉద్యోగులకు:
- ఉద్యోగి చేయాల్సింది: సంబంధిత DDO కు దరఖాస్తు సమర్పించాలి. దరఖాస్తుతో పాటు జీవిత భాగస్వామి ఉద్యోగం/పెన్షన్ ఆధారాలు, Health Card ID, ఇతర ధృవపత్రాలు జత చేయాలి.
- DDO చేయాల్సింది: అర్హత ఉంటే IFMIS లోని ప్రత్యేక “EHS Refund” ఆప్షన్ ద్వారా Supplementary Bill సమర్పించి రిఫండ్ చెల్లించాలి.
2. పెన్షనర్లు / కుటుంబ పెన్షనర్లకు:
- సంబంధిత Treasury Office / Pension Payment Office కు పత్రాలతో దరఖాస్తు ఇవ్వాలి.
- అధికారులు ధృవీకరణ అనంతరం IFMIS ద్వారా రీఫండ్ బిల్లు రూపొందించి చెల్లింపు చేస్తారు.
DDO లకు ప్రభుత్వ కఠిన ఆదేశాలు
- IFMIS మాడ్యూల్: రీఫండ్ క్లెయిమ్‌ల కోసం IFMIS లో ప్రత్యేకంగా “EHS Refund” మాడ్యూల్ అందుబాటులో ఉంటుంది. ముందుగా ఉద్యోగి వివరాలు నమోదు చేయాలి.
- బాధ్యత: భవిష్యత్తులో EHS డబుల్ డిడక్షన్ జరగకుండా DDO లు తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలి. నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు ఉంటాయి.
- గడువు: ఈ సర్క్యులర్ జారీ చేసిన తేదీ నుంచి ఒక నెలలోపు అర్హులైన అన్ని రీఫండ్ క్లెయిమ్‌లను పరిష్కరించాలి.