ఉద్యోగ , ఉపాధ్యాయ మిత్రులకు స్వాగతం సుస్వాగతం పి అర్ టి యు పినపాక మండల శాఖ ......

GPF PORTAL

జి.పి.యఫ్ (GPF) నియమ నిబంధనలు

Know Your Fund Details (GPF Slips & Links):

  1. అర్హత: పర్మనెంట్ బేసిస్ మీద రెగ్యులర్ స్కేలులో నియామకమయిన నాన్-గెజిటెడ్/గెజిటెడ్ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులు నియామకమయిన తేది నుండి జి.పి.యఫ్ లో చేరవలసి ఉంటుంది. ఆఖరి స్థాయి ఉద్యోగులు గృహనిర్మాణం కోసం స్థలం కొనుగోలుకై లేదా గృహనిర్మాణానికి అవసరమైన డబ్బు, గృహ రిపేరింగులకై కనీసం 5 సం॥ల సర్వీసు పూర్తి చేసిన వారు, ఇంకా 10 సం॥ల సర్వీసు కలిగిన వారు కూడా జి.పి.యఫ్. లో చేరుటకు అర్హులు.
  2. వర్తించని వారు: తేది 1-9-2004 నాటి నుండి ఉద్యోగములో చేరిన వారు జి.పి.యఫ్. స్కీం లో చేరుటకు అర్హులు కారు (GO.Ms.No.654 తేది 22-9-2004). (గమనిక: DSC 2002 వారికి జి.పి.యఫ్ సౌకర్యము కలుగజేయబడినది. C&DSE Procs No.48857/D2-3/10, Dt.20-12-2010).
  3. నిర్వహణ: జి.పి.యఫ్. అకౌంటులను చూసే బాధ్యత అకౌంటెంట్ జనరల్ (AG) గారికి అప్పగించబడినది. పంచాయతీ రాజ్ సంస్థలలో పనిచేయు ఉద్యోగుల, ఉపాధ్యాయుల GPF అకౌంటులు మొత్తము జిల్లా పరిషత్తు CEO గారు నిర్వహిస్తారు.
  4. మంజూరు అధికారులు: ఈ GPF నుండి అప్పులు, పార్ట్ ఫైనల్స్ ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులకు ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులకు మండల విద్యాధికారి (MEO), ఉన్నత పాఠశాల ప్ర.ఉ.లకు ఉపవిద్యాధికారి (DyEO) మంజూరు చేయవచ్చు (GO.Ms.No.40, dt.7-5-2002).
  5. చందా (Premium): ప్రతి ఉపాధ్యాయుడు/ఉద్యోగి తన వేతనము నుండి ప్రతినెల కనీసము 6% నకు తగ్గకుండా ప్రీమియం చెల్లించాలి. జి.పి.యఫ్ ప్రీమియంను సంవత్సరమునకు ఒకసారి తగ్గించవచ్చును, లేదా సంవత్సరమునకు రెండుసార్లు పెంచవచ్చును. ఈ ప్రీమియంను రిటైర్మెంటుకు నాలుగు నెలల ముందు నిలుపుదల చేయవచ్చు. ఇలా చెల్లించిన నిల్వలపై ఆయా కాలములలో వడ్డీ రేట్లు లభించును.
  6. నామినీ: జి.పి.యఫ్.లో సభ్యులుగా చేరిన వెంటనే సర్వీసులో ఉండగా అనుకోని సంఘటనల ద్వారా తనకు ఏమైనా జరిగినచో అట్టి డబ్బును చెల్లించుటకై నామినీ ఫారము దాఖలు చేయాలి. ఈ నామినీ పేరును సర్వీసు పుస్తకములో ఎంట్రీ చేయించడము చాలా ముఖ్యము.

GPF నుండి అడ్వాన్సు (తాత్కాలిక రుణం):

GPF లో నిలువయున్న మొత్తం నుండి ఈ క్రింది నిబంధనలకు లోబడి తాత్కాలికముగా రుణము పొందడానికి అవకాశము కలదు:

  • ఈ రుణం ఉద్యోగి 3 నెలల జీతమునకు సమానమైన లేదా జమచేయబడిన డబ్బు నుండి 50%... ఈ రెండింటిలో ఏది తక్కువయితే ఆ మొత్తాన్ని రుణంగా మంజూరు చేయవచ్చు.
  • ఒక ఉద్యోగి ఒక ఆర్ధిక సంవత్సరములో రెండుసార్లు GPF రుణం పొందవచ్చు.
  • తనకు లేదా తనపై ఆధారపడిన వారి సుదీర్ఘకాల చికిత్స అవసరాల కొరకు.
  • తనకు లేదా తనపై ఆధారపడిన వారి ఉన్నత విద్య కొరకు (స్వదేశంలో లేదా విదేశాలలో).
  • తనకు లేదా తమ పిల్లల నిశ్చితార్థం, వివాహములకు, జన్మదిన వేడుకలకు, కుటుంబీకుల అంత్యక్రియలకు.
  • ఉత్సవం నిర్వహణలో భాగంగా తీర్థయాత్రలకు వెళ్లవలసి వస్తే దాని ఖర్చుల కొరకు.
  • ఉద్యోగ విధినిర్వహణ సందర్భంగా తలెత్తిన ఆరోపణలను ఎదుర్కొనడానికి కావలసిన ఖర్చుల నిమిత్తమై.
  • గృహనిర్మాణంలో భాగంగా స్థల సేకరణకు, గృహనిర్మాణమునకై, గృహ రిపేరులకై అయ్యే ఖర్చుల కొరకై.
  • ఉద్యోగ విరమణ తేదికి ఆరునెలల ముందు వ్యవసాయ భూములు మరియు వ్యాపారస్థలం కొనుగోలుకై లేదా మోటారు కారు కొనుగోలు కోసం.
  • చెల్లింపు: నిర్ణీత ప్రొఫార్మా యందు వినతిపత్రము, రుణము పొందుటకు గల కారణములకు ఆధారములు జతపరుస్తూ అధికారులకు సమర్పించాలి. తీసుకున్న రుణము 6 వాయిదాలకు తగ్గకుండా 24 వాయిదాలకు మించకుండా తిరిగి చెల్లించాలి (G.O.Ms.397 Dt.14-11-2008).

పార్ట్ ఫైనల్ విత్ డ్రాయల్స్ (Part Final Withdrawals):

20 సంవత్సరాల సర్వీసును పూర్తిచేసుకున్న ఉద్యోగులు లేదా 10 సంవత్సరముల లోపల రిటైర్ అవుతున్న ఉద్యోగులు తమ ప్రావిడెంట్ ఫండ్ లో నిలువయున్న డబ్బు నుండి పార్ట్ ఫైనల్ విత్ డ్రాయల్ చేసుకోవచ్చు. ఈ మొత్తాలను తిరిగి చెల్లించవలసిన అవసరం లేదు.

  • కుమారుడు, కుమార్తెల ఉన్నత విద్యాభ్యాసం మరియు వివాహాల కొరకు.
  • ఆరోగ్య కారణాల వల్ల ఎదురయ్యే ఆరోగ్య, వైద్య, ప్రత్యేక ఆహార, ప్రయాణ ఖర్చులకై.
  • ఒకే కారణం కోసం రెండుసార్లు పార్ట్ ఫైనల్ చేసుకోవడానికి అవకాశం లేదు.
  • గృహ సంబంధ అంశాల (ఇల్లు కొనడం/కట్టడం) విషయంలో ఉద్యోగి 15 సంవత్సరాల సర్వీసు పూర్తిచేసినా పార్ట్ ఫైనల్ పొందడానికి అర్హత కలదు. దీనికి అగ్రిమెంట్, బ్యాంకు వివరాలతో రెండు పది రూపాయల బాండ్ పేపర్లు జతచేయాలి.
  • ఒక ఆర్థిక సంవత్సరంలో రెండు సార్లకు మించరాదు మరియు ఒక అడ్వాన్సుకు మరొక అడ్వాన్సుకు మధ్య ఆరు నెలల వ్యవధి తప్పక ఉండాలి (Rule 15-B Note-1).
  • రిటైర్ అవుతున్న ఉద్యోగి తన ఆఖరు నాలుగు నెలల ఉద్యోగ కాల సమయములో పార్ట్ ఫైనల్ విత్ డ్రాయల్ కు అవకాశం లేదు.
  • పార్ట్ ఫైనల్ విత్ డ్రాయల్ అత్యవసర పరిస్థితులను బట్టి 6 నెలల జీతము లేదా 10 నెలల జీతమునకు సరిపడు డబ్బు లేదా నిలువలో ఉన్న డబ్బు నుండి 75% వరకు మంజూరు చేయవచ్చును. దీనికి ఎలాంటి రికవరీ ఉండదు.
  • G.O.Ms.No.447 Dt.28-11-2013 ద్వారా పంచాయతీరాజ్ ఉపాధ్యాయులకు జి.పి.ఎఫ్ నిల్వలపై అప్పులు మంజూరు చేయు అధికారం HM/MEO లకు కలదు.
  • ప్రధానోపాధ్యాయులకు, బోధనేతర సిబ్బందికి గతంలో వలెనే జిల్లా పరిషత్ ఉప ముఖ్య కార్యనిర్వహణ అధికారి (Dy. CEO) అప్పులు మంజూరు చేస్తారు.

బూస్టర్ స్కీం (Booster Scheme):

  • రూలు 30(A) ప్రకారం GPF చందాదారుడు ఆకస్మికంగా మరణించిన సందర్భంలో అదనపు ప్రయోజనంగా, మరణానికి 3 సంవత్సరాల ముందు తన ఖాతాలో గెజిటెడ్ వారికి రూ.8,000, నాన్ గెజిటెడ్ వారికి రూ.6,000, లాస్ట్ గ్రేడ్ వారికి రూ.2,000 బ్యాలెన్స్ కన్నా ఎక్కువ ఉండాలి.
  • అలాంటి వారికి G.O.Ms.No.42 Dt: 29.1.2003 ప్రకారం సరాసరి నిల్వ విలువకు రెండింతల మొత్తం, గరిష్టంగా రూ.20,000 మించకుండా చెల్లిస్తారు.
  • చనిపోయే రోజు వరకు ఉద్యోగి కనీసం 5 సంవత్సరాల సర్వీసు పూర్తిచేసి ఉండాలి.
పాస్వర్డ్ మార్చుకునే విధానం (Forgot Password):
ఫోన్ నెంబర్ కరెక్ట్ గా ఉన్నప్పుడు E-PANCHAYAT (TS ZPGPF Slips) వెబ్సైట్ ద్వారా లాగిన్ కావాలి. పాస్వర్డ్ తెలియనప్పుడు "FORGOT PASSWORD" ఆప్షన్ ప్రెస్ చేసి కొత్త పాస్వర్డ్ తయారు చేసుకోవచ్చు.

Forgot Password ప్రెస్ చేసినప్పుడు EID మరియు CG GPF నెంబరు ఎంటర్ చేశాక, క్రింద 'Generate OTP' పైన క్లిక్ చేయండి. మీ మొబైల్ కి వచ్చిన OTP ని ఎంటర్ చేసి 8 అంకెల (8 digits) New Password క్రియేట్ చేసుకోండి.

Designed & Developed for Teachers | www.prturambabu.in