ఉద్యోగ , ఉపాధ్యాయ మిత్రులకు స్వాగతం సుస్వాగతం పి అర్ టి యు పినపాక మండల శాఖ ......

Teachers (Employees) Income Tax Software 2024- 25 Available now ........

విద్యాల‌క్ష్మి పోర్ట‌ల్ ద్వారా విద్యా రుణం

విద్యాల‌క్ష్మి పోర్ట‌ల్ ద్వారా విద్యా రుణం ఎలా అప్లై చేయాలంటే...
ముందుగా.. www.vidyalakshmi.co.in వెబ్‌సైట్‌లో మన పర్సనల్ డీటెయిల్స్ ఫిల్ చేయాలి.


* మన డీటెయిల్స్‌ని బట్టి ఎంతవరకూ లోన్ పొందొచ్చో తెలుసుకోవచ్చు.
* మన వివరాలు చూసి పరీక్షించిన బ్యాంక్స్ మనం లోన్‌ తీసుకునేందుకు అర్హులో.. కాదో తెలియజేస్తాయి.
* ఒకవేళ మనం అర్హులైతే నగదు నేరుగా మనం ఇచ్చిన అకౌంట్‌లో చేరుతుంది. ఒకవేళ మీ అప్లికేషన్ హోల్డ్‌లో ఉంటే.. మన నుంచి బ్యాంక్ అదనపు వివరాలు కోరుతుందని అర్థం.
* ఆ సమయంలో ఏమైనా వివరాలు మనం పొందుపరిచామో లేదో ఒకసారి మళ్లీ చెక్ చేసుకోవాలి.



- ఇదివ‌ర‌కూ విద్యా రుణం పొందాలంటే బ్యాంకు శాఖ‌ల‌కు వెళ్లి అన్ని వివ‌రించి రుణ ద‌ర‌ఖాస్తు ఆమోదం పొందాల్సి వ‌చ్చేది. విద్యార్థులు, వారి త‌ల్లిదండ్రులు ప‌డుతున్న ఇబ్బందుల‌ను గ‌మ‌నించిన ప్ర‌భుత్వం దీన్ని సుల‌భ‌త‌రం చేసే ప్ర‌య‌త్నం చేసింది. భార‌తీయ బ్యాంకుల సంఘం, కేంద్ర మాన‌వ వ‌న‌రుల శాఖ‌, ఆర్థిక శాఖ‌ల ఉమ్మ‌డి సౌజ‌న్యంతో ఒక ఉమ్మ‌డి పోర్ట‌ల్‌ను తీసుకొచ్చింది. దీనిపేరే విద్యాల‌క్ష్మి

- ఈ ప‌థ‌కానికి ద‌ర‌ఖాస్తు చేసుకునేందుకు విద్యార్ధులు విద్యాల‌క్ష్మి పోర్ట‌ల్‌లో త‌మ ఖాతాను న‌మోదు చేసుకోవాలి. త‌ర్వాత కొన్ని వివ‌రాల‌ను నింప‌డం ద్వారా ఉమ్మ‌డి విద్యా రుణ ద‌ర‌ఖాస్తు ఫారాన్ని పూరించాలి. ఫారంను నింపిన త‌ర్వాత‌, ద‌ర‌ఖాస్తుదారు విద్యారుణం కోసం శోధించ‌వ‌చ్చు. విద్యార్థి అవ‌స‌రాలు, అర్హ‌త‌, సౌక‌ర్యానికి అనుగుణంగా ద‌ర‌ఖాస్తు చేసే వీలుంటుంది.


- వివిధ బ్యాంకుల్లో వేర్వేరు ప‌థ‌కాల‌కు సంబంధించి ఒకేచోట ద‌ర‌ఖాస్తు చేసుకునేందుకు వీలుక‌ల్పించేదే ఉమ్మ‌డి విద్యా రుణ ద‌ర‌ఖాస్తు ఫారం. విద్యాల‌క్ష్మి పోర్ట‌ల్‌కు విద్యార్థులు న‌మోదు చేసుకున్న త‌ర్వాత మొద‌ట చేయాల్సిన ప‌ని ఈ ఫారాన్ని నింప‌డ‌మే. త‌ర్వాత మీకు అనువైన బ్యాంకుల‌కు రుణం కోసం ద‌ర‌ఖాస్తు చేయ‌వ‌చ్చు.


- బ్యాంకుల‌న్నీ ప్ర‌త్యేకంగా ఈ వెబ్‌సైట్‌లో లాగిన్ అయి త‌మ స్టేట‌స్‌ను అప్‌డేట్ చేస్తాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని విద్యార్థులు ద‌ర‌ఖాస్తుదారు డ్యాష్‌బోర్డ్‌పై త‌మ స్థితిగ‌తుల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు తెలుసుకోవ‌చ్చు. ఏదైనా బ్యాంకు రుణ‌మిచ్చేందుకు అంగీక‌రిస్తే వారు తెలిపిన ప‌త్రాలతో బ్యాంకుకు వెళ్లాలి. కొన్ని బ్యాంకులు తాము రూపొందించిన నిబంధ‌న‌ల‌కు అనుగుణంగా లేని ద‌ర‌ఖాస్తుల‌ను తిర‌స్క‌రించే అవ‌కాశం సైతం ఉంది.


ఒక్కో బ్యాంకు ఒక్కో ర‌క‌మైన రుణ ప‌థ‌కాల‌ను ప్ర‌వేశ‌పెడుతూ ఉంటాయి. ఉదాహ‌ర‌ణ‌కు ఆంధ్రా బ్యాంకు ప‌ట్టాభి విద్యా జోతి పేరుతో, కెన‌రా బ్యాంకు విద్యాసాగ‌ర్ పేరుతో విద్యా రుణాల‌ను అందిస్తున్నాయి. బ్యాంకును బ‌ట్టి విద్యా రుణానికి త‌మ‌వైన ప్ర‌త్యేక‌త‌లుంటాయి. వెబ్‌సైట్‌లోని సెర్చ్ పేజీలో ఈ రుణ ప‌థ‌కాల‌ను గురించి చూడొచ్చు.


-ఉమ్మ‌డి విద్యా రుణ ద‌ర‌ఖాస్తు ఫారం ద్వారా విద్యార్థి గ‌రిష్టంగా మూడు బ్యాంకుల‌కు ద‌ర‌ఖాస్తు చేయ‌వ‌వ‌చ్చు.