ఉద్యోగ , ఉపాధ్యాయ మిత్రులకు స్వాగతం సుస్వాగతం పి అర్ టి యు పినపాక మండల శాఖ ......

Teachers (Employees) Income Tax Software 2024- 25 Available now ........

Navodaya 6th Entrance Exam Results 2019 Selection List | JNV Class VI Jawahar Navodaya Vidyalaya Results 2019 All India results available in PDF 2019


 నవోదయ విద్యాలయ సమితి ప్రాంతీయ కార్యాలయము, హైదరాబాద్

2019-20, విద్యా సంవత్సరానికి జవహర్ నవోదయ విద్యాలయ 6వ తరగతి ప్రవేశ పరీక్ష ఫలితాలు ప్రకటించబడినవి. 2019-2020 విద్యా సంవత్సరానికి గాను జవహర్ నవోదయ విద్యాలయ 6వ తరగతి ప్రవేశ పరీక్ష 6 ఏప్రిల్ 2019 నాడు నిర్వహించబడి ఎంపిక చేయబడిన విద్యార్థుల జాబితా ప్రకటించబడినవి, అభ్యర్థులు వారి యొక్క ఫలితాలు నవోదయ పోర్టల్ www.nvsadmissionclassix.in ద్వారా మీ యొక్క నవోదయ ఎంపిక పరీక్ష రూల్ నంబర్ ఉపయోగించి లాగిన్ అయ్యి తెలుసుకొనవచ్చును.

ప్రవేశ పరీక్ష రిజిస్ట్రేషన్ నంబర్ మరియు పాస్వర్డ్ ద్వారా లాగిన్ అయ్యి జవహర్ నవోదయ విద్యాలయ 6వ తరగతి ప్రవేశానికై అంగీకారం తెలుపవలెను. ప్రవేశ పరీక్ష రీజిస్ట్రేషన్ సమయంలో ఆన్లైన్ లో ఇచ్చిన డాక్యుమెంట్స్ పొందుపరచు వరకు, ఈ అభ్యర్థుల ఎంపిక తాత్కాలికము మాత్రమే. ఈ ప్రవేశానికై జవహర్ నవోదయ విద్యాలయములో సమర్పించవలసిన ఫార్మాట్లు మరియు వివరములు పోర్టల్ ద్వారా డౌన్లోడ్ చేసుకొనవచ్చును.