అది వారి చదుపు కూడా ప్రభావితం చేస్తుంది. కాబట్టి పిల్లలకు సహజమైన నాయకత్వపు లక్షణాలు పెంపొందింప తీయడానికి, వారికి బడి పట్ల ఆసక్తిని కలిగించడానికి, వారిని భాగస్వాములను చేయడం ద్వారా బరి లో హాజరు ను పెంచడానికి ప్రతి పాఠశాలలో "బాలల సంఘాలను ఏర్పరచాలి. అన్ని పాఠశాలల్లో ఈ కింది బాలల సంఘాలు ఏర్పాటు కావాలి. బాలల సంఘాలు వివరాలు ఈ కింది విధముగా ఉన్నవి.
బాలల సంఘాలు:
బడిలో చేరిన పిల్లలందరూ రోజు బడికి హాజరు కావడం అత్యంత ఆవశకం, బడి కి రోజూ హాజరైనప్పుడే నేర్చుకోవడం సాధ్యమవుతుంది. పిల్లలు బడికి హాజరు కాకపోవడానికి అనేక కారణాలు వుండవచ్చు. వాటిలో అనారోగ్యం, పండుగలు /జాతరలు వెళ్ళడం, వారి కుటుంబాలలో జరిగే వివిధ కార్యక్రమాలు వంటివి మనకు ఎక్కువగా దృష్టిలోకి వస్తుంటాయి,వాటిని పరిశీలించి ఎప్పటికప్పుడు తల్లిదండ్రుల తో మాట్లాడటం ద్వారా పిల్లలు బడికి వచ్చేలా చేయవచ్చు. బడికి పిల్లలు రోజూ హాజరు కావాలంటే కేవలం పాఠ్య బోధన కే పరిమితమై తే సరిపోదు, పిల్లలను వివిధ కార్యక్రమాల్లో భాగస్వాములను చేయడం ద్వారా వారు రోజు బడికి హాజరయ్యే లా చేయవచ్చు. పిల్లలు సహజంగానే నాయకత్వ లక్షణాలు కూడా ఉంటాయి,
పిల్లలు ఆడుకునే టప్పుడు తోటివారి గడిపే టప్పుడు నిశితంగా గమనిస్తే వారిలో నాయకత్వ లక్షణాలు గుర్తించవచ్చు, సాధారణంగా నాయకులు గా వ్యవహరించే పిల్లలు అన్నింటిలో ముందుంటారు. ఇది వారి చదువు కూడా ప్రభావితం చేస్తుంది. కాబట్టి, పిల్లలకు సహజమైన నాయకత్వపు లక్షణణాలను పెంపొందింపజేయడానిధి, పారికి బడి పట్ల ఆసక్తిని కలిగించడానికి, వారి ని భాగస్వాములు చేయడం ద్వారా బడి లో హజరు పెంచడానికి ప్రతిపాఠశాలలో బాలల సంఘాల ను ఏర్పరచాలి. అన్ని పాఠశాలల్లో ఈ కింది బాలల సంఘాలు ఏర్పాటు కావాలి.
1) పిల్లలు హాజరు కమిటీ
2) ప్రయోగశాల నిర్వహణ కవింటి
3) గ్రంథాలయ కమిటీ
4) ఆటలు, క్రీడలు కమిటీ
5) సాంకేతిక వనరుల వినియోగ కమిటీ (ICT)
6) సృజనాత్మక కమిటీ
7) పచ్చదనం, పరిశుభ్రత కమిటీ
8) సురక్షిత పాఠశాల కమిటీ
10) సమాజ భాగస్వామ్యం, ధన్మాతర సామాజిక పరివర్తన - వివిధ కార్యక్రమాలు కమిటీ
1) పిల్లలు హాజరు కమిటీ :
ఈ కమిటీ లో విద్యార్థులు కింది కార్యక్రమాలను నిర్వహించాలి.
ప్రతి పాఠశాలలో తరగతి వారీగా, పాఠశాలకు పిల్లల హాజరు పెంచడానికి పిల్లలతో హాజరు కమిటీలనుఏర్పరచాలి, అలాగే విద్యార్థుల తల్లులతో కూడా పాఠశాల హాజరు కమిటీ ఏర్పరచాలి. తరగతిలో విద్యార్థులు లో అత్యధిక హాజరు న్న పిల్లలతో పాటు తక్కువ హాజరు న్న పిల్లలు, వారి తల్లులను సభ్యులుగా చేర్చాలి.
ప్రతి పాఠశాలకు 10 మంది పిల్లలతో బాలల హాజరు కమిటీ, వారి తల్లులతో కూడా హాజరు కమిటీని ఏర్పాటుచేయాలి, వేరు బడికి సక్రమంగా హాజరుకాని పిల్లలు గుర్తించి, వారితో మాట్లాడటం, వారి ఇళ్ళకు వెళ్ళడం, తల్లిదండ్రులు తెలియజేయడం ద్వారా బడికి హాజరుకాని పిల్లలు సక్రమంగా హాజరయ్యేలా చూడాలి,
వివరాలు :
పాఠశాలలో ప్రతి తరగతికి కూడా హాజరు కమిటీ ఉంటుంది. ఆ హాజరు కమిటీ లోని విద్యార్థుల పేర్లను తరగతిలో ప్రదర్శించాలి.
వారి ద్వారా ఆ తరగతిలో ఐడి కి సక్రమంగా హాజరు కాని విద్యార్థుల వివరాలు సేకరించాలి. అనగా వరుసగా 5 రోజులు దాడికి హాజరుకాని విద్యార్థులు గుర్తించాలి..
తరగతి వారీగా ఇలాంటి విద్యార్థుల జాబితా ఫు రూపొందించాలి. వారి తల్లిదండ్రులకు ఈ విషయాన్ని తెలియజేయా, ఇట్లా వేరుగా ఆ విద్యార్థులతోనే మాట్లాడి వాడికి ఎందుకు హాజరుకావడంలేదో తెలుసు కోవాలి, వాడు బడికి వచ్చే లా మాట్లాడి ఒప్పించాలి, రప్పించాలి,
- అవసరమైతే ఉపాధ్యాయులు / ప్రధానోపాధ్యాయుల దృష్టికి హాజరు కమిటీ సభ్యులు తీసుకొని రావాలి. సమస్యను పరిష్కరించాలి.
2) ప్రయోగశాల నిర్వహణ కమిటీ :
- పాఠశాలలో ప్రయోగశాలలో విద్యార్థులు ప్రయోగాలు నిర్వహించి నేర్చుకోవడానికి ఈ కమిటీ ఏర్పరచాలి.
- ప్రయోగాలు నిర్వహణకు అవసరమయ్యే సామగ్రి గురించి ఉపాధ్యాయులకు తెలియజేయడం, తరగతి వారి గా విద్యార్థులు ప్రయోగశాల వెళ్ళి ప్రయోగాలు నిర్వహించడం మొదలగునవి పరిశీలిస్తారు.
- ప్రయోగం నిర్వహణానంతరం ప్రయోగశాల రికార్డును రాయడంలో తోటి విద్యార్థులకు సహకరిస్తారు.
- ప్రయోగం విర్వహణ కోసం స్థానిక పరిసరాల లో లభించే వస్తు సామగ్రి / ఉపకరణాలను సేకరించడానికి
3) గ్రంథాలయ కమిటీ :
- పాఠశాలలో ప్రతి తరగతికి కూడా గ్రంథాలయ కమిటీ ఉంటుంది. వీరి పేర్లను ప్రదర్శించాలి.
- పాఠశాల గ్రంథాలయంలోని పుస్తకాలు వివరాలు తెలుసుకోవాలి,
- తరగతి వారీగా అవసరమైన పుస్తకాల జాబితా ను ఉపాధ్యాయ సహకారం తో సిద్ధం చేసుకోవాలి.
- వాటిని ఆయా తరగతుల్లో తరగతి గ్రంథాలయ కమిటీలకు అప్పగించాలని. తరగతి లోనే విద్యార్థులందరికీ అందుబాటులో ఉండేలా చూడమని చెప్పాలి.
- ఒక్క తరగతిలో ఎంతమంది విద్యార్థులు గ్రంథాలయ పుస్తకాలు చదువుతున్నారు వివరాలు సేకరించాలి.
- వార్తా పత్రికలలో ముఖ్యాంశాలు, పజిల్స్, క్రీడలు, కథ, సూక్తులు, లేఖలు వంటి వాటిని స్కూల్ అసెంబ్లీ సమయం లో చదివి వినిపించడానికి ప్రణాళిక చేసుకోవాలి,
తరగతి వారి గా చదవడానికి అవసరమైన పుస్తకాల గురించి ఉపాధ్యాయులకు, ప్రధానోపాధ్యాయులు తెలియజేయాలి,
- ప్రతి నెలలో నెలకొక మారు సమావేశాలు నిర్వహించుకొని వివరాలు నమోదు చేసుకోవాలి,
4) ఆటలు, క్రీడలు కమిటీ :
- పాఠశాలలో ప్రతి తరగతికి కూడా ఆటలు, క్రీడల కమిటీ ఉంటుంది.
- తరగతి వారీగా పిల్లలందరూ కేటాయించిన ఆటలు పీరియడ్ లో పాల్గొనేలా చూడాలి.
- ప్రతి ఒక్కరూ ఏదో ఒక ఆట ఆడేలా ప్రోత్సహించాలి.
- ఏ ఆటలో పాల్గొనాలి విద్యార్థుల ను గుర్తించి ఎందుకు పాల్గొనడం లేదో తెలుసుకోవాలి,
- మాస్ డ్రిల్, యోగ, ధ్యానం వంటివి నిర్వహించడానికి సహకరించాలి..
- పాఠశాల లో క్రీడా పరికరాలు, ఆట వస్తువులు జాగ్రత్త పరచడం, విద్యార్థులకు అందించడం, తిరిగి తీసుకోని భద్రపరచడం వంటివి చేయాలి.
- పాఠశాల క్రీడోత్సవాలు నిర్వహించడం గురించి ప్రణాళిక చేయాలి,
5) సాంకేతిక వనరుల వినియోగ కమిటీ (ICT);
- పాఠశాల లో కంప్యూటర్ ల్యాబ్స్ ద్వారా అందరు పిల్లలకు ప్రయోజనం చేకూరడానికి విద్యార్థులతో కమిటీ ఏర్పరచాలి.
- వీరు తరగతి వారీగా కంప్యూటర్ ల్యాబ్స్ ను విద్యార్థులు వినియోగించుకోవడం లో సహకరిస్తారు.
- కంప్యూటర్ ల్యాబ్స్ ద్వారా నేర్చు కుంటున్న పిల్లలకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తారు.
- వీటిలోని సామగ్రి, సరిగా పని చేయకుంటే ప్రధానోపాధ్యాయుడి దృష్టికి తీసుకు వెళ్తారు,
6) సృజనాత్మక కమిటీ :
- పాఠశాలలో ప్రతి తరగతికి కూడా సృజనాత్మక కమిటీ ఉంటుంది,
- పిల్లలలో సహజంగా సృజనాత్మక శక్తి ఉంటుంది, బొమ్మలు గీయడం, కథలు రాయడం, కథలు చెప్పడం, బొమ్మలు తయారు చేయడం, ప్రయోగాలు చేయడం, నూతన ఆవిష్కరణలు చేయడం వంటివి చేస్తుంటారు. ప్రస్తుత పాఠ్య పుస్తకాలు కూడా ఇందుకనుగుణమైన కృత్యాలు ఉన్నవి. వీటిని ఆయా తరగతులు ప్రదర్శిస్తున్నారా లేదా చూడాలి.
- తరగతి వారి కమిటీలు చర్చించి పాఠశాల కమిటీ సభ్యులు వాటి నుండి మంచి వాటిని ఎంపిక చేయాలి, అన గా పిల్లలు రాసిన మంచి కథలు, పాటలు, గీసిన బొమ్మలు, నూతన ఆవిష్కరణలు మొదలగునవి.
- వీటితో పాఠశాల స్థాయిలో సంకలనాలు రూపొందించాలి, ప్రదర్శించాలి.
- పాఠశాలలో నిర్వహించే వివిధ దినోత్సవం సందర్భంగా వారికి సంబంధించిన సృజనోత్సవాన్ని నిర్వహించడంలో తోడ్పడాలి.
- రాష్ట్రీయ ఆవిష్కార్ ద్వారా సైన్స్, గణితం, సాంకేతిక అంశాల ఆధారంగా నూతన ప్రయోగాలు చేపట్టడంలో సహాయపడాలి,
- ఇన్ స్పైర్ అవార్డు స్కీం ద్వారా సైన్స్ లో వినూత్న విషయాలను ఆవిష్కరించిన వారిని, సైన్స్ పట్ల ఆసక్తిని పెంచేలా కృషి చేసేవారిని ఈ అవార్డుకు ఎంపికయ్యేలా ప్రోత్సహించాలి,
7) పచ్చదనం, పరిశుభ్రత కమిటీ :
- పాఠశాల లోని ప్రతి తరగతికి కూడా పచ్చదనం, పరిశుభ్రత కమిటీ ఉంటుంది. వీరి పేర్లను ప్రదర్శించాలి.
- తరగతి గదులను తరగతి కమిటీ పరిశుభ్రంగా ఉండాలి బాధ్యత వహించాలి. చెత్త కాగితాలను చెత్తబుట్టలో వేసేలా చూడాలి.
- అట్లాగే పాఠశాల ఆవరణ ను పరిశుభ్రంగా ఉండాలి పాఠశాల పచ్చదనం, పరిశుభ్రత కమిటీ బాధ్యత వహించాలి,
- విద్యా సంవత్సరం ప్రారంభం లో నిర్వహించే హరితహారం కార్యక్రమాన్ని వీర నిర్వహించాలి.
- మొక్కలను సేకరించి నాటడం, ఒక్కొక్క మొక్కకు ఒక విద్యార్థి బాధ్యతలు అప్పగించడం, వాటికి నీరు పోయడం, వాటి ఎదుగుదలకు కృషి చేయడం గురించి చూడాల్సి ఉంటుంది.
- పాఠశాలకు ఎన్ని మొక్కలు వచ్చి నై, ఎన్ని వాటారు, ఎన్ని చక్కగా పెరుగుతున్న వంటివి సమోదు చేసుకోవాలి,
- విద్యార్థులందరూ వ్యక్తిగత పరిశుభ్రత ను పాటించేలా చూడాలి. అనగా మధ్యాహ్న భోజనానికి ముందు చేతులు కడుక్కోవడం, ఆహార పదార్థాలు పృధా కాకుండా తినడం, తిన్న స్థలం, పిండి స్థలం పరిశుభ్రంగా ఉండేలా చూడాలి,
8) సురక్షిత పాఠశాల కమిటీ :
- పాఠశాలలో ప్రతి తరగతికి కూడా సురక్షిత పాఠశాల కమిటీ ఉంటుంది.
- పిల్లలు అందంగా, ఆహ్లాదంగా తమ హక్కులను అనుభవిస్తూ తమ బాల్యాన్ని గడపవలసి ఉంటుంది. దీనికి పాఠశాల సురక్షితమైన వాతావరణాన్ని అందించాలి.
- బాలల హక్కులు భంగం కలిగించే లైంగిక వేధింపులు, మత్తు పదార్థాల వాడటం, అక్రమ రవాణా, బాల కార్మిక త వంటి సమస్యలు తమ తోటి వారికి ఈ కమిటీ అవగాహన కల్పించాలి.
- సైబర్ సెక్యూరిటీ, అంతర్జాలాన్ని సురక్షితంగా వాడడము / సద్వినియోగ పరచుకోవటం (సేఫ్ ఇంటర్నెట్) గురించి మిగతా విద్యార్థులకు ఈ కమిటీ అవగాహన కల్పించాలి.
9) సమాజ భాగస్వామ్యం, ధన్మాతక సామాజిక పరివర్తన - వివిధ కార్యక్రమాలు కమిటీ :
- పాఠశాలలో నిర్వహించే సాంస్కృతిక, సాహిత్య కార్యక్రమాలను సమాజ భాగస్వామ్యంతో నిర్వహించాలి.
- సమకాలీన సామాజిక అంశాలు గురించి చర్చ లు, గోష్టి, ప్రదర్శనలు, పోస్టర్లు, కరపత్రాలు మొదలగునవి రూపొందించి అవగాహన కల్పించాలి. సమాజ భాగస్వామ్యంతో నిర్వహించాలి .
- పాఠశాల నిర్వహించే వార్షికోత్సవాలు, బాలల దినోత్సవం, గ్రంథాలయ వారోత్సవాలు, బాలల సభలు మొదలగు వాటి నిర్వహణకు సమాజ సభ్యుల తో మాట్లాడటం, వారు పాల్గొనేలా చేయాలి.
- గ్రామం లో / సమాజంలో నిర్వహించబడే వివిధ కార్యక్రమాలు పాఠశాల పక్షాన పాల్గొనాలి,
- ప్రతి పాఠశాలలో ఇందు కోసం సమాజ భాగస్వామ్యం, వివిధ కార్యక్రమాల కమిటీని ఏర్పాటు చేసుకోవాలి.
- బడి లో మాస వారీగా నిర్వహించాల్సిన సాంస్కృతిక - సాహిత్య కార్యక్రమాలు ప్రణాళిక ను రూపొందించుకోవాలి,
- నెలలో అకడెమిక్ క్యాలెండర్ లో సూచించిన విధంగా ఒక్క శనివారం రోజు బాల సభను నిర్వహించాలి.
- బాల సభ లో ఏయే అంశాలు ప్రదర్శించాలో నిర్ణయించాలి. అందుకనుగుణంగా విద్యార్థులకు తెలియజేసి సిద్ధం చేయాలి.
- మాసవారీగా నిర్వహించే బాల సభ వివరాలు నమోదు చేయాలి,
- ఈ కమిటీ సాహిత్య, భాషా సంబంధ కార్యక్రమాలు కూడా రూపొందించిన అమలు చేయాలి.
- పాఠశాల లో సాంస్కృతిక - సాహిత్య విభాగాలు పోటీలు నిర్వహించాలి. ఇందులో భాగంగా నాటికలు, నాటకాలు, కథారచన, పద్యం ధారణ, పాటల పోటీలు, వ్యాసరచన, వక్తృత్వ, క్విజ్ వంటి పోటీలను నిర్వహించాలి.
- పాఠశాలల్లో వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించే సాంస్కృతిక - సాహిత్య కార్యక్రమం కోసం విద్యార్థులు సిద్ధం చేయాలి. పాఠశాల వార్షికోత్సవ నిర్వహణ ను విజయవంతం చేయాలి