ఉద్యోగ , ఉపాధ్యాయ మిత్రులకు స్వాగతం సుస్వాగతం పి అర్ టి యు పినపాక మండల శాఖ ......

Teachers (Employees) Income Tax Software 2024- 25 Available now ........

SLAS- State Level Assessment Survey 2020 to 8th, 9th students Exam date, Guidelines proformas - Instructions Time table useful information

విద్యాసామర్థ్యాల పరిశీలనకు ‘స్లాస్‌’*
♦ఈ నెల 30న 8, 9 తరగతుల విద్యార్థులకు నిర్వహణ




♦జాతీయస్థాయిలో కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన జాతీయ సాధన సర్వే(న్యాస్‌) తరహాలో పాఠశాల విద్యాశాఖ రాష్ట్ర స్థాయి సాధన సర్వే(స్లాస్‌) నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ బడుల్లోని విద్యార్థుల్లో విద్యా అభ్యాసన సామర్థ్యాలను పరీక్షించడమే ఈ సర్వే లక్ష్యం.

♦అందుకు  ఈనెల 30న 8, 9వ తరగతి విద్యార్థులకు  పరీక్ష నిర్వహిస్తారు.
ఆబ్జెక్టివ్‌ తరహాలో ప్రశ్నలు ఇస్తారు. అందుకు మొదటిసారిగా ఓఎంఆర్‌ పత్రాన్ని ఇస్తున్నారు
. అంటే అందులో జవాబును గుర్తిస్తూ గడులను దిద్దాల్సి ఉంటుంది. విద్యార్థులకు ఓఎంఆర్‌ పత్రాలతో పరీక్ష రాయటం అలవాటు చేయడంతోపాటు.. సాఫ్ట్‌వేర్‌ ద్వారా కొద్ది రోజుల్లోనే ఫలితాలు వెల్లడించవచ్చని అధికారుల ఉద్దేశం.

- *ఇదీ పరీక్ష విధానం*
♦ సబ్జెక్టులు: 
*తెలుగు, *ఆంగ్లం, గణితం, సాంఘిక, భౌతిక, జీవ శాస్త్రాలు
-మొత్తం మార్కులు: 100
- పరీక్ష సమయం: 2 గంటలు

 - సబ్జెక్టుల వారీగా మార్కులు: 
 తెలుగు, ఆంగ్లం, భౌతిక, జీవశాస్త్రాలు( 15 మార్కుల చొప్పున),
 గణితం, సాంఘికశాస్త్రం( 20 మార్కుల చొప్పన)