ప్రస్తుత విద్యా సంవత్సరం ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా, ప్రత్యామ్నాయ రితుల ద్వారా వివిద విషయాలలో పాఠాలను అందచేయాలనే లక్ష్యం తో వర్క్ షీట్ మరియు డిజిటల్ తరగతులను నిర్వహించిన సిలబుస్ పూర్తిగా అందించలేదు.
➠ఇప్పుడు వార్షిక పరీక్షలు సమీపిస్తున్న సరణంగా 10వ తరగతి విద్యార్థుల కు స్వీయ అభ్యసనాన్ని సులభతరం చేయడానికి ఎస్‌సిఈఆర్‌టి భాషేతర విషయాల యొక్క అన్నీ ముఖ్య భావనలను సంకలనం చేసి ఈ "అభ్యాస దీపికని" రూపొందించింది.
➠ప్రస్తుత కోవిడ్-19 పరిస్థితులలో 10వ తరగతి విద్యార్థులు వార్షిక పరీక్షలలో ఉత్తమ ఫలితాలు సాధించాలన్న ఉద్దేశ్యంతో ఈ సంగ్రహణాత్మక అభ్యాస దీపికను రూపొందించడం జరిగింది.
➠సెప్టెంబరు నెల 1వ తేదీ నుండి విద్యార్థులకు టి.సాట్ ద్వారా ఆన్ లైన్ తరగతులు ప్రసారం చేయడం జరుగుతుంది. అంతే గాకుండా ఆయా జిల్లాల విద్యాధికారుల ప్రయత్నంవల్ల యూట్యూబ్ లో తెలుగు, హింది, ఇంగ్లిష్, గణితం, భౌతిక, రసాయన, సాంఘిక శాస్త్రాల పాఠ్యాంశాలు చెప్పించడం జరిగింది. వీటన్నిటి ఉద్దేశం పిల్లలు ఆయా తరగతులలో నిర్దేశించిన సామర్థ్యాలు సాధించడం.
➠అలాగే ఫిబ్రవరి ఒకటి నుండి ప్రత్యక్ష తరగతులు నిర్వహించడం జరిగింది. కాని తక్కువ సమయంలో అన్ని భావనలపైఅవగాహన కల్పించడం సాధ్యపడలేదు.
➠ఇలాంటి పరిస్థితులలో విద్యార్థులకు కొంతవరకు ఆ లోటును భర్తీ చేయడానికి ఈ అభ్యాస దీపిక రూపొందించబడింది.
➠మొత్తం సిలబస్ లో నుండి (30% సిలబస్) పారాలు కృత్యాలు / ప్రాజెక్టు క్రింద ఇవ్వడం జరిగింది. మిగిలిన చాప్టర్లు (70% సిలబిస్) వార్షిక పరీక్షలకు ఉద్దేశించినవి.
➠వీటిలోని కీలక భావనలను గుర్తించి వాటిని విద్యార్థులు సాధన చేసి సులభంగా నేర్చుకునేలా తయారుచేయబడినది.
➠వివిధ పార్యాంశాలకు సంబంధించి తరగతి గది ప్రక్రియలు వర్క్ షీట్లు, డిజిటల్ తరగతుల ద్వారా పొందిన అవగాహనను మరింత బలోపేతం చేసేలా, పాఠ్యాంశాలలోని కీలక భావనలను సులభంగా సొంతంగా అర్థం చేసుకునేలా అభ్యాస దీపిక ఇవ్వడం జరిగింది.
➠ఈ అభ్యాస దీపిక ఏ విధంగా విద్యార్థి వినియోగించుకోవాలో వివరించాలి.
➠ముందుగా శీర్షికల కింద ఇచ్చిన వివిధ భావనల పట్ల విద్యార్థులు అవగాహన పెంపొందించుకొని పట్టు సాధించేలా చూడాలి.
➠అవసరమైన చోట పాఠ్యపుస్తకాన్ని చూసుకునేలా చూడాలి.
➠ఇచ్చిన మొత్తం ఆభ్యాస ప్రశ్నలు తప్పక అభ్యాసం చేసేలా చూడాలి.
➠ఈ కరదీపికను సమర్థవంతంగా వినియోగించుకోవడం వల్ల వార్షిక పరీక్షలలో ఉత్తీర్ణులవటమే కాకుండా ఉన్నత తరగతుల కు సంభందిచ్చిన సుబ్జెక్ట్స్ ల పై అవగాహన పెంపొందించుకోవచ్చు.
గణితం, బౌతీక, జీవ, సాంఘిక శాస్త్రాల అభ్యాస దీపికలు
➤గణితం T.M అభ్యాస దీపిక కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
➤గణితం E.M అభ్యాస దీపిక కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
➤బౌతీక శాస్త్రం T.M అభ్యాస దీపిక కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
➤బౌతీక శాస్త్రం E.M అభ్యాస దీపిక కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
➤జీవ శాస్త్రం T.M అభ్యాస దీపిక కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
➤జీవ శాస్త్రం E.M అభ్యాస దీపిక కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
➤సాంఘిక శాస్త్రం T.M అభ్యాస దీపిక కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ALL THE BEST