Tax Deducted at Source (TDS)
TRACES Form 16 Merger
📝 Step-by-Step Instructions:
Note: This tool relies on the PAN number being in the filename. Ensure PDFs are NOT password protected.
- Extract all Part A and Part B PDF files from your TRACES ZIP files into one folder.
- Click Choose Files below and select all the extracted PDFs.
- Click Merge FORM 16 A & B.
- A ZIP file containing your combined PDFs will download automatically.
Note: This tool relies on the PAN number being in the filename. Ensure PDFs are NOT password protected.
No files selected
TDS (Tax Deducted at Source) అంటే ఏమిటి?
యాజమాన్యం వేతనాన్ని చెల్లించేటప్పుడు శాలరీ నుంచి కొంత పన్ను (TDS) మినహాయించి, మిగిలిన సొమ్మును మీకు అందిస్తుంది. ఈ మినహాయించిన సొమ్మును టీడీఎస్ రూపంలో ప్రభుత్వానికి చెల్లించవలసి ఉంటుంది. టీడీఎస్ మినహాయింపు తర్వాత మీ సంస్థ 'ఫారం 16'ను జారీ చేస్తుంది. అందులో మీ వేతనం, చెల్లించిన పన్ను వివరాలు ఉంటాయి. ఫారం 16ను ఆర్థిక సంవత్సరం చివర్లో జారీ చేస్తారు.
పన్ను చెల్లింపుదారులకు సూచనలు:
- ఫిబ్రవరి నెలలో చెల్లించబోయే ఇన్ కమ్ టాక్స్ రూ. 12,000 దాటితే అడ్వాన్స్ టాక్స్ చెల్లింపు పరిధిలోకి వస్తారు.
- అడ్వాన్స్ టాక్స్ చెల్లించకపోతే, కట్టాల్సిన టాక్స్ పై 1% ఇంట్రెస్ట్ పడుతుంది. ఇది ఈ-ఫైలింగ్ చేసేటప్పుడు చెల్లించాల్సి ఉంటుంది.
- ఒకవేళ అధికంగా టాక్స్ కట్టినట్లయితే, ఇంట్రెస్ట్ తో కలిపి రిఫండ్ రూపంలో మీకు తిరిగి వస్తుంది.
- ఉద్యోగి జీతం నుండి టాక్స్ కట్ చేసినప్పటికీ, DDO ద్వారా TDS చేయించకపోతే, అది పన్ను చెల్లించనట్లే లెక్క. కాబట్టి ప్రతి ఉద్యోగి తమ DDO ని సంప్రదించి TDS చేయించుకోవాలి.
- ప్రతి ఉద్యోగి జూలై 31 (లేదా గడువు తేదీ) లోపు తప్పనిసరిగా ఈ-ఫైలింగ్ చేయాలి. లేనిచో ఆలస్య రుసుము (Late Fee) చెల్లించాలి.
DDO లకు సూచనలు:
- DDO తమ పరిధిలోని ఉద్యోగులలో ఎవరు అడ్వాన్స్ టాక్స్ పరిధిలోకి వస్తారో గుర్తించి, సకాలంలో టాక్స్ కట్ చేయాలి.
- TDS క్రమం తప్పకుండా డ్యూ డేట్ (Due Date) లోపు చేయించాలి. లేట్ ఫైలింగ్ చేస్తే DDO కి పెనాల్టీ పడే అవకాశం ఉంది.
- TDS అమౌంట్ తక్కువగా కట్ చేయడం వల్ల పెనాల్టీతో పాటు ఇంట్రెస్ట్ కూడా కట్టాల్సి ఉంటుంది. తప్పు జరిగినచో తిరిగి ఫైలింగ్ అవకాశం ఉండదు.
- TDS ప్రక్రియలో టాక్స్ పరిధిలోకి వచ్చే ఉద్యోగులందరికీ ఒకేసారి కలిపి TDS చేయాలి. ప్రతి ఉద్యోగికి విడివిడిగా TDS చేయడం సాధ్యం కాదు.
- ఈ-ఫైలింగ్ ని మాత్రం ప్రతి ఉద్యోగి తమకు వారు విడివిడిగా (Individual) చేసుకోవాలి.