*G.O.Ms.No.38 Fin Dt:21-4-2015)*
💥 *స్పెషల్ గ్రేడ్ పోస్టు (SPP-I) స్కేలు:*
ఒక పోస్టులో 6సం॥ సర్వీసు పూర్తిచేసిన ఉద్యోగికి ప్రస్తుతము తాను
పొందుతున్న స్కేలు తదుపరి స్కేలు ను స్పెషల్ గ్రేడ్ పోస్టు స్కేలు గా
మంజూరుచేస్తారు.
💥 *స్పెషల్ ప్రమోషన్ పోస్టు స్కేలు:*
దీనిని SPP-IA,SPP-IB అను రెండు భాగాలుగా విభజించారు.
☀ ఒక పోస్టులో 12సం॥ స్కేలు పూర్తిచేసిన ఉద్యోగికి తాను పొందబోవు తదుపరి
ప్రమోషన్ పోస్టు స్కేలును SPP-I స్కేలుగా మంజూరుచేస్తారు.అయితే ప్రమోషన్
పోస్టుకు కావలసిన అర్హతలు కలిగియుండాలి.12సం॥ సర్వీసు కలిగి,సర్వీసు రూల్స్
ననుసరించి తదుపరి ప్రమోషన్ లేని పోస్టుల్లో పనిచేస్తున్న వారికి స్పెషల్
గ్రేడ్ స్కేలు తదుపరి స్కేలును SAPP-IA స్కేలుగా మంజూరుచేస్తారు.
☀ ఒక పోస్టులో 18సం॥ సర్వీసు పూర్తిచేసిన ఉద్యోగికి తాను పొందుతున్న
SPP-IA/SAPP-Iఆ స్కేలులోనే ఒక ఇంక్రిమెంటు అదనంగా మంజూరుచేస్తారు. దీనిని
SPP-IB/SAPP-IB స్కేలుగా వ్యవహరిస్తారు.
💥 *స్పెషల్ ప్రమోషన్ పోస్టు స్కేలు(SPP-II)*
☀ ఒక పోస్టులో 24సం॥ సర్వీసు పూర్తిచేసిన ఉద్యోగికి సర్వీసురూల్స్ ప్రకారం
తాను పొందబోవు రెండవ ప్రమోషన్ పోస్టు స్కేలును SPP-II స్కేలుగా
మంజూరుచేస్తారు.అట్లే SAPP-I స్కేలు పొందుతున్న ఉద్యోగికి, దాని తదుపరి
స్కేలును SPP-II స్కేలుగా మంజూరుచేస్తారు.
☀ ఒకవేళ SPP-I స్కేలు పొందుతున్న ఉద్యోగికి 2వ ప్రమోషన్ పోస్టులేని
సందర్భంలో SPP-I స్కేలు తదుపరి స్కేలును SPP-II స్కేలుగామంజూరుచేస్తారు.
అట్లే SAPP-IA స్కేలు పొందుతున్న ఉద్యోగికి, దాని తదుపరి స్కేలును SPP-II స్కేలుగా మంజూరుచేస్తారు.
ప్రశ్న : నా వయస్సు 54 సం.లు, B.Sc. TTC అర్హతలతో 2006 నుంచి LFL HM గా పనిచేస్తున్నాను. 2018 సంవత్సరంలో 12 సంవత్సరముల స్కేలు పొందడానికి అర్హత ఉన్నదా ?
సమాధానం : లేదు. ఆటోమాటిక్ అడ్వాన్స్మెంట్ స్కీం ఉత్తర్వులు G.O.MS No. 38, ఆర్థిక, తేది : 15-4-2015 ప్రకారం SPP - (A) (సం.) స్కేలు మంజూరు చేయాలంటే తదుపరి ప్రమోషన్ పోస్టుకు అవసరమైన విద్యార్హతలు కలిగి యుండాలి. (LFL HM) తదుపరి ప్రమోషన్ పోస్టు (హైస్కూల్ HM) ప్రమోషన్ పొందాలంటే B.Ed. ఉండాలి. మీకు B.Ed. లేదు కనుక 12 సంవత్సరముల స్కేలు పొందే అర్హత లేదు.
