ఉద్యోగ , ఉపాధ్యాయ మిత్రులకు స్వాగతం సుస్వాగతం పి అర్ టి యు పినపాక మండల శాఖ ......

MDM Monthly Report Software Available now ........

CHILD CARE LEAVE

  మహిళా ఉద్యోగులు,టీచర్లకు వారి మొత్తం సర్వీసులో 90 రోజులు శిశుసంరక్షణ సెలవు మంజూరుకు అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం *జివో.209 తేది:21-11-2016* ద్వారా ఉత్తర్వులు జారీచేసింది.

👉🏻90 రోజుల సీసీయల్ ను విడతకు 15 రోజులు మించకుండా కనీసం ఆరు విడతల్లో మంజూరుచేయాలి.

👉🏻180 రోజుల ప్రసూతి సెలవుకు ఈ సీసీఎల్ అదనం.

👉🏻ఇద్దరి పెద్దపిల్లల వయస్సు 18 ఏళ్ళు నిండేవరకు సీసీఎల్ అనుమతించాలి.

👉🏻40 శాతం ఆపై అంగవైకల్యం కలిగియున్న పిల్లలు ఉన్న పక్షంలో 22 ఏళ్ళ వరకు మంజూరుచేయాలి.

👉🏻ఇద్దరికంటే ఎక్కువ సంతానం కలిగిఉన్నట్లయితే మొదటి ఇద్దరి పిల్లల వయస్సును మాత్రమే పరిగణలోకి తీసుకోవాలి.

 👉🏻మహిళా ఉద్యోగుల,టీచర్ల  పిల్లలు పూర్తిగా వారిపై ఆధారపడి వారితో కలిసి ఉంటేనే సీసీఎల్ మంజూరుచేస్తారు.

 👉🏻పిల్లల పరీక్షలు,అనారోగ్యంతో పాటు పిల్లల ఇతర అవసరాలకు సిసిఎల్ మంజూరుచేయాలి.కేవలం పిల్లల పరీక్షలు అనారోగ్యం సందర్భాలలో మాత్రమే సీసీఎల్ అనుమతించడం నిబంధనలకు విరుద్దం.

 👉🏻శిశుసంరక్షణ సెలవు పొందడం హక్కు కాదు.కేవలం సెలవు పత్రం సమర్పించి  సీసీయల్ పై వెళ్ళకూడదు.అధికారి నుండి ముందస్తు అనుమతి పొంది వెళ్లాలి.

 👉🏻మొదటి విడత సీసీయల్ మంజూరు సమయంలో పుట్టినతేది సర్టిఫికెట్లు దరఖాస్తుకు జతపరచాలి.ఇతర ఏ రకమైన సర్టిఫికెట్లు అవసరంలేదు.

 👉🏻ఆకస్మిక, ప్రత్యేక ఆకస్మికేతర సెలవు మినహా ప్రసూతి సెలవుతో సహా ఏ రకమైన సెలవుతోనైనా కలిపి వాడుకోవచ్చును.

 👉🏻ఆకస్మికేతర సెలవు(OCL) కు వర్తించే ప్రిఫిక్స్,సఫిక్స్ నిబంధనలు ఈ సెలవుకు కూడా వర్తిస్తాయి.

 👉🏻శిశుసంరక్షణ సెలవు ముందు రోజు పొందిన వేతనాన్ని సెలవు కాలానికి చెల్లిస్తారు.

 👉🏻ఇట్టి సెలవు ఖాతాను ప్రత్యేకంగా నిర్వహిస్తూ సర్వీసు పుస్తకానికి జతపర్చాలి.రెగ్యులర్ సెలవు ఖాతాకు ఈ సెలవు ఖాతాను కలుపకూడదు.
    G.O.Ms.No.209 Fin Dt:21.11.2017
 Child Care Leave Application Form

                                                            చైల్డ్ కేర్ లీవ్ సందేహాలు

సందేహము:-చైల్డ్ కేర్ లివ్ ఒక స్పెల్ కు మాగ్జిమం ఎన్ని రోజులు  పెట్టుకోవచ్చు. 1,2 రోజులు కూడా పెట్టుకోవచ్చునా ?

సమాధానము:-
G.O.Ms.No.209 Fin తేది:21.11.2016 ప్రకారంవివాహిత మహిళా ఉపాధ్యాయులు ప్రతి స్పెల్ కు మాగ్జిమం 15 రోజుల చొప్పున 6 స్పెల్ లకు తగ్గకుండా 90 రోజులు వాడుకోవచ్చును.జీవోలో 6 స్పెల్ లకు తగ్గకుండా అన్నారు కాబట్టి 1,2 రోజులు కూడా వాడుకొనవచ్చును.

సందేహము:- చైల్డ్ కేర్ లివ్ ముందుగానే మంజూరు చేయించుకోవాలా? సెలవు కాలంలో పూర్తి జీతం చెల్లిస్తారా ?
సమాధానము:-
చైల్డ్ కేర్ లివ్ ను DDO తో ముందుగానే మంజూరు చేయించుకుని, ప్రొసీడింగ్స్ ద్వారా వివరాలను సర్వీసు పుస్తకములో నమోదు చేయించుకోవాలి.ఆ నెల వేతనాన్ని యధావిధిగా మంజూరు చేయాలసీన బాధ్యత DDO దే.

సందేహము:- చైల్డ్ కేర్ లివ్ పెట్టిన సెలలో ఇంక్రిమెంట్ ఉన్నట్లయితే మంజూరు చేయవచ్చునా ?
సమాధానము:
వీలుపడదు. సెలవు కాలంలో వేతన వృద్ధి ఉండదు.కావున సెలవు అనంతరం విధులలో చేరిన నాటినుండే ఇంక్రిమెంట్ మంజూరుచేస్తారు.

సందేహము:- మెటర్నిటి లీవుకు కొనసాగింపుగా చైల్డ్ కేర్ లీవు పెటుకోవచ్చునా ?
సమాధానము:
చైల్డ్ కేర్ లీవును అన్ని విధాలుగా  Other than casual,spl. casual leave తో కలిపి పెట్టుకోవచ్చునని జీవో.209 లోని రూలు 3(i) సూచిస్తోంది.

సందేహము:- సర్రోగసి,దత్తత ద్వారా సంతానం పొందిన .మహిళా ఉద్యోగులు చైల్డ్ కేర్ లివ్ కు అర్హులేనా ?
సమాధానము:- అర్హులే,90 రోజుల సెలవు వాడుకొనవచ్చును.

సందేహము-భార్య మరణించిన పురుష ఉద్యోగికి చైల్డ్ కేర్ లివ్ మంజూరు చేయవచ్చునా ?
సమాధానము:- వీలు లేదు. ఇందుకు సంబంధించిన GO.209 లో Women Employees అని ఉన్నది.

సందేహము:- చైల్డ్ కేర్ లీవ్ కు అప్లై చేసిన ప్రతిసారి పుట్టినతేది వివరాలు సమర్పించాలా?
సమాధానము:
అవసరం లేదు. మొదటి సారి అప్లై చేసేటపుడు మాత్రమే కుమారుడు/కుమార్తె డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ సమర్పించాలి. ప్రతి దఫా అప్లికేషన్ సమర్పిస్తే సరిపోతుంది.

సందేహము:- పిల్లల అనారోగ్యం,చదువుల కొరకు మాత్రమే చైల్డ్ కేర్ లీవ్ మంజూరుచేస్తారా ?
సమాధానము:
GO.209 point.3 లో  ఇలా ఉన్నది "Children needs like examinations,sickness etc", అని ఉన్నది కావున పై రెండు కారణాలకే కాకుండా ఇతరత్రా కారణాలకు కూడా చైల్డ్ కేర్ లీవు మంజూరు చేయవచ్చును.

సందేహము:- చైల్డ్ కేర్ లీవ్ కు ప్రిఫిక్స్,సఫిక్స్  వర్తిస్తాయా ?
సమాధానము:
వర్తిస్తాయి, ప్రభుత్వ సెలవు దినాలతో ఇట్టి సెలవును అనుసంధానం చేసుకోవచ్చును.