ఉద్యోగ , ఉపాధ్యాయ మిత్రులకు స్వాగతం సుస్వాగతం పి అర్ టి యు పినపాక మండల శాఖ ......

MDM Monthly Report Software Available now ........

EMPLOYEES WELFARE FUND

1) G.O.(P) No.173 ఆర్ధిక శాఖ ద్వారా ఈ నిధి ఏర్పాటు చేయబడినది. సభ్యులు చందా, ప్రభుత్వ గ్రాంట్, విరాళముల ద్వారా ఈ నిధికి డబ్బు సమకూరును. ఈ నిధిపై వచ్చే వడ్డీ నుండి ఉద్యోగులకు అప్పులు / గ్రాంటు ఇవ్వబడును.


2) ప్రభుత్వ ఉద్యోగులు స్థానిక సంస్థల ఉద్యోగులు, ఉపాధ్యాయులు, వర్క్ ఛార్జ్డ్ మరియు కంటిన్టెంట్ ఉద్యోగులు
ఈ నిధిలో సభ్యులు. సభ్యత్వం క్రింద ప్రతి ఒక్కరు రూ.50/- చెల్లించాలి. మొదటి నెల జీతం నుండి ప్రతి సభ్యుడు ప్రతి సంవత్సరం మార్చినెల జీతం నుండి ఈ నిధికి రూ.20/- జమ చేయాలి.

3) సభ్యులు ఈనిధి నుండి అప్పును పొందుటకు అర్హత గలిగి వుందురు. G.O.Ms.No. 131 Fin.(EWF) Dt: 14.5.2012 .  పొందిన అప్పును సాధారణ వడ్డీతో కలిపి 5సం॥లలోగా తిరిగి చెల్లించాలి. ప్రత్యేక సందర్భాలలో వడ్డీ మినహాయింపును ఇవ్వబడవచ్చును. వైద్యఖర్చులకు, పిల్లల విద్యాభ్యాస ఖర్చులకు ఆచార సంబంధమైన (కర్మ, ఇత్యాది) ఖర్చులకు గాను అర్థిక సహాయం లేదా అప్పును ఈ నిధి నుండి పొందవచ్చును. ప్రసూతి ఖర్చులకై రూ.20 వేల అప్పు ఇస్తారు. గృహనిర్మాణం లేక మరమ్మత్తులకు ఎట్టి మొత్తంను మంజూరు చేయబడదు.

4) ఈ నిధి రాష్ట్ర కమిటీచే నిర్వహించబడుతుంది. విధాన పరమైన నిర్ణయములు వివిధ జిల్లాలకు కేటాయింపులు
మొదలగునవి రాష్ట్ర కమిటీయే చేయును. రాష్ర  కమిటీకి  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షుడుగాను, ఆర్థిక శాఖ డిప్యూటీ పెక్రటరీ మెంబర్ కమ్ ట్రేసరర్ గా వ్యవహరిస్తారు . ఆంధ్రప్రదేశ్ జాయింట్ స్టాప్ కౌన్సిల్లో సభ్యత్వం గల అన్ని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధి ఒక్కొక్కరు వర్క్ ఛార్జ్డ్ ఉద్యోగుల ప్రతినిధి ఒకరు ఈ కమిటీలో సభ్యులుగా వుంటారు.

5) జిల్లా కలెక్టర్ అధ్యక్షుడుగాను, జిల్లా ట్రెజర్ ఆఫీసర్ కన్వీనర్ గాను, మెంబర్ సెక్రటరీ కమ్ ట్రేసరర్ గా  జిల్లా కమిటీ
ఏర్పడుతుంది. రాష్ట్ర కమిటీల వలనే జిల్లా జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సభ్య సంఘాల ప్రతినిధులు ఇందులో సభ్యులుగా ఉంటారు. రాష్ట్ర కమిటీ నిర్ణయించిన పరిమితి లోబడి అప్పును లేదా ఆర్థిక సహాయమును జిల్లా కమిటీ మంజూరు చేయును. అత్యవసర సందర్భములలో అధ్యక్షుడే రూ.500/- మేరకు సహాయం మంజూరు చేయును . ఇట్టి అధికారులతోటే జంట నగరాలకు కూడా ఒక ప్రత్యేక కమిటీ వుంటుంది.

6) ఈ అప్పులను డి.డి.ల రూపంలో చెల్లిస్తారు. నిర్ణయించబడిన సమాన వాయిదాలలో ప్రతినెల బిల్లులో రికవరీ చేయాలి. (G.O.Ms.No.404 (P) Fin. Dt: 30.7.2001)

7) ఈ నిధి నుండి సహాయము పొందుగోరు సభ్యులు లేక మరణించిన సభ్యుని కుటుంబ సభ్యులు నిర్ణీత ఫారంలో
సంబంధిత కమిటీకి దరఖాస్తును పంపుకోవాలి.
**********

Related GOs :

* Circular Memo No.01/APEWF/2013-2  dt.09.01.2014 EWF Subscription Rs.20/-