ఉద్యోగ , ఉపాధ్యాయ మిత్రులకు స్వాగతం సుస్వాగతం పి అర్ టి యు పినపాక మండల శాఖ ......

MDM Monthly Report Software Available now ........

GROUP INSURANCE SCHEME - RULES IN BRIEF

 

GROUP INSURANCE SCHEME - RULES IN BRIEF


1. ఆరంభం: గతంలో అమలలులో ఉన్న 'కుటుంబ సంక్షేమ పథకము' (FBF) స్థానంలో G.0.MS.No.293 Fin.Dt 8-10-1984 ద్వారా 'ఆంధ్రప్రదేశ్ ఎంప్లాయిస్ గ్రూప్ ఇన్యూరెన్స్ స్కీము 1984 అను క్రొత్త స్కీము తేది: 1.11.1984 నుండి ప్రవేశపెట్టిబడినది. పాత FBF పథకంలో అప్పటివరకు ఉద్యోగి చెల్లించిన మొత్తాన్ని డ్డీతో కలిపి రిటైరైనప్పుడు లేక చనిపోయినప్పుడు చెల్లిస్తారు. ప్రతి PRC లోను గ్రూప్ ఇన్యూరెన్స్ స్లాబ్  రేట్లను సవరిస్తూ వస్తున్నారు. RPS 2010 GMs.No. 151 F&P Dt: 16-10-2015 నుండి స్థాబ్ రేట్లను సవరించారు

2. నిబంధనలు: 1.11.84 నాటికి సర్వీసులో గల ప్రభుత్వ, పంచాయితీరాజ్, మున్సిపల్ ఉద్యోగులు మరియు 10సం॥నిండి ప్రభుత్వ ఉద్యోగులుగా మారిన వర్క్ ఛార్జ్డ్ ఉద్యోగులు పథకంలో సభ్యులు. 1.11.1984 తరువాత సర్వీసులోచేరిన వారు తదుపరి నవంబరు నుండి మాత్రమే సభ్యులగుదురు. అయితే అట్టివారికి ఇన్సూరెన్స్ కవరు చేయడానికి వారు ఏ గ్రూపుకు చెందుతారో దానిని బట్టి ప్రతి యూనిట్కు రూ.4.50పై.లను తాత్కాలికంగా తదుపరి అక్టోబరు వరకు చెల్లించాలి. ప్రతి ఉద్యోగి ఫారం 6 లేక 7లో ఇచ్చిన నామినేషన్ ను సర్వీసు రిజిస్టరులో అంటించి, నమోదు చేయించి అధికారి సంతకం తీసుకోవాలి. 

3. సభ్యత్వ రుసుము: ఉద్యోగులు వారి వారి వేతన స్కేలు యొక్క గరిష్ట పరిమితి బట్టి ఈ క్రింది పట్టికలో సభ్యత్వ
విధముగా ఎ.బి.సి.డి.లను నాలుగు గ్రూపులుగా విభజించబడుదురు. 1.11.1994 నుండి యూనిట్ సభ్యత్వ రుసుము G.O. 367 Fin. Dt: 15-11-1994 ప్రకారం రూ.15/-లుగా పెంచబడినది. G.O.Ms.No.193 F&P Dt: 18.11.1999 ద్వారా పెంచబడిన Slab Rates  G.0.M.s. No. 24 Edn. DT. 15.2.2001 ద్వారా యథాతథంగా ఎయిడెడ్ వారికి అమలు జరుపబడినవి.
 
4. సభ్యుత్వ గ్రూపు మార్పు:  ఒక ఉద్యోగి సంవత్సరం మధ్యలో పొందిన రెగ్యులర్ ప్రమోషన్ లేక నియామకం వలన అతని వేతన స్కేలు గరిష్ట పరిమితికి మారినను తదుపరి నవంబరు నుండి మాత్రమే అతని సభ్యత్వము గ్రూపు మారుతుంది. ఎయిడెడ్ వారి విషయంలో జూలై నుండి మాత్రమే మారుతుంది. ప్రమోషన్ వెనుకటి తేది నుంచి అమలలులోనికి వచ్చినప్పటికి సభ్యత్వ గ్రూపు వెనుకటి తేది నుండి మారదు. మార్పును  ఎప్పటికప్పుడు  సర్వీసు పుస్తకంలో నమోదు చేయించుకోవాలి.

5. ఇన్సూరెన్స్ లేక సేవింగ్ ఖాతాలకు జమ: ఉద్యోగి చెల్లించే రూ.10/- యూనిట్ నుండి రూ.3.125  ఇన్సూరెన్స్ ఖాతాకు  రూ.6.875/- సేవింగ్స్ ఖాతాకు ప్రతి రూ.15/- యూనిట్ నుండి రూ.4.50 ఇన్సూరెన్స్ ఖాతాకు, రూ.10.50 సేవింగ్స్ ఖాతాకు జమ చేస్తారు.

6. ఇమ్సారెన్స్ అండ్ సేవింగ్ మొత్తములు చెల్లింపు : ఉద్యోగి సర్వీసులో నుండగా మరణిస్తే అతని సభ్యత్వ గ్రూపును బట్టి ఎంత రుసుము చెల్లిస్తున్నారో అన్ని వేల రూపాయల చొప్పున ఇన్సూరెన్స్ మొత్తంతోపాటు సేవింగ్స్ మొత్తం వడ్డీతో సహా చెల్లిస్తారు. ఉద్యోగి రిటైరైనా లేక రాజీనామా చేసినా సేవింగ్స్ మొత్తాన్ని మాత్రమే G.PF. కు వర్తించే వడ్డీరేటుతో కలిపి చెల్లిస్తారు.

7.ఎయిడెడ్ పాఠశాలలోని ఉపాధ్యాయులకు, బోధనేతర సిబ్బందికి G.O.MS.No.315 విద్యాశాఖ, తేది: 22.7.1986
ద్వారా ఇటువంటి స్కీమ్ 1.7.1986 నుండి వర్తింప చేయబడినది. అయితే ఎయిడెడ్ పాఠశాలలకు ఎల్.ఐ.సి. వారే .నేరుగా ప్రీమియంబు వసూలు చేసి, చనిపోయిన వారికి డబ్బు చెల్లిస్తారు. ఎయిడెడ్యేతర ఉపాధ్యాయులకు  ఎల్.ఐ.సి.తో నేరుగా సంబంధం లేదు.

8. చెల్లింపు విధానం: G.O.MS.No.148 Fin. Dt: 6-6-2012 ప్రకారం ఉద్యోగి రిటైరైనా లేక మరణించినా గ్రూప్ ఇన్సూరెన్స్ పథకం క్రింద అతను చెల్లించిన ప్రతి యూనిట్కు సేవింగ్స్ ఖాతా నుండి 3 పట్టికలలో చూపిన విధంగా  చూపించబడును. ఈ పట్టికలు ప్రతి సంవత్సరము ప్రభుత్వం విడుదల చేయును. లెక్కించవలసిన విధానము
1. ఒక యూనిట్కు పథకంలో చేరి 31.10.1994 నాటికి పూర్తయిన సంవత్సరమలను బట్టి ఆనాటికి సేవింగ్స్  ఖాతాలో వడ్డీతో సహా గల నిల్వ మొత్తం (ACS = Accumulated Savings) ను టేబుల్-1 నుండి గుర్తించాలి.
2.సభ్యత్వం ముగియునాటికి సదరు నిల్వ మొత్తం పై లభించెడి వడ్డీని టేబుల్-2లో గుర్తించాలి.
3. 1.11.1994 నుండి సభ్యత్వము ముగియునాటికి లభించు వడ్డితో కూడిన సేవింగ్స్ మొత్తంను టేబుల్-3గా  గుర్తించాలి. ఈ మూడింటిని కలుపగా వచ్చు మొత్తం ఒక యూనిట్కు చెల్లించబడే అంతిమ మొత్తం అవుతుంది. దానిని యూనిట్ల సంఖ్యచే గుణిస్తే సభ్యునికి అంతిమంగా చెల్లించబడే మొత్తం తెలుస్తుంది. ప్రతి సంవత్సరము జీపీఎఫ్ పైన చెల్లించే వడ్డీకి దీనిని వర్తింప చేస్తారు.

Related GOs & Proc :

G.O.Ms.No.36 dt:22.05.2020 GIS Table of benefits for saving funds for the period from 1.10.2019 to 31.12.2019