Telecome companies ready to change incoming calls
ఇక ఇన్ కమింగ్ కాల్స్‌పై బాదుడు!
టెలికాం రంగంలో రోజురోజుకు పరిణామాలు తిరోగమనం పడుతున్నాయి. అన్ లిమిటెడ్ ఇన్ కమింగ్ కాల్స్ ఉచిత సదుపాయానికి టెలికాం సంస్థలు మంగళం పాడ బోతున్నాయి. కొద్ది రోజుల్లోనే అవుట్ గోయింగ్ తో పాటు ఇకపై ఇన్ కమింగ్ కాల్స్ కూ ప్రత్యేక రీఛార్జ్ ప్యాక్ వేసుకునేలా కంపెనీలు ప్రణాళికలను రూపొందిస్తున్నాయి. కనిష్టంగా రూ.35తో రీఛార్జ్ చేసుకుంటే 28 రోజుల పాటు ఇన్ కమింగ్ కాల్స్ వచ్చేలా ప్యాక్లను విడుదల చేస్తున్నాయి.
ఎయిర్టెల్ ఇప్పటికే ఈ దిశగా అడుగులు వేసింది. రూ.35,రూ.65,రూ.95 ప్యాక్లను విడుదల చేసింది.ఈ రూ.35 ప్లాన్ ను రీఛార్జి చేసుకుంటే వినియోగదారుడికి 100MB డేటా తో పాటు 26.6 టాక్ టైమ్ లభిస్తుంది.అలాగే ఇన్ కమింగ్ కాల్స్ కి 1p/sec పడుతుంది.ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులు మాత్రమే.ఈ రూ.65 ప్లాన్ ను రీఛార్జి చేసుకుంటే వినియోగదారుడికి 200MB డేటా తో పాటు 65 టాక్ టైమ్ లభిస్తుంది.అలాగే ఇన్ కమింగ్ కాల్స్ కి 1p/sec పడుతుంది.ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులు మాత్రమే. ఈ రూ.95 ప్లాన్ ను రీఛార్జి చేసుకుంటే వినియోగదారుడికి 500MB డేటా తో పాటు 95 టాక్ టైమ్ లభిస్తుంది.అలాగే ఇన్ కమింగ్ కాల్స్ కి 1p/sec పడుతుంది.ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులు మాత్రమే.
ఎయిర్‌టెల్ ఈ మధ్యనే పోస్ట్ పెయిడ్ యూజర్ల కోసం అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా అందించిన సంగతి అందరికీ తెలిసిందే. యూజర్లు రూ.499 ప్లాన్ వేసుకోవడం ద్వారా ఈ ఆఫర్ ని పొందవచ్చు. అయితే ఇప్పుడు అదే ఊపులో యూజర్ల కోసం ఎంట్రీ లెవల్ ప్లాన్లో కూడా అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్‌ను ఏడాది పాటు ఉచితంగా అందించేందుకు రెడీ అయింది. యూజర్లు రూ.399 ప్లాన్ ద్వారా ఈ ఉచిత ఆఫర్ పొందవచ్చు. వొడాఫోన్, బీఎస్‌ఎన్‌ఎల్ తరహాలోనే ఎంట్రీ లెవల్ పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌తో అదనపు డేటా బెనిఫిట్స్‌తో పాటు రూ.999 విలువ గల అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్‌ను వినియోగదారుల కోసం ప్రకటించింది.
అదనపు బెనిఫిట్స్‌లో భాగంగా పోస్ట్‌పెయిడ్ కస్టమర్లు రూ.399తో రీఛార్జ్ చేసుకుంటే నెలకు 40జీబీ హైస్పీడ్ 3జీ/4జీ డేటా పొందడంతో పాటు 200జీబీ వరకు డేటా కూడా రోల్‌ఓవర్ అవుతుంది.అపరిమిత కాల్స్, ఎస్సెమ్మెస్‌లతో పాటు ఎయిర్‌టీవీ సబ్‌స్క్రిప్షన్, వింక్ మ్యూజిక్‌ను ఎయిర్‌టెల్ ఉచితంగా ఆఫర్ చేస్తోంది. చివరగా సబ్‌స్ర్కైబర్లు రూ.51 విలువ గల అమెజాన్ పే గిఫ్ట్ కార్డ్‌ను కూడా పొందుతారు.
బిల్లులపై రూ.50 డిస్కౌంట్....
తొలి ఆరు నెలల పాటు చెల్లించే బిల్లులపై రూ.50 డిస్కౌంట్ కూడా ఇస్తోంది. దీంతో ఈ ప్లాన్‌లో భాగంగా చెల్లించే మొత్తం కేవలం 349 రూపాయలు మాత్రమేనని సంస్థ వెల్లడించింది.
ఇక రానున్న రోజులలో అన్ని టెలికాం కంపెనీలు ఇన్ కమింగ్ కాల్స్‌పైనా వడ్డనలు చేసేందుకు సిద్దమవుతున్నట్టు వార్త!