ఉద్యోగ , ఉపాధ్యాయ మిత్రులకు స్వాగతం సుస్వాగతం పి అర్ టి యు పినపాక మండల శాఖ ......

Teachers (Employees) Income Tax Software 2024- 25 Available now ........

Child Care Leave Instructions

మహిళా ఉద్యోగ ఉపాధ్యాయినులకు పదవ పి.ఆర్.సి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగినిలతో సమానంగా రెండు సంవత్సరాల చైల్డ్ కేర్ లీవ్ ని ప్రతిపాదించింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం మొత్తం సర్వీస్ కాలంలో కేవలం 90 రోజుల సౌలభ్యాన్ని మాత్రమే కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసినది.
ప్రభుత్వ ఉద్యోగిని మీద ఆధారపడి వారితో జీవిస్తున్న ఇద్దరు పెద్ద పిల్లలకు (ఒక వేళ ఇద్దరికన్నా ఎక్కువ ఉంటే) పిల్లల వయస్సు 18సంవత్సరాల వయస్సు వచ్చేవరకు ఉపయోగించుకోవచ్చు. వికలాంగులైన పిల్లలకైతే 22 సంవత్సరాల వరకు వినియోగించుకోవచ్చు (సంబంధిత అధికారి జారీ చేసిన సర్టిఫికెట్ ను జతపరచాలి). దీనిని వారి అవసరాలైన పరీక్షలు, అనారోగ్యానికి, మొదలగు వాటికోసం ఈ సెలవును ఉపయోగించుకోవాలి. ఈ సెలవును ఒకవిడతలో గరిష్టంగా 15 రోజులకు మించి ఉపయోగించరాదు ఈ సెలవును వినియోగించుకోవడానికి ఉన్న షరతులేంటో ఒకసారి పరిశీలిద్దాం.
LTC కోసం ఈ సెలవును ఉపయోగించరాదు. 
వినియోగించిన సెలవులను వీటికోసం రూపొందించిన ప్రొఫార్మాలో నమోదు చేసి సర్వీస్ బుక్ తో భద్రపరచాలి. వినియోగించుకున్న ఈ సెలవులను చైల్డ్ కేర్ లీవ్ ఖాతా నుండి తగ్గించాలి కానీ ఇతర సెలవు ఖాతా తో కల్పవద్దు. 
- The Head of the office shall ensure that the availment of Child Care leave to an employee will not affect the functioning of the office for which necessary orders depending upon the circumstances of the office may be issued. 
- ఈ సెలవు ఉద్యోగిని హక్కు కాదు, ఈ సెలవును సంబంధిత అధికారి చేత మంజూర్ చేసుకుని ఉపయోగించుకోవాలి. 
- ఈ సెలవుపై వెళ్ళుటకు ముందు రోజు ఉన్న జీత బత్యాలను ఈ సెలవు కాలానికి చెల్లిస్తారు.  
- ఈ సెలవును ఒక LTC లీవ్ తో కాకుండా మిగితా సెలవులతో కల్పి వాడుకోవచ్చు. 
- ప్రొబేషన్ ఉద్యోగినులు కూడా ఈ సెలవులను ఉపయోగించుకోవచ్చు కానీ సెలవులు వినియోగించుకున్న రోజుల పాటు ప్రొబేషన్ కాలం ముందుకు జరుగుతుంది. 
- చైల్డ్ కేర్ లీవ్ అనేది 180 రోజుల ప్రసూతి సెలవులకు అధనము జారీ చేసేది. దీనిని CL & Spl.CL లతో కల్పివాడుకునే వీలులేదు కానీ  ప్రసూతి సెలవుతో, ఇతర సెలవులతో కల్పి వాడుకోవచ్చు.