వేతన జీవులకు భారీ ఊరట: ఆదాయపన్ను పరిమితి రూ.5 లక్షలు
- కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌లో మధ్య తరగతి కుటుంబాలకు ఆదాయ పన్ను పరిమితిపై భారీ ఊరట.
- ఆదాయ పన్ను పరిమితిని రూ.2.5 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంపు
- ఈ మేరకు కేంద్రమంత్రి పీయూష్ గోయల్ శుక్రవారం నాడు పార్లమెంటులో ప్రకటన.
- ఇన్‌కం ట్యాక్స్ రిటర్న్స్‌ను 24 గంటల్లో తీసుకోవచ్చునని వెల్లడి.
- అలాగే హోంలోన్ల పైన వడ్డీ మినహాయింపును రూ.2.5 లక్షలకు పెంపు.
- ఐదు లక్షల వరకు ఆదాయం ఉన్న వారికి పన్ను సున్నా అని చెప్పవచ్చు.
Income Tax Slab Rates 2019-2020
- రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల మధ్య ఆదాయం ఉంటే 20 శాతం ఆదాయ పన్ను ఉంటుంది.
- రూ.10 లక్షల పైన ఎంత ఉన్నా 30 శాతం పన్ను ఉంటుంది. గతంలో రూ.5 లక్షలలోపు ఆదాయం ఉన్న వారికి రూ.12,500 పన్ను ఉండేది. ఇప్పుడు అది సున్నా.
- రూ.6.5 లక్షల దాకా మినహాయింపు
- ప్రావిడెంట్ ఫండ్‌లో పెట్టుబడి ఉంటే రూ.6.5 లక్షల దాకా మినహాయింపు
- ప్రావిడెంట్ ఫండ్‌లో పెట్టుబడులు పెడితే 6.5 లక్షల లోపు ఆదాయపన్ను మినహాయింపు ఉంటుంది.
- బ్యాంకులు, పోస్టాఫీసుల్లో పొదుపు చేసే వారికి పన్ను మినహాయింపు ఇస్తారు.
TDS Enhanced
- టీడీఎస్ పరిమిది రూ.40వేల నుంచి రూ.50వేలకు పెంచారు.
- పొదుపు ఖాతాలపై వచ్చే వడ్డీ రూ.10వేల నుంచి రూ.40వేల కోట్లకు పెంచారు. సేవింగ్స్ పైన రూ.40వేల వరకు పన్ను మినహాయించారు.
- మధ్యంతర బడ్జెట్‌లో ఉద్యోగాలు, పింఛన్‌ధారులకు భారీ ఊరట లభించింది. స్టాండర్డ్ డిడక్షన్ రూ40వేల నుంచి రూ.50వేలకు పెంచారు.
కేంద్ర బడ్జెట్ ముఖ్యాంశాలు 2019
- అద్దెల ద్వారా వచ్చే ఆదాయంపై పన్ను మినహాయింపు పరిమితి రూ.1.80 లక్షల నుంచి రూ.2.40 లక్షలకు పెంపు.
- వేతన జీవులకు ఊరట. ఆదాయపన్ను పరిమితి రూ.5 లక్షలకు పెంపు. సెక్షన్ 80సీ పరిమితిని రూ.1 లక్ష నుంచి రూ.1.5 లక్షలకు పెంచారు. రూ.6.5 లక్షల్లోపు వార్షికాదాయం ఉన్నవారు ప్రావిడెంట్ ఫండ్స్, ఈక్విటీల్లో పెట్టుబడి పెడితే పన్నులు కట్టనక్కర్లేదు. 3 కోట్ల కుటుంబాలకు లబ్ధి.
- ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి రూ. 76,800 కోట్లకు పెంపు. గత బడ్జెట్లో రూ.62,474 కోట్ల కేటాయింపు.
- మూలధన వ్యయం - రూ.3,36,292 లక్షల కోట్లు
- స్థూల ఆదాయం:
- నోట్ల రద్దు తర్వాత 1.06 కోట్ల మంది ఐటీ రిటర్నులు దాఖలు చేశారు. ఇప్పటి వరకూ ఇదే అత్యధికం. 24 గంటల్లోగా ఆదాయ పన్ను రీఫండ్ అయ్యేలా చర్యలు.
- వచ్చే ఐదేళ్లలో 5 లక్షల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్, ఎనిమిదేళ్లలో 10 లక్షల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరించనున్న ఇండియా.
- ఇళ్ల కొనుగోలు దారులను జీఎస్టీ నుంచి మినహాయించే విషయమై త్వరలోనే నిర్ణయం.
- పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ఏర్పాటు. ఐదెకరాల లోపు రైతులకు ఏటా రూ.6 వేల రూపాయలు అందిస్తాం. 12 కోట్ల రైతు కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. డిసెంబర్ 1, 2018 నుంచి ఈ పథకం అమల్లోకి వస్తుంది. రూ. 2 వేలు చొప్పున మూడు వాయిదాల్లో చెల్లింపు. నేరుగా బ్యాంక్ ఖాతాల్లోకి నగదు బదిలీ. ఈ పథకం కోసం ఏటా రూ.75 వేల కోట్లు ఖర్చు.
- ప్రధాని శ్రమ యోగి మంధన్ పేరిట అసంఘటిత రంగంలోని కార్మికుల కోసం పెన్షన్ పథకం. నెలకు రూ.100 చెల్లిస్తే 60 ఏళ్ల తర్వాత నెలకు రూ.3 వేలు. పది కోట్ల మందికి లబ్ధి చేకూరనుంది.
- పన్నులు లేకుండా గ్రాట్యూటీ పరిమితి రూ.20 లక్షలకు పెంపు. ఓవరాల్‌గా గ్రాట్యూటీని రూ.30 లక్షలకు పెంపు.
- ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి కోసం రూ.58,166 కోట్లు కేటాయింపు. గత ఏడాది కంటే ఇది 21 శాతం అధికం.
- రైల్వేకు బడ్జెటరీ సపోర్ట్ కింద రూ.64,587 కోట్ల నిధులు.
- 59 నిమిషాల్లోనే సూక్ష్మ చిన్నతరహా పరిశ్రమలకు కోటి రూపాయల రుణం.
- కార్మిక ప్రమాద బీమా రూ.6 లక్షలకు పెంపు.
- రక్షణ రంగానికి రూ.3 లక్షల కోట్లు కేటాయింపు.
- ప్రధాన మంత్రి ఉజ్వల్ యోజన ద్వారా 8 కోట్ల గ్యాస్ కనెక్షన్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
- ముద్రా కింద రూ.7 లక్షల కోట్ల రుణాలు ఇచ్చాం.
- కేంద్రంలో ప్రత్యేకంగా మత్స్య శాఖ ఏర్పాటు.
- 21 ఎయిమ్స్ కార్యకలపాలు నిర్వహిస్తున్నాయి లేదా నిర్మాణ దశలో ఉన్నాయి.
- పేదలకు 143 కోట్ల ఎల్‌ఈడీ బల్బులు ఇచ్చాం.
- ఆవాస్ యోజనలో భాగంగా 1.53 లక్షల ఇళ్లు నిర్మించాం.
- గ్రామ్ సడక్ యోజన కోసం రూ.19 వేల కోట్లు ఖర్చుపెట్టాం.
- ఇన్‌సాల్వెన్సీ అండ్ బ్యాంక్ రప్టసీ కోడ్ ద్వారా రూ.3 లక్షల కోట్లు రికవరీ చేయగలిగాం.
- స్వచ్ఛతను మరో అడుగు ముందుకు తీసుకెళ్లాం. 5.45 లక్షల గ్రామాల్లో బహిరంగ మలవిసర్జనకు దూరమయ్యాయి.
- ఐదేళ్లలో సంస్కరణలను చేపట్టాం. ద్రవ్యలోటును 2.5 శాతానికి తగ్గించాం. రైతుల ఆదాయం రెట్టింపు అయ్యింది.