పాఠశాల విద్యాశాఖ, తెలంగాణ ప్రభుత్వం
“ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట" కార్యక్రమం : 2019-2020
తేది : 14-06-2019 నుండి 19-06-2019
14-06-2019
మొదటి రోజు : మన ఊరి బడి
• క్ర.సం 27 లో తెలిపిన విధంగా రోజువారీ కార్యక్రమాలను నిర్వహించాలి.
• ఆవాస ప్రాంతంలో బడిబాట ప్రాధాన్యత గుర్తించే విధముగా పాఠశాలను ఆకర్షణీయంగా అలంకరించుకోవాలి. ర్యాలీ నిర్వహించాలి మరియు కరపత్రాలు పంచాలి.
• తల్లిదండ్రుల సమావేశం నిర్వహించి గుణాత్మక విద్యా సాధనకై చేస్తున్న కార్యక్రమాలు, విధానాలు, సౌకర్యాలు తెలియజేయాలి.
• పాఠశాల విద్యా కమిటీ మరియు ఉపాధ్యాయ బృందం కలిసి పాఠశాల అభివృద్ధికి వార్షిక కార్యచరణ ప్రణాళికను రూపొందించుకోవాలి.
• పాఠశాల యాజమాన్య కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, స్వచ్చంద సంస్థలు, పూర్వ విద్యార్థులు మరియు సమాజ సహకారంతో పాఠశాలను అభివృద్ధిపరచుకోవాలి.
• పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచుటకు మరియు నాణ్యమైన విద్యను అందించుటకు, విద్యా ప్రమాణాలు పెంపొందించుటకు తీర్మానాలు చేసుకోవాలి,
15-06-2019
రెండవ రోజు : బాలికా విద్య
• క్ర.సం 27 లో తెలిపిన విధంగా రోజువారీ కార్యక్రమాలను నిర్వహించాలి.
• బాలికల ఆరోగ్య పరిరక్షణకై ప్రభుత్వం ద్వారా పంపిణీ చేయబడుతున్న (Health and Hygiene Kit) ఆరోగ్య పరిరక్షణ కిట్ గురించి వివరించాలి..
• కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయ ప్రత్యేక అధికారి జె.జి. వి. విలలో చేరుటకు అర్హత కలిగిన విద్యార్థినులు మరియు వారి తల్లిదండ్రులను ఆహ్వానించి, సాధ్యాలను గురించి తెలియజేయాలి.
• పాఠశాలల్లో బాలికల విద్య తీసుకోబడుతున్న ప్రత్యేక సౌకర్యాలు మార్షల్ ఆర్ట్స్ జీవన నైపుణ్యాలు, ప్రత్యేకావసరాలు గల బాలికలకు స్టయిఫండ్ మొదలగునవి) వివరించాలి.
• బాలికలలో ప్రత్యేక నైపుణ్యాలు కనబర్చిన లేదా ఫలితాలను సాధించిన వారిని గుర్తించి బహుమతులను లేదా ప్రశంసా పత్రములను అందజేయాలి.
• బాలికల విద్య ప్రాధాన్యతను తెలియజేసే విధంగా మహిళా అధికారులచే ఉపన్యాసాలు ఇప్పించాలి.
17-06-2019
మూడవ రోజు సామూహిక అక్షరాభ్యాసం
• క్ర.సం 27 లో తెలిపిన విధంగా రోజువారీ జార్చక్రమాలను నిర్వహించాలి.
• సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమమునకు గౌరవ ప్రకా ప్రతినిధులను ఆహ్వానించి అధి కార్యక్రమాన్ని ఒక పండుగ వాతావరణంలో నిర్వహించాలి. బడిబాట ప్రాధాన్యతను మరియు చదువు యొక్క విశిష్టతను తెలియచేసే సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించుకోవాలి.
• నూతనంగా నమోదైన పిల్లలందరూ వారి తల్లిదండ్రులతో సహా హాజరయ్యేలా చూడాలి.
• అక్షరాభ్యాసం కోసం కావాల్సిన సామాగ్రిని సమకూర్చుకోవాలి,
• ఉన్నత పాఠశాలల్లో నూతనంగా చేరిన పిల్లల తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించాలి.
18-06-2019
నాల్గవ రోజు : స్వచ్ఛ పాఠశాల / హరితహారం
• క్ర.సం 27 లో తెలిపిన విధంగా రోజువారీ కార్యక్రమాలను నిల్వహించాలి,
ప్రతి తరగతి గదిలో గల వృధా సామాగ్రిని తొలగించి శుభ్రం చేసుకోవాలి.
• పాఠశాల ప్రాంగణంలో పచ్చదనం పెంపొందించే విధముగా మొక్కలను నాటించుట మరియు నాటిన మొక్కల సంరక్షణ బాధ్యతలను ఉపాధ్యాయులకు, విద్యార్థులకు కేటాయించాలి
• పాఠశాల ప్రాంగణమును ఆకర్షణీయంగా సిద్ధం చేసుకోవాలి.
• మరుగుదొడ్లు, మంచినీటి సౌకర్యాలను వినియోగంలోకి తీసుకోవాలి,
• వాటర్ ట్యాంకను స్టీరింగ్ పౌడర్‌తో శుభ్రం చేయించుకోవాలి.
19-06-2019
ఐదవ రోజు: పాఠశాల యాజమాన్య కమిటి / బాలకార్మికుల విముక్తి
• పాఠశాల యాజమాన్య కమిటీ సభ్యులను భాగస్వామ్యం చేస్తూ డోర్ టు డోర్ సర్వే నిర్వహించడం
• పాఠశాలలో నిర్వహించే పాఠశాల యాజమాన్య కమిటీలకు అందరూ హాజరయ్యే విధంగా ఎస్ ఎస్ సి మెంబర్చే తీర్మాణాలు చేయించడం,
• క్ర, సం 27 లో తెలిపిన విధంగా రోజువారీ కార్యక్రమాలను నిర్వహించాలి.
• ఆవాస ప్రాంతంలో గల బడిబయటీ బాల బాలికలను వారి తల్లిదండ్రులకు కలిసి వారిని బడిలో చేర్చుటకు ప్రణాళికను రూపొందించుకొని అమలు చేయాలి.
• పనికోసం వలస వచ్చిన వారి పిల్లలను గుర్తించి సమీపంలో గల పాఠశాలల్లో నేర్పించడం.
• మండల టాస్క్ ఫోర్సు కమిటీచే యాజమానుల నుండి బాలకార్మికులు విముక్తి కావించి పాఠశాలలో చేర్పించాలి..
• పదవీ విరమణ పొందిన ఉపాధ్యాయులను లెక్చరర్లను /ప్రొఫెసర్లను/ ఉద్యోగులను పాఠశాలకు మర్యాదపూర్వకంగా ఆహ్వానించి వారి సేవలను స్వచ్చందంగా పాఠశాల అవసరాలకు అనుగుణంగా వినియోగించుకొనవలెను.