Promotion Pay Fixation 22a(i), 22B Details, Bill Software
ప్రమోషన్ పొందిన సందర్భంలో వేతన స్థిరీకరణ:
1.Pay fixation under FR 22 A(i) on promotion date
2.Re-Pay fixation on increment date in lower post under FR22B
3.Pay fixation under FR 22 B on promotion date
4.Intial pay fixation at minimum of the time scale in promotion post (it is automatic generated based on selection of scale in promotion post)
it has option of AGI with cumulative effect/without cumulative effect along with HPL/EOL option.
నిబంధనల ప్రకారం వేతన స్థిరీకరణ రెండు విధాలుగా చేయవచ్చు.
1. 'వాస్తవ ప్రమోషన్' తేదీ నాడు గానీ లేదా
2. క్రిందిపోస్టులోని తదుపరి 'ఇంక్రిమెంట్' తేదీ నాడు గానీ వేతన స్థిరీకరణ చేయవచ్చును.
జివో ఎంఎస్ నెం. 145, ఆర్థిక తేదీ: 19.05.2009 ప్రకారం ఉద్యోగికి లాభదాయకంగా ఉండే విధానంలో పైరెండింటిలో
దేనిప్రకారం అయిన ఉద్యోగి ఆప్షన్ తో పనిలేకుండానే వేతన నిర్ణయం చేసేబాధ్యత డ్రాయింగ్
అధికారికి కల్పించబడింది.
2005 పిఆర్సీ
సిఫార్సులకు అనుగుణంగా ఇవ్వబడిన ఆటోమాటిక్ అడ్వాన్మెంట్ స్కీమ్ జివో 241 ఆర్థిక తేదీ: 28-09-2005 ద్వారా 8/16 స్కేళ్ళు
పొందుతూ ప్రమోషన్ వచ్చిన వారికి కూడా ఎఫ్ ఆర్ 22బి ప్రకారం వేతన స్థిరీకణలో రెండు ఇంక్రిమెంట్లు లభిస్తాయి. 2010, 2015 వేతన
స్కేళ్లలో ఆర్డినరీ 6/12/18 స్కేళ్లు పొందుతూ ప్రమోషన్ వచ్చిన వారికి ఎఫ్ ఆర్ 22బి ప్రకారం వేతన స్థిరీకరణ
జరుగుతుంది.
దీని
ప్రకారం క్రింది పోస్టులో వేతనమునకు ఒక నోషనల్ ఇంక్రిమెంట్ కలిపి సదరు వేతనం
ఆధారంగా పై పోస్టు యొక్క స్కేలులోని తదుపరి స్థిరీకరణ వేతన స్థిరీకరణ చేయబడుతుంది.
ఈ నిబంధన
ప్రకారం వేతన స్థిరీకరణ రెండు విధాలుగా చేయవచ్చు.
1. 'వాస్తవ ప్రమోషన్' తేదీ నాడు గానీ లేదా
2. క్రిందిపోస్టులోని తదుపరి 'ఇంక్రిమెంట్' తేదీ నాడు గానీ వేతన స్థిరీకరణ చేయవచ్చును.
ఉదాహరణ: తేదీ : 02.07.2010 first Appoinment గల Mallesham అనే S.G. T ఉపాధ్యాయుడు తేదీ: 03.11.2019న స్కూల్ అసిస్టెంట్ గా
పదోన్నతి పొందినాడు. సదరు తేదీనాటికి అతని వేతనం రూ.30580/- , స్కేలు రూ.22460-66330 లు గా ఉన్నది. వీరి వేతనం ఎఫ్ ఆర్ 22బి ప్రకారం రెండు విధాలుగా స్థిరీకరించవచ్చు.
I. ప్రమోషన్ తేదీనాడు వేతన
స్థిరీకరణకు option ఇచ్చినా
సందర్భంలో:
1. తేదీ: 03-11-2019 నాటికి
ఎస్జిటి పోస్టులో మూల వేతనం మరియు స్కేలు:రూ, 30580/-స్కేలు 22460-66330
2. తేది : 03-11-2019 నాడు ఎఫ్
ఆర్ 22బి ప్రకారం SGT
పోస్ట్ నందు ఒక నోషనల్ ఇంక్రిమెంటు మంజూరు :రూ, 31460/- ,స్కేలు 22460-66330
3. తేది : 03-11-2019 నాడు స్కూల్
అసిస్టెంట్ స్కేలులో తదుపరి స్టేజిలో వేతన నిర్ణయం : రూ,32340/- స్కేలు 28940 -
78910
4. తదుపరి
ఇంక్రిమెంట్ తేదీ: 03/11/2020 (or) 01/11/2020
★ EMPLOYEE ఇంక్రిమెంట్ తేదీ >>> ప్రమోషన్ తేదీ నెలకు
మారుతుంది. (The date of next increment shall be after
completion of one year of service only from the date the pay fixed under FR 22
B.)
II. క్రింది పోస్టులోని ఇంక్రిమెంట్
తేదీనాడు వేతన స్థిరీకరణకు option ఇచ్చినా
సందర్భంలో:
(DATE OF FIRST APPOINTMENT: 02/07/2010 ,Date of Promotion :03/11/2019,
Date of next AGI: 01.07.2020)
a) On the date
of Promotion ie., 03/11/2019 నాడు వేతన స్థిరీకరణ :
1. పదోన్నతి పొందిన తేదీ 03/11/2019(PROMOTION
DATE) నాటికి
ఎస్జిటీ పోస్టులో మూల వేతనం మరియు స్కేలు: రూ, 30580/-స్కేలు 22460-66330
2. తేదీ 03/11/2019 పదోన్నతి పొందిన రోజున ఎఫ్ ఆర్ 22(1) ప్రకారం initial గా వేతన నిర్ణయం: రూ, 31460 స్కేలు 28940-78910
b) On the date next increment ie., 01/07/2020 నాడు వేతన స్థిరీకరణ :
1. పదోన్నతి పొందిన తేదీ 03/11/2019(PROMOTION
DATE) నాటికి
ఎస్జిటీ పోస్టులో మూల వేతనం మరియు స్కేలు: రూ, 30580/-స్కేలు 22460-66330
2. తేదీ 03/11/2019 పదోన్నతి పొందిన రోజున ఎఫ్ ఆర్ 22(1) ప్రకారం initial గా వేతన నిర్ణయం: రూ, 31460 స్కేలు 28940-78910
3. తేదీ 01.07.2020 న ఎస్జిటి పోస్టులో సాదారణ వార్షిక ఇంక్రిమెంట్ మంజూరు: రూ, 31460 ,స్కేలు 22460-66330
4. తేదీ 01.07.2020 న ఎస్జిటి
పోస్టులో ఎఫ్ ఆర్ 22బి ప్రకారం ఒక నోషనల్ ఇంక్రిమెంట్
మంజూరు : రూ 32340, /- ,స్కేలు 22460-66330
5. స్కూల్
అసిస్టెంట్ పోస్టు స్కేలులో తదుపరి స్టేజిలో వేతన నిర్ణయం : రూ,33220/- ,స్కేలు 28940 - 78910
6. తదుపరి
ఇంక్రిమెంట్ తేదీ: 01.07.2021 (అనగా S.G.T Post నందు ఉన్న ఇంక్రిమెంట్ తేది కొనసాగును )
👉 24 సంవత్సరాల స్కేలు పొందుతూ ప్రమోషన్ వచ్చినవారికి ఈ నిబంధన వర్తించదు. వారికి ఎఫ్ ఆర్22ఎ(1)నిబంధన వర్తిస్తుంది. దాని వలన ఒక ఇంక్రిమెంట్ లభిస్తుంది.
(FR 22 B is not applicable for
those employees who are promoted while drawing SPP II/SAPP II scales. Their pay
has to be fixed in the promotion category vide FR 22 (a)(i) read with FR
31(2).)
Model Promotion fixation (if Promotion Month & increment month same)
ఉదాహరణ: తేదీ : 28.11.2010 first Appoinment గల Mallesham అనే S.G. T ఉపాధ్యాయుడు తేదీ: 15.11.2019న స్కూల్ అసిస్టెంట్ గా పదోన్నతి పొందినాడు. సదరు తేదీనాటికి (without AGI in November month) అతని వేతనం రూ.30580/- , స్కేలు రూ.22460-66330 లు గా ఉన్నది. వీరి వేతనం ఎఫ్ ఆర్ 22బి ప్రకారం క్రింది విదంగా స్థిరీకరించవచ్చు.
తేదీ: 31.10.2019 నాడు SGT పోస్టులో
మూల వేతనం మరియు స్కేలు:రూ, 30580/-స్కేలు 22460-66330
ముందుగా
తేదీ 01.11.2019 నాడు ఎస్జిటి పోస్టులో
సాదారణ వార్షిక ఇంక్రిమెంట్ మంజూరుచేయాలి : రూ, 31460 ,స్కేలు 22460-66330
తర్వాత తేది : 15-11-2019 నాడు ఎఫ్ ఆర్ 22బి ప్రకారం SGT పోస్ట్ నందు
ఒక నోషనల్ ఇంక్రిమెంటు మంజూరు :రూ, 32340/- స్కేలు 22460-66330
తేది : 15-11-2019 నాడు స్కూల్ అసిస్టెంట్ స్కేలులో
తదుపరి స్టేజిలో వేతన నిర్ణయం : రూ,33220/- స్కేలు 28940 - 78910
తదుపరి ఇంక్రిమెంట్ తేదీ: 15/11/2020 (లేదా ) 01/11/2020
★ ఇంక్రిమెంట్ తేదీ ప్రమోషన్ తేదీ నెలకు మారుతుంది. (The date of next increment shall be after completion of one year of
service only from the date the pay fixed under FR 22 B.)