మెడికల్ రీయింబర్స్‌మెంట్ - ఆన్‌లైన్ విధానం

మెడికల్ రీయింబర్స్‌మెంట్ - ఆన్‌లైన్ విధానం

విద్యాశాఖలో మెడికల్ బిల్లుల పెండెన్సీ తగ్గించడం, పారదర్శకత పెంచడం మరియు ప్రక్రియ వేగవంతం చేయడం కోసం మెడికల్ రీయింబర్స్‌మెంట్ ప్రక్రియను దశలవారీగా పూర్తిగా ఆన్‌లైన్‌లోకి తీసుకువస్తున్నారు.

  • ఉద్యోగులు ISMS / TG Online Portal ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
  • అప్లోడ్ చేసిన డాక్యుమెంట్లు సంబంధిత అధికారులకు ఆటోమేటిక్‌గా చేరతాయి.
  • ఆన్‌లైన్‌తో పాటు ఒరిజినల్ బిల్లులు మరియు జెరాక్స్ కాపీలు రిజిస్టర్డ్ పోస్టు ద్వారా పంపడం తప్పనిసరి.
₹50,000 లోపు బిల్లుల ప్రక్రియ :
  • ఉద్యోగి ఆన్‌లైన్‌లో అప్లై చేస్తారు.
  • దరఖాస్తు DEO కార్యాలయానికి వెళ్తుంది.
  • Clerk → Superintendent → AD స్థాయిల్లో పరిశీలన జరుగుతుంది.
  • అవసరమైన పత్రాలు DM&HO కు ఆఫ్‌లైన్ ద్వారా పంపాలి.
  • స్క్రూటిని పూర్తయ్యాక DEO ఆమోదం ఇస్తారు.
  • Proceedings జారీ అవుతుంది.
₹50,000 పైబడిన బిల్లుల ప్రక్రియ
  • అప్లికేషన్ DSC కార్యాలయానికి వెళ్తుంది.
  • Clerk → Superintendent → AD ద్వారా పరిశీలన జరుగుతుంది.
  • DME / సంబంధిత ఆసుపత్రులకు స్క్రూటినీ కోసం పంపబడుతుంది.
  • స్క్రూటినీ పూర్తైన తర్వాత JD ఆమోదం ఇస్తారు.
  • Final Proceedings అప్లోడ్ అవుతుంది.
కొత్త విధానంలో ప్రత్యేక అంశాలు
  • మొదటి స్థాయిలో DDO / MEO / HM కి అప్లికేషన్ వెళ్తుంది.
  • ట్రాకింగ్ సిస్టమ్ ద్వారా పోస్టు వివరాలు కూడా ఆన్‌లైన్‌లో కనిపిస్తాయి.
  • Candidate తన అప్లికేషన్ స్థితిని ఇంటి నుంచే తెలుసుకోవచ్చు.
  • పారదర్శకత మరియు పెండెన్సీ తగ్గించడం ప్రధాన లక్ష్యం.

● అమలు తేదీలు :

  • 16-05-2026 సాయంత్రం వరకు పాత లాగిన్లు క్లియర్ చేయబడతాయి.
  • 17-05-2026 నుండి కొత్త సిస్టమ్ ప్రారంభం.
  • 18-05-2026 నుండి పూర్తిస్థాయి అమలు.