2017
- 18 ఆర్థిక సంవత్సరం
ఆదాయపు పన్ను గణన
ఆదాయపు పన్ను శ్లాబులు 2017-18 ఆర్థిక
సంవత్సరానికి 2016-17 ఆర్థిక సంవత్సరం వరకు
ఉన్న 10%
శ్లాబ్ స్థానములో 5% శ్లాబ్ గా మార్చారు.
మిగితా సెక్షన్ లను దాదాపుగా గత ఆర్ధిక సంవత్సరం వరకు ఉన్నవిధంగానే కొనసాగించారు. ఆదాయపు
పన్ను చట్టం (1961) ప్రకారం 2017-18 ఆర్థిక సంవత్సరం
గణన లో తేది 01.04.2017 నుండి
31.03.2018 వరకు పొందిన జీతభత్యాలు ఆధాయముగా పరిగణించాలి అదే విదంగా సేవింగ్స్ మరియు మినహాయింపులు పొందే సొమ్ము ఈ కాలంలో చెల్లించినవి అయి ఉండాలి.
Section 87A ప్రకారం పన్ను
చెల్లించాల్సిన ఆదాయము 3.5లక్షల
లోపు ఉన్నవారికి చెల్లించాల్సిన టాక్స్ లో రిబేట్ సదుపాయాన్ని రూ. 2,500/-
కు తగ్గించారు. * చెల్లించాల్సిన ఆదాయపు పన్ను పైన 3% (2+1) ఎడ్యుకేషన్ సెస్ అదనంగా చెల్లించాలి.
ఆదాయముగా పరిగనించబడే జీతబత్యములు:-
Pay, DA, HRA, IR, CCA, అలవెన్సులు, మెడికల్ అలవెన్సులు, అదనపు ఇంక్రిమెంట్ అలవెన్స్, సరెండర్ లీవు జీతం, పి.అర్.సి బకాయిలు, స్టెప్ అప్ ఎరియర్స్, సెలవు కాలపు జీతం, మొ. నవి ఆదాయంగా పరిగనించబడును.ఆదాయముగా పరిగనించబడని అంశములు :-
పదవి విరమణ తరువాత పొందే GPF/GIS/AP(TS)GLI లనుండి పొందే సొమ్ము మరియు నగదుగా మార్చుకున్న సంపాదిత సెలవులు, అర్దజీతపు సెలవుల పై వచ్చిన సొమ్ము, LTC పై పొందిన ప్రయాణ భత్యం, మెడికల్ రియంబర్స్మేంట్ మరియు GPF, AP(TS)GLI లలో అప్పుగా పొందిన సొమ్ము ఆదాయంగా పరిగణించరాదు.HRA మినహాయింపు :
Under Section 10(13A) ప్రకారం క్రింది మూడు అంశంలలో ఏది తక్కువయితే ఆ మొత్తము ఆదాయం నుండి మినహాయింపు పొందవచ్చును.- పొందిన ఇంటి అద్దె బత్యం మొత్తం
- ఇంటి అద్దెగా చెల్లించిన మొత్తం - 10% మూలవేతనం + డి.ఎ
- 40% వేతనం
ఆదాయపు పన్ను శాఖ మినహాయింపులు తెలుసుకోండి..
ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80సీ మొదలుకొని 80యూ వరకూ అందుబాటులో ఉన్న వివిధ పన్ను
మినహాయింపు మార్గాలను తెలుసుకుందాం.
సంపాదించిన డబ్బులో ప్రభుత్వానికి
ఎంతో కొంత పన్ను చెల్లించాలంటే ఎవరికైనా బాధగానే ఉంటుంది. అందుకే, ఎలాగైనా పన్ను తగ్గించుకునేందుకు అన్ని మార్గాలను అన్వేషిస్తారు. ఆదాయం ఎంత ఉన్నా పన్ను మినహాయింపులకు ఎంతో కొంత అవకాశం ఉంటుంది. ఐటీ చట్టం
సెక్షన్ 80సీ కింద కొన్నింటికి పన్ను మినహాయింపులు పొందేందుకు వీలు
కల్పిస్తుంది. ఇవే కాకుండా వేరే సెక్షన్ల కింద సైతం పన్ను మినహాయింపులను కోరేందుకు పన్ను చెల్లింపుదార్లకు అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో
సెక్షన్ 80సీ మొదలుకొని 80యూ వరకూ అందుబాటులో ఉన్న వివిధ పన్ను మినహాయింపు మార్గాలను తెలుసుకుందాం.
ఆదాయపు
పన్ను శాఖ మినహాయింపులు తెలుసుకోండి..
ఆదాయపు పన్ను రిటర్నుల ఫారాన్ని పూర్తి చేసే
ముందు వివిధ సెక్షన్ల కింద కోరాల్సిన మినహాయింపులన్నీ క్లెయిం చేసుకున్నామా లేదా సరిచూసుకోవాలి. కొన్ని ముఖ్యమైన మినహాయింపులను
పరిశీలిస్తే...
సెక్షన్
80సీ కింద ఉన్న మినహాయింపులు
పన్ను
సంక్రమించే ఆదాయం ఉంటే ఎలాగైన ఐటీ రిటర్నులు ఫైల్ చేయాల్సిందే. అయితే
ఎవరికైనా తక్కువ పన్ను కడితే మేలు అనే అభిప్రాయం ఉంటుంది. అందుకోసమే
ఐటీ చట్టంలో మినహాయింపులకు అవకాశం కల్పించారు. సెక్షన్ 80-సీ కింద కొన్ని రకాల పెట్టుబడులు,
విరాళాలకు మినహాయింపు
ఉంది. పీఎఫ్, పీపీఎఫ్,
నేషనల్ సేవింగ్స్
సర్టిఫికెట్లు, కిసాన్
వికాస పత్రాలు, ఈఎల్‌ఎస్‌ఎస్...
మొదలైనవి. ప్రస్తుతం ఈ మినహాయింపు ద్వారా రూ.1,50,000 ఆదా చేసుకోవచ్చు. అవేంటో తెలుసుకుందాం.
ఉద్యోగస్తులు భవిష్య నిధి(ఈపీఎఫ్) కోసం ప్రతి నెలా చందా చెల్లించాల్సి ఉంటుంది. నిబంధనల మేరకు నిర్ణీత శాతం కట్టడంతోపాటు... కావాలంటే స్వచ్చందంగా తన వంతు అదనంగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఈ మొత్తాలకు సెక్షన్ 80సీ కింద మినహాయింపు ఉంది. ఈపీఎఫ్, వీపీఎఫ్ రూపంలో రూ.1,50,000 వరకు ఇన్వెస్ట్ చేయడం ద్వారా రూ.4 లక్షల వరకు పన్ను లేకుండా చూసుకోవచ్చు. మీకు వేరే ఇతర ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్లు లేనప్పుడే వాలంటరీ ప్రావిడెంట్ ఫండ్ ఎంచుకోవడం మంచిది.
B. పీపీఎఫ్
కేవలం ఉద్యోగస్తులే కాకుండా సంపాదించే వారెవరైనా పీపీఎఫ్ ద్వారా పన్ను ఆదా చేసుకునే వెసులుబాటు ఉంది. సెక్షన్ 80సీ ప్రకారం పీపీఎఫ్ మార్గంలో రూ. 1,50,000 వరకూ పెట్టే పెట్టుబడులకు పన్ను మినహాయింపు కలదు. సాధారణంగా పీపీఎఫ్ మార్గంలో పెట్టుబడి పెడితే 15 ఏళ్ల వరకూ వెనక్కు తీసుకోవడానికి ఉండదు. అయితే కొన్ని ప్రత్యేక కారణాలుంటే 7వ సంవత్సరం నుంచి పాక్షిక ఉపసంహరణకు అనుమతిస్తారు.
D. ఈఎల్ఎస్ఎస్
మ్యూచువల్ ఫండ్లలో పన్ను ఆదా సౌకర్యం కల్పించేవి కొన్ని ఉన్నాయి. వాటినే ఈక్విటీ ఆధారిత పొదుపు పథకాలు(ఈఎల్ఎస్ఎస్) అంటారు. ఈఎల్ఎస్ఎస్ పెట్టుబడులకు సంబంధించినంత వరకూ ఐటీ చట్టం సెక్షన్ 80సీ కింద రూ.1,50,000 వరకూ మినహాయింపుకు అవకాశం కల్పిస్తుంది. ఈఎల్ఎస్ఎస్ పొదుపు పథకాలన్ని 3 ఏళ్ల లాకిన్ పీరియడ్ ఉంటుంది.
D. గృహ రుణ చెల్లింపు గృహ రుణం విషయంలో రెండు ముఖ్యమైనవి ఉంటాయి. ఒకటి అసలు, రెండోది వడ్డీ. కేవలం అసలుకు మాత్రం సెక్షన్ 80సీ కింద మినహాయింపు సౌలభ్యం ఉంటుంది. వడ్డీకి సైతం సెక్షన్ 80ఈఈ, సెక్షన్ 24 కింద మినహాయింపు పొందే అవకాశం ఉంది. వడ్డీ మొత్తం రూ.50వేల వరకూ ఈ సెక్షన్ కింద మినహాయింపు కోరవచ్చు.

E. సుకన్య సమృద్ధి యోజన ఖాతా
ఈ పథకం కింద మీ కూతురి పేరిట ఖాతాను తెరిచి
మినహాయింపు కోరవచ్చు. సెక్షన్ 80సీ కింద గరిష్టంగా ఎంత వరకైనా
పెట్టుబడులు పెట్టుకోవచ్చు. ఒక ఆర్థిక సంవత్సరంలో కనీస డిపాజిట్ రూ.1000 నుంచి గరిష్టంగా రూ.150,000 వరకూ చేయవచ్చు.
సెక్షన్ 80సీ కింద రూ.1,50,000 వరకూ మినహాయింపు కోరవచ్చు.
F. జాతీయ పొదుపు పత్రాలు(ఎన్ఎస్‌సీ)
జాతీయ పొదుపు పత్రాలకు 5 ఏళ్ల మెచ్యూరిటీ కాలపరిమితి ఉంటుంది. కనిష్టంగా రూ.100 నుంచి మొదలుకొని గరిష్టంగా ఎంత వరకైనా పెట్టుబడులు పెట్టొచ్చు. ఎన్ఎస్‌సీలో పెట్టే పెట్టుబడి సొమ్ముకు 80సీ కింద మినహాయింపు ఉంటుంది. దీనిపై వడ్డీని ఆరు నెలకొకసారి చక్రవడ్డీ రూపంలో లెక్కిస్తారు. వడ్డీకి పన్ను ఉంటుంది.
G. 5 ఏళ్ల డిపాజిట్లు
5 ఏళ్ల పోస్టాఫీసు డిపాజిట్లకు సైతం ట్యాక్స్ మినహాయింపు ఉంది. 5 ఏళ్ల పోస్టాఫీసు డిపాజిట్లు ఏ తపాలా శాఖ కార్యాలయంలోనైనా తెరవొచ్చు. ఇవి ఇతర ఫిక్స్‌డ్ డిపాజిట్ల లానే పనిచేస్తాయి. అయితే 5 ఏళ్ల కచ్చితమైన లాకిన్ పీరియడ్ ఉండదు. పెట్టుబడికి రెండింతల రాబడితో పాటు పన్ను మినహాయింపు సౌకర్యం ఉండటం వీటి ప్రత్యేకతం. ఈ పోస్టాఫీసు డిపాజిట్లతో పాటు, బ్యాంకుల్లో చేసే 5 ఏళ్ల ఎఫ్‌డీలకు సైతం 80సీ కింద పన్ను మినహాయింపు ఉంటుంది.
H. పిల్లల చదువు ఫీజులు: తల్లిదండ్రులు ఎప్పుడూ పిల్లలకు మంచి చదువును ఇవ్వాలని కోరుకుంటారు. ఇప్పుడు చదువులు ఖరీదైపోయాయి. ఈ క్రమంలో పిల్లల పాఠశాల, కళాశాల ఫీజులు లక్షల్లో చెల్లిస్తున్నారు. అయితే ట్యూషన్ ఫీజుకు సంబంధించి ఆదాయపు పన్ను శాఖ కొన్ని మినహాయింపులకు అవకాశం కల్పించింది. సెక్షన్ 80సీ కింద మీరు పన్ను మినహాయంపులను క్లెయిం చేసుకోవచ్చు.
I. ఇన్ ఫ్రాస్ట్రక్చర్ బాండ్లు
ఇన్‌ఫ్రా బాండ్లగా అందరికీ తెలిసిన వీటిలో చేసే పెట్టుబడులకూ సెక్షన్ 80 సీ కింద పన్ను ప్రయోజనాలు ఉంటాయి. గతంలో 2010-11, 2011-12 సంవత్సరాల్లో ప్రభుత్వ అనుమతితో మౌలిక వసతుల రంగంలోని కంపెనీలు వీటిని ప్రవేశపెట్టాయి. 80సీ కింద వీటిపై లభించే పన్ను మినహాయింపుతో పాటు , మొత్తం స్థూల ఆదాయంలో భాగంగా ఈ బాండ్లపై రూ.20 వేల వరకూ సెక్షన్ 80సీసీఎఫ్ కింద మినహాయింపుకు అర్హత కలదు.
2. సెక్షన్
80 CCG:F. జాతీయ పొదుపు పత్రాలు(ఎన్ఎస్‌సీ)

రాజీవ్ గాంధీ ఈక్విటీ పొదుపు పథకం (ఆర్‌జీఈఎస్‌ఎస్)లో మీరు మదుపు చేసి ఉంటే.. ఈ సెక్షన్ కింద మినహాయింపు కోరవచ్చు. ఈ పథకంలో గరిష్ఠంగా రూ.50వేల వరకూ మదుపు చేసే వీలు ఉండేది. మదుపు చేసిన మొత్తంలో 50శాతం వరకూ పన్ను మినహాయింపు కోసం చూపించుకోవచ్చు. వార్షిక స్థూల ఆదాయం రూ.12లక్షల లోపు ఉండి, కొత్తగా మార్కెట్లో మదుపు చేసే వారు ఈ పథకంలో చేరడానికి అర్హులుగా నిర్ణయించారు. మినహాయింపు ప్రయోజనాల కోసంపెట్టిన పెట్టుబడిని మూడేళ్లపాటు కొనసాగించాల్సి ఉంటుంది.
3. సెక్షన్ 80 D:
60 ఏళ్ల లోపు వ్యక్తులకు ఆరోగ్య బీమా పాలసీకి చెల్లించిన ప్రీమియానికి రూ.25వేల వరకూ మినహాయింపు వర్తిస్తుంది. పన్ను చెల్లింపుదారులు సీనియర్ సిటిజన్లయితే ఈ పరిమితి రూ.30వేలు. మీపై ఆధారపడిన తల్లిదండ్రుల కోసం తీసుకున్న పాలసీకి చెల్లించే ప్రీమియానికీ రూ.25వేల వరకూ మినహాయింపు లభిస్తుంది. వారు సీనియర్ సిటిజన్లయితే రూ.30వేల వరకూ మినహాయింపును అనుమతిస్తారు. వీటికి అదనంగా ఆరోగ్య పరీక్షల నిమిత్తం వెచ్చించిన మొత్తానికి రూ.5వేల వరకూ మినహాయింపును క్లెయిం చేసుకోవచ్చు. అంటే, ఈ సెక్షన్ కింద దాదాపు రూ.55వేల వరకూ (వాస్తవంగా ఖర్చు చేసినప్పుడు) మినహాయింపు పొందే వెసులుబాటు ఉంది. వీటితోపాటు.. వైద్య చికిత్స కోసం వాస్తవంగా ఖర్చు చేసిన మొత్తాన్ని రూ.30వేల వరకూ కూడా మినహాయింపు కోసం చూపించుకోవచ్చు.

4. సెక్షన్ 80 DD :
వైకల్యం ఉండి, తనపై ఆధారపడిన వారికి వెచ్చించే వైద్య ఖర్చులకు ఈ సెక్షన్ కింద మినహాయింపులు పొందవచ్చు. పాక్షిక
వైకల్యం ఉన్నప్పుడు రూ.75వేల వరకూ.. తీవ్ర వైకల్యం ఉన్నప్పుడు రూ.1,25,000 వరకూ ఈ మినహాయింపు లభిస్తుంది.
5.సెక్షన్ 80
DDB : పన్ను చెల్లింపుదారుడు లేదా అతని మీద ఆధారపడిన వారికి రూల్ 11డీడీ(2)లో పేర్కొన్న తీవ్ర వ్యాధులు ఉన్నప్పుడు వెచ్చించే ఖర్చులపై
గరిష్ఠంగా రూ.40 వేల వరకూ మినహాయింపు కోరవచ్చు. 60ఏళ్లు దాటిన వారైతే గరిష్ఠంగా రూ.60 వేల వరకూ మినహాయింపు వర్తిస్తుంది. క్యాన్సర్, కిడ్నీ సమస్యలు, ఎయిడ్స్ వంటి రోగాలకు భారీ ఖర్చుతో కూడుకున్న వైద్యం అవసరం. అందుకే ఈ తరహా
అనారోగ్య సమస్యలకూ ఐటీ చట్టం సెక్షన్ 80డీడీబీ కింద పన్ను మినహాయింపులున్నాయి.
6.సెక్షన్ 80
E : సొంతంగా విద్యాభ్యాసం కోసం
రుణం తీసుకున్నా.. పిల్లల ఉన్నత విద్యాభ్యాసం కోసం తీసుకున్న
విద్యారుణంపై చెల్లించే వడ్డీకి ఈ సెక్షన్ కింద పూర్తి మినహాయింపు
లభిస్తుంది.
7. సెక్షన్ 80జీ
చట్టబద్ధంగా మీరిచ్చిన విరాళాలపై 50శాతం మేరకు ఇది వర్తిస్తుంది. చెక్కులు, డీడీల ద్వారా విరాళం ఇవ్వాలి. నగదు
రూపంలో ఇచ్చినప్పుడు రూ.10 వేల వరకూ మాత్రమే మినహాయింపునకు
అవకాశం కల్పిస్తారు.
8.సెక్షన్ 87ఏఏ రిబేట్
2017-18 ఆర్థిక సంవత్సరంలో పన్ను వర్తించే ఆదాయం ఉండి 10% శ్లాబులో ఉన్నోళ్లకు ప్రత్యేక సదుపాయం కల్పించారు. రూ. 2,50,000 లక్షలకు పైన ఇంకా రూ.5 లక్షల లోపు ఆదాయం ఉన్నవాళ్లు పన్ను చెల్లిస్తున్నట్లయితే ఈ ఏడాదికి మాత్రం 5% పన్ను మాత్రమే కడితే చాలు.

9. సెక్షన్ 80 EE
గృహరుణం తీసుకొని, దానికి వడ్డీ చెల్లిస్తున్నప్పుడు మినహాయింపు ఈ సెక్షన్ కింద ప్రత్యేక మినహాయింపు పొందే అవకాశం
ఉంది. అదెప్పుడంటే..
* రుణం 2016-17 ఆర్థిక సంవత్సరంలో ఏదైనా బ్యాంకు నుంచి రూ.35లక్షల లోపు గృహరుణం తీసుకొని ఉండాలి.
* మీరు తీసుకున్న ఇంటి విలువ రూ.50 లక్షలకు మించి ఉండకూడదు.
* రుణం మంజూరైన తేదీ నాటికి అసెసీ పేరు మీద మరో ఇల్లు ఉండి ఉండకూడదు.
* వడ్డీ మొత్తం రూ.50వేల వరకూ ఈ సెక్షన్ కింద మినహాయింపు కోరవచ్చు.

10.80టీటీఏ కింద వడ్డీ
ఒక ఆర్థిక సంవత్సరంలో వచ్చిన వడ్డీ మొత్తం రూ.10 వేలు మించకపోతే ఆదాయపు పన్ను సెక్షన్ 80టీటీఏ ప్రకారం ఎలాంటి పన్ను వర్తించదు. ఒకవేళ రూ.10 వేలు దాటితే పన్ను వర్తిస్తుంది.
ఒక ఆర్థిక సంవత్సరంలో వచ్చిన వడ్డీ మొత్తం రూ.10 వేలు మించకపోతే ఆదాయపు పన్ను సెక్షన్ 80టీటీఏ ప్రకారం ఎలాంటి పన్ను వర్తించదు. ఒకవేళ రూ.10 వేలు దాటితే పన్ను వర్తిస్తుంది.
11.80 జీజీసీ
ప్రజాప్రాతినిధ్యం చట్టం 1951 సెక్షన 29ఏ కింద రాజకీయ పార్టీలకు ఇచ్చే విరాళాలకు చెక్కు ద్వారా చెల్లిస్తే
పూర్తి మినహాయింపు ఉంటుంది. గరిష్ఠ పరిమితి లేదు. నగదు రూపంలో చెల్లిస్తే రూ.10వేలకు మాత్రమే మినహా యింపు ఉంటుంది. రచయితలకు రచించిన పుస్తకాలపై వచ్చే ఆదాయంపై పన్ను మిన
హాయింపు ఉంటుంది. ప్రచురణ కర్తనుంచి
స్వీకరించిన డబ్బుకు మినహాయింపు ఉంటుంది.
12. 80 యూ
పన్ను చెల్లింపుదారు వైకల్యం వల్ల బాధపడుతున్న
వారైతే సెక్షన్ 80యూ కింద మినహాయింపులను కోరవచ్చు. 40% కంటే ఎక్కువ వైకల్యం కలిగి ఉంటే రూ.75 వేల వరకూ , 80% వైకల్యం కలిగి ఉన్నట్లైతే రూ.125,000 వరకూ మినహాయింపు కోరే వెసులుబాటు ఉంటుంది. అయితే సర్టిఫికేషన్ కలిగిన మెడికల్ అథారిటీ వైకల్యాన్ని ధ్రువీకరిస్తూ
సర్టిఫికెట్ ఇవ్వాల్సి ఉంటుంది.