ఉద్యోగ , ఉపాధ్యాయ మిత్రులకు స్వాగతం సుస్వాగతం పి అర్ టి యు పినపాక మండల శాఖ ......

E-TDS Filing Q4 (Jan-Feb-March) FY 2023-24 Due Date is 31st May 2024.......

సర్వీసు రిజిస్టరు ( SR )

సర్వీసు రిజిస్టరు-నిర్వాహణ అంశాలు

👉 *ప్రభుత్వ ఉపాధ్యాయ, ఉద్యోగుల సేవా గ్రంధముల ( సర్వీస్ బుక్ ) రిజిష్టర్ నిర్వహణ నియమాలు, పద్దతులు,  సర్వీస్ బుక్  రిజిష్టర్ నందు ఉండవలసిన నమోదులు మరియు సూచనలు మొదలగునవి పూర్తి వివరాలు తెలుగు లో..*

👉 *సర్వీస్ బుక్  రిజిష్టర్ నందు ఉండవలసిన నమోదులు ( ఎంట్రీలు ):*

1. అపాయింట్మెంట్ ఆర్డర్ వివరాలు
 2. జాయింనింగ్ తేది వివరాలు
 3. శాశ్వత స్వస్థలం.
 4. చదువు ( పూర్తి అర్హతలు హాల్ టికెట్ నంబర్ తో సహా ).
 5. పుట్టుమచ్చలు.
 6. సర్వీస్ పుస్తకం 8వ కాల-మ్ లో ఉద్యోగి సంతకం,తేది.
 7. చేతి వెలి ముద్రలు
 8. ఉద్యోగి ఫోటో మరియు ఫోటో పై DDO సంతకం
 9. ఇంక్రిమెంట్ ప్రొసీడింగ్స్.
10. సరెండర్ లీవ్ ల ప్రొసీడింగ్స్.
11. గ్రూప్ ఇన్సూరెన్స్ స్కీం. వివరాలు
12. CPS / PRAN నంబర్.
13. సంపాదిత సెలవు, హాఫ్ డే లీవ్ , జీత నష్ట సెలవుల వెరిఫికేషన్.
14. LTC other then హోం టౌన్ , హోం టౌన్ ఎంట్రీ.
15. LTC డిక్లరేషన్.
16. లీవ్ ఎకౌంటు.
17. హాఫ్ పే లీవ్ ఎకౌంటు.
18. పే ఫిక్షేషన్ ఎంట్రీలు.
19. నామినీ సహా కుటుంబ సభ్యుల వివరాలు.
20. స్పెషల్ గ్రేడ్ ఇంక్రిమెంట్ 6 - 12 -18 - 24 మంజూరు ఉతర్వులు ఎంట్రీలు.
21. స్పెషల్ పే ఎంట్రీలు.
22. బదిలీ సమయంలో రిలీవ్ ఎంట్రీ.
23. సర్వీస్ వెరిఫికేషన్ ఎంట్రీ.
24. ప్రావిడెంట్ ఫండ్ ఎకౌంటు నెంబర్.
25. APGLI /TSGLI నెంబర్.
26. కుల ధృవీకరణ నమోదు.
27. ఎంప్లాయ్ ID నెంబర్.
28. ట్రెజరీ ID నెంబర్.(G.O.Ms.No.80 తేది:19-3-2008)
29. 610 జి ఓ ప్రకారం లోకల్ స్టేటస్ నమోదు.
30. సర్వీస్ క్రమబద్ధీకరించబడిన మరియు ప్రోహిబిషన్ ఎంట్రీ.
31. పుట్టిన తేదీ ( అక్షరాలలో రాయాలి )
32. బోనాఫైద్ సర్టిఫికెట్ లు అంటించాలి.
33. హెల్త్ కార్డ్ నెంబర్.
34. ఎత్తు.
35. పితృత్వా, మాతృత్వ సెలవులు ( ఇద్దరు పిల్లల వరకు )
36. తెలంగాణ ప్రత్యేక ఇంక్రిమెంట్,
37. ప్రమోషన్ వివరాలు,
38 . మొదటి సారి ఉద్యోగం లోకి చేరిన అప్పుడు ఉద్యోగం రకం.
39. ఆధార్ కార్డు నంబర్.
40. జీతం ను పొందే బ్యాంక్ అకౌంట్ నెంబరు, బ్యాంక్ పేరు SERVICE RULES
41. డిపార్ట్మంట్ టెస్ట్ లు

👉 *సర్వీస్ బుక్  రిజిష్టర్ నిర్వహణ నియమాలు, సూచనలు, పద్దతులు:*

1)  అనివార్య కారణాల వల్ల ఏవైనా తప్పులు జరిగినట్లు అయితే వాటిని దిద్ద కూడదు,వైట్ నర్ వాడ కూడదు, రౌండ్ అప్ చేసి పైన రాసి DDO గారు సంతకం చేయాలి.

2)  కొన్ని కారణాల వల్ల  ఏదైనా నమోదు ను మార్చ వలసివస్తే  రౌండ్ అప్ చేసి పైన రాసి, మార్చిన చోట DDO సంతకం చేయడం తప్పనిసరి.

3)  సర్వీస్ రిజిష్టర్ లో ఎక్కడైనా చిరిగి పోతే అక్షరాలు కన పడే విధంగా సెల్లో టేప్ తో అతికించాలి. అట్ట లాంటివి అక్షరాలు లేని చోట చిరిగితే గం తో ఎప్పటికప్పుడు అతికిస్తు ఉండాలి.

4)  ప్రతి సంవత్సరపు సర్వీస్ వెరిఫికేషన్ చేసి వివరాలు నమోదు చేయాలి. 

01- 04 ( ఏప్రిల్ ) నుండి 31- 03 ( మార్చ్ ) వరకు సర్వీస్ వెరిఫికేషన్ నమోదు చేయాలి.

5) నెల మొదటి తేదిన జాయిన్ అయినవారు అ ముందు నెల ఆఖరు తేదిన రిటైర్ అయిన ఇంక్రిమెంట్ కలపాలి.

6) డూప్లికేట్ సర్వీస్ పుస్తకం అధికారికంగా ఉంచుకోవచ్చు.  ఇందులో ప్రతి నమోదు యందు DDO తో సంతకం చేయాలి. ఒరిజినల్ పోయినప్పుడు దీని ఆధారంగా కొత్త ది రాయబడును. లేదా ఒరిజినల్ రిజిష్టర్ నీ Xerox తీసుకుని ఉంచుకోవచ్చు కానీ DDO గారి అటేస్తేషన్ తప్పని సరి. ఈ సర్వీస్ బుక్ పై డూప్లికేట్ అని తప్పకుండా రాయాలి.

7) ఈ రిజిష్టర్ లో స్కెచ్ పెన్ గాని జెల్ పెన్ గాని మరియు ఇంక్ పెన్ గాని వాడకూడదు. కేవలం బాల్ పాయింట్ పెన్నులు మాత్రమే వాడాలి. నల్ల రంగు బాల్ పాయింట్ పెన్ వాడడం ఉత్తమం. DDO లు సహితం జెల్ పెన్ తో సంతకాలు చేయకూడదు. ఖచ్చితంగా ఆకు పచ్చ బాల్ పాయింట్ పెన్ తో నే సంతకాలు చేయాలి.

8) ఏ కారణం చేత దీర్ఘకాలం సెలవులు పెట్టి డ్యూటీ లో జాయిన్ అయిన తరవాత లీవ్ మంజూరు చేసినప్పుడు నిల్వ ఉన్నoత వరకు ముందుగ EL తదుపరి HPL మిగిలినదానికి EOL మంజూరు చేస్తారు EOL పీరియడ్ ను తప్పనిసరిగా సర్వీస్ వెరిఫికేషన్ ఎంట్రీ వేయాలి.

9 ) రిజిష్టర్ రాయాల్సిన పని మరియు భాధ్యత పూర్తిగా DDO లదే. పని భారం అయినప్పుడు ఎవరి తో నైన రాయించవచ్చు కానీ DDO గారు భాధ్యత వహిస్తారు. కాబట్టి అంతా క్షుణ్ణంగా అధ్యయనం చేసి సంతకం చేయాలి .

10 ) భార్య భర్తల బదిలీల వాడుకున్నపుడు ఖచ్చితంగా ఆ వివరాలు రిజిష్టర్ లో నమోదు చేయాలి. గజిటెడ్ ఉద్యోగులకు ఐదు సంవ్సరాలకు ఒకసారి మిగతా వారికి ఎనిమిది సంవత్సరాలకు ఒకసారి వాడుకోవచ్చు.ఇరువురికి ఇచ్చే పాయింట్లు పది.

11 ) ఒక వేళ ఉద్యోగి సర్వీసు పుస్తకం పోయినట్లు అయితే DDO గారే పూర్తి భాధ్యత వహిస్తారు. కొత్తది ఓపెన్ చేయాలి అంటే పోలీస్ రిపోర్ట్ ఇవ్వవలసి ఉంటుంది. డూప్లికట్ బుక్ గాని Xerox సహాయం తో కొత్తది ఓపెన్ చేయవచ్చు.

12 ) ఒక ఆఫీస్ లో చాలా మంది ఉద్యోగులు ఉంటే, వారి యొక్క సర్వీసు పుస్తకాలు ను వారి ఇంక్రీ మెంట్ ల నెల ప్రకారం బీరువా లో పెట్టుకోవడం వల్ల పని సులభం అవుతుంది.

13 ) ఎప్పుడైనా ఉద్యోగికి సర్వీసు పుస్తకం ఇవ్వ వలసిన అవసరం ఏర్పడితే, ఉద్యోగి నుండి ఒక అర్జి పత్రం ( అప్లికేషన్ ఫారం ) తీసుకోవడం తప్పని సరి మరియు అతనికి ముట్టినట్టుగా డిక్లరేషన్ తీసుకోవాలి.

14 ) ఉద్యోగులు సర్వీస్ రిజిష్టర్ యందు క్లుప్త సంతకాలు కాకుండా పూర్తి సంతకాలు పెట్టాలి , ఒక వేళ పట్టక పోతే చిన్నగా రాయాలి .

15 ) అని వార్య కారణాల వల్ల ఏదైనా ప్రొసీడింగ్స్ లో తప్పులు జరిగినట్లు అయితే సర్వీస్ రిజిష్టర్ లో రాయబడిప్పుడు దానిని కొట్టివేయకూడదు. మళ్ళీ తప్పులు సరి చేస్తూ మరొక ప్రొసీడింగ్స్ తీయాలి.

16 ) ఉద్యోగులు తమ సర్వీస్ రిజిష్టర్ ను తాము స్వతహాగా రాసుకోపోవడం మంచిది. ఎవరైనా నియమాలు తెలిసిన వారితో గాని లేదా వారి సమక్షంలో రాసుకోవడం మంచిది. తప్పులు దొర్లకుండా ఉంటుంది.

17 ) ఉద్యోగులు తమ అర్హతలను హాల్ టికెట్ నంబర్ తో సహా సర్వీస్ రిజిష్టర్ లో నమోదు చేయించుకోవాలి.

18 ) బీరువాలో ఉన్న ఉద్యోగి సర్వీస్ రిజిష్టర్ ను సులభంగా గుర్తు పట్టుటకు బుక్ సైడ్ కు ఉద్యోగి పేరు ఎంప్లాయ్ ID రాయడం మంచిది .

19 ) ఉద్యోగి తన ఉద్యోగం లోకి చేరిన తర్వాత అనగా అర్హతల కు మించి చదివినచో ఆ అర్హత వివరాలను హాల్ టికెట్ నంబర్ తో సహా అన్ని రిజిష్టర్ లో నమోదు చేయాలి.

20 ) ప్రతి సంవత్సరం గ్రూప్ ఇన్సూరెన్స్ స్కీం లో ఎంత కట్ అయ్యింది ఎపుడు మినహాయింపు వివరాలను నమోదు చేయాలి.

21 ) భవిష్యత్లో ఒకసారి సర్వీసు రిజిస్టర్ లో నమోదు చేసిన పుట్టినతేది మార్చుటకు వీలులేదు. (G.O.Ms.No.165 F&P తేది:21-4-1984)

22 ) మొదటిసారి ఉద్యోగంలో నియమించబడు సందర్భంలో డాక్టరుచే జారీచేయబడిన Physical Fitness Certificate వివరాలు సర్వీసు రిజిస్టర్ లో నమోదుచేయాలి.(G.O.Ms.No.03 Fin తేది:08-01-1969)

23 ) ప్రతి ఉద్యోగి తన Home Town (LTC కొరకు) డిక్లేరేషన్ ఇవ్వాలి.అలాంటి వివరాలను కార్యాలయాధిపతి సర్వీసు రిజిస్టర్ లో నమోదుచేయాలి.
(APLTC Rule.No.8 of clause (b)(i)

24 ) ఉద్యోగి CCA Rules-1991 ప్రకారం ఏ విధమైన శిక్షలకు గురైన పక్షమున అట్టి పూర్తి వివరములను సర్వీసు రిజిస్టర్ లో నమోదుచేయాలి.
(Govt.Memo.No.51073 తేది:19-12-2002)

25 ) ఉద్యోగి గుణగణాలు, శీలము (character) గురించి సర్వీసు రిజిస్టర్ లో నమోదుచేయకూడదు.
26 ) ఉద్యోగికి సంబంధిoచిన అతని సర్వీసు రిజిస్టరు ప్రతి సం॥ పరిశీలించి నమోదుకాబడిన వివరాలు సరియైనవే అని ఉద్యోగి ధృవపరుచుకొనుటకు అతనికి కార్యాలయాధిపతి ఇవ్వాలి.
(G.O.Ms.No.152 Fin తేది:20-5-1969)

27 ) NGO అయిన ఉద్యోగి బదిలీ అయిన సందర్భంలో సంబంధిత ఉద్యోగి సర్వీసు రిజిస్టరు బదిలీ అయిన కార్యాలయ అధికారికి పొస్ట్ ద్వారా పంపించాలి.బదిలీ అయిన ఉద్యోగికి సర్వీసు రిజిస్టరు ఇచ్చి పంపకూడదు.
(G.O.Ms.No.722 తేది:30-07-1966)
(G.O.Ms.No.391 తేది:07-11-1978)

28 ) సర్వీసు రిజిస్టర్ లో విషయాలు పెన్సిల్ తో నమోదు చేయరాదు.
(Govt.Memo.No.72246 తేది:30-07-1966)

29 ) ఒక వేళ ఉంటే రివర్షన్ వివరాలు ( 2009 లో కొన్ని జిల్లాలలో ప్రమోషన్ ఇచ్చి తర్వాత పోస్ట్ లు లేనందున తిరిగి రివర్షన్ లు ఇచ్చారు ).

30 ) ఒక వేళ ఇంక్రిమెంట్ లు నిలుపుదల చేస్తే ఆ వివరాలు నమోదు చేయాలి.

31 ) చైల్డ్ కేర్ సెలవులను తీసుకున్నా ప్రతిసారీ నమోదు చేయాలి మరియు బ్యాలెన్స్ గా ఉన్న సెలవులు నమోదు చేయాలి.

32 ) దీర్ఘ కాలిక సెలవులు తేదీ లతో పాటు నమోదు చేయాలి.

33 ) ఉన్నత విద్య కోసం తీసుకున్న సెలవులు తేదీ లతో పాటు నమోదు చేయాలి. 

( SC, ST లకు కుటుంబంలో మొదటి తరం వారికి ఉన్నత విద్య కోసం రెండు సం॥ ల ఆన్ డ్యూటీ ఇస్తారు )

34 ) అడ్వాన్స్ డిటైల్స్ ( ఇంటి నిర్మాణం, కార్ లోన్, కంప్యూటర్, పెళ్లి కొరకు తీసుకొనే అడ్వాన్స్ వివరాలు, ఈ అడ్వాన్స్ లు కేవలం ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే మంజూరు చేయబడును )

35 ) రాష్ట్ర స్థాయి లో గాని లేదా జాతీయ స్థాయిలో గాని ప్రభుత్వం నుంచి ఏదైనా అవార్డ్ లు గాని, రివార్డ్ లు గాని ప్రశంసా పత్రాలు గాని, సేవా పథకాలు గాని మెడల్స్ గాని పొందినట్లు అయితే ఆ వివరాలు నమోదు చేయాలి.

**********

RECONSTRUCTION OF SERVICE REGISTER 
IN CASE OF LOST/THEFT/MISSED.

  *సర్వీసు రిజిష్టరు పోయిన/జాడ తెలియని సందర్భాలలో పునర్నిమాణం ఎలా చేయాలి?


సర్వీసు రిజిష్టరు ఉద్యోగికి ఆయువు పట్టులాంటిది. దానిలో నమోదు చేసిన విషయాల ఆధారంగానే ఉద్యోగి పదవీ విరమణ చేసిన తరువాత రావలసిన అన్ని రకాల ఆర్ధిక సౌలభ్యాలు పొందు అవకాశం ఉంది.

అట్టి అత్యంత ప్రాముఖ్యత కలిగిన సర్వీసు రిజిష్టరు ఏ కారణం  చేతనైనా పోయినా, కనిపించకపోయినా లేక అగ్ని ప్రమాదాల వల్ల కాలిపోయినా,అట్టి సర్వీసు రిజిష్టరు మరల ఎలా పునర్నిర్మాణం (Rebuilt or Reconstruction) అను విషయమై ప్రభుత్వం G.O.Ms.No.202 F&P తేది:11.06.1980 ద్వారా ఉత్తర్వులు జారీచేసింది.

ఉద్యోగి నిర్వహించుచున్న నకలు(Duplicate) సర్వీసు రిజిష్టరులో నమోదు చేయబడి అటెస్టు చేసిన విషయాలు ఎంతవరకు నిజం అను విషయాలు సంబంధిత రికార్డ్స్ తోనూ, పేబిల్స్, వేతన స్థిరీకరణ పత్రములు,GIS, GPF,APGLI,పదోన్నతికి సంబంధించిన సూచికలు, ఉద్యోగితో పాటు సహచర ఉద్యోగుల విషయంలో జారీచేసిన సామూహిక ఉత్తర్వులు, శాఖాధిపతి జారీచేసిన ఉత్తర్వులు తదితర అంశాలపై అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా సర్వీసు రిజిష్టరు పునర్నిర్మాణం చేయవచ్చు.

ఈ విషయంలో నకలు(Duplicate S.R) రిజిష్టరు చట్ట బద్ధమైనదిగా పరిగణించబడదు.

అదే విధంగా ఉద్యోగి తన సర్వీసు విషయాలను గురించి ప్రమాణ పూర్వకంగా సంతకం చేసి వ్రాసిచ్చిన వాంగ్మూలము (Affadavit as attested) పరిశీలించి,అట్టి విషయములను సమాంతర (Collateral) ఉద్యోగుల సాక్ష్యాదారాలు ఉన్న పక్షమున అంగీకరించి పునర్నిర్మాణం చేయుచున్న సర్వీసు రిజిష్టరు లో నమోదుచేయాలి G.O.Ms.No.224 F &P తేది:28.8.1982

పుట్టినతేది, ఉద్యోగ నియామకం, తదితర అంశాలకు సంబంధించిన ఉద్యోగి చెంతనున్న  వివరాల ఆధారంగా నమోదు చేయవచ్చు. అదే విధంగా కార్యాలయంలోనూ, పై అధికారుల కార్యాలయంలోనూ అందుకు సంబంధించిన కాపీల ఆధారంగా విషయాలు నమోదు చేయవచ్చు.

ఇంక్రిమెంటు రిజిష్టరు కార్యాలయంలో నిర్వహిస్తున్న యెడల,అట్టి రిజిష్టరు ఆధారంగా విషయాలు నమోదు చేయవచ్చు.*

పుట్టినతేది, విద్యార్హతలు, ఉద్యోగి ఇతరత్రా వివరాలు  విద్యాశాఖవారు జారీచేసిన సర్టిఫికెట్స్ ఆధారంగా సరిచూచి సర్వీసు రిజిష్టరులో నమోదు చేయవచ్చు. అదేవిధంగా ఉద్యోగం కోసం సర్వీసు కమీషను వారికి అభర్ధి పెట్టుకొన్న దరఖాస్తు ఆధారంగా కూడా సరిచూసుకోవచ్చును.

ఉద్యోగికి సంబంధించిన సర్వీసు వివరములు కొంతకాలం మేరకు తెలుసుకొనుటకు అవకాశం లేని పక్షమున,శాఖాధిపతి ఉద్యోగి అట్టి కాలములో సర్వీసులో ఉన్నాడని, సస్పెన్షన్ లో లేడని, అదే విధంగా Extra Ordinary Leave లో లేడని ఒక సర్టిఫికేట్ జారీచేయవచ్చు. కానీ అట్టి సర్టిఫికెట్ సాక్ష్యాధారములతో కూడిన వాటి మూలంశాల ఆధారితంగా ఉండవలెను.
*********