ఉద్యోగ , ఉపాధ్యాయ మిత్రులకు స్వాగతం సుస్వాగతం పి అర్ టి యు పినపాక మండల శాఖ ......

Teachers (Employees) Income Tax Software 2024- 25 Available now ........

Latest GO"s.



*సందేహాలు - సమాధానాలు* 

ప్రశ్న: డైస్ నాన్ అంటే ఏమిటి:? 

జవాబు: సర్వసాధారణంగా ఉద్యోగులు సంబంధిత అధికారి నుండిఎలాంటిపుర్వానుమతి లేకుండా లేక కనీసన్ సలవు దరఖాస్తుకుడా పెట్టకుండా విధులకు గైర్హాజరవుతు ఉంటారు.ఇలాంటిసందర్భాలలో ఉద్యోగి విధులకు గైర్హాజరైన కాలాన్ని ఫండమెంటల్రూల్ ప్రకారం డైస్ నాన్ గా పరిగణిస్తారు. 

♦అంటే పనిచేయలేదు కాబట్టి జీతంలేదు అని అర్ధం.ఇట్టి కాలాన్ని సర్వీసు బ్రెకుగా పరిగణించరు,కానిఅట్టి కాలాన్ని ఇంక్రిమెంటుకు గాని పెన్షనుకు గాని సెలవుకు గానిపరిగణలోకి తీసుకోరు.అంతేకాకుండా ఆ ఉద్యోగిపై సి.సి.ఎ రూల్స్ప్రకారం క్రమశిక్షణా చర్యలు తీసుకోబడతాయి. 

♦ఉద్యోగి ఒకసంవత్సరము మించి గిర్హాజరైన సర్వీసు నుండితొలగిస్తారు(G.O.Ms.No.11 Fin Dated:13-1-2004). 

♦అలాంటివక్తి తన ఉద్యోగానికి రాజీనామా చేసినట్లు పరిగణిస్తారు(Rule 5B&G.O.Ms.No128 Fin Dated:1-6-2007) 
♦విధులకుఅనుమతి లేకుండా గిర్హాజరైన ఉద్యోగి తిరిగి కొంతకాలం తరువాత్జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చిన సందర్భంలో అది తిరస్కరించటంసరికాదు.అతనిని వెంటనే విధులలో చేర్చుకోవాలి.తదుపరి తగినవిధంగా క్రమశిక్షణా చర్యలుతీసుకోవాల *(Memo.No.9101/4/8/FR-1 Fin Dated:25-12-1991).*. 

ప్రశ్న: CL వరుసగా ఎన్ని రోజులు పెట్టవచ్చు? 

జవాబు: ఆదివారం మరియు సెలవు దినాలతో కలిపి మొత్తం 10 రోజులకి మించకూడదు. 

ప్రశ్న: స్పెషల్ CL ఎన్ని రోజులు వరుసగా వాడుకోవచ్చు?

 జవాబు: ఆదివారం మరియు సెలవు దినాలతో కలిపి మొత్తం 7 రోజులకి మించకూడదు.

ప్రశ్న:మహిళా ఉద్యోగి గర్భసంచి తొలగింపు ఆపరేషన్ చేఇ0చుకొన్నచో ఆమెకు స్పెషల్ CL లు ఏమైనా ఇస్తారా? 

 జవాబు:జీఓ.52 ; తేదీ:1.4.2011 ప్రకారం మహిళా ఉద్యోగులకి సివిల్ సర్జన్ రికమండేషన్ పై 45 రోజులు ప్రత్యేక సెలవు ఇవ్వవచ్చు.

ప్రశ్న:CCL ఒకేసారి వాడుకోవచ్చా? 

 జవాబు:మెమో.13112 ; తేదీ: 1.3.58 ప్రకారం CCL లు ఒకేసారి 7 రోజులకి మించి నిల్వ ఉండకూడదు.1 ఇయర్ లో 10 రోజులకి మించి వాడుకోకూడదు.
 ప్రశ్న:లీవ్ నాట్ డ్యూ" ఎపుడు మంజూరు చేస్తారు? 

 జవాబు:1933 aplr రూల్స్ లోని రూల్ 18-సి ప్రకారం ఉద్యోగి ఖాతాలో ELs గానీ, హాఫ్ పే లీవ్ గానీ లేనప్పుడు ప్రభుత్వం ప్రత్యేక ఉత్తర్వులు ద్వారా వీటిని మంజూరు చేయవచ్చు. ఇలా మంజూరు చేసిన సెలవును భవిష్యత్ లో అతనికి వచ్చే సెలవు నుండి మినహాయిఇస్తారు.

ప్రశ్న:ఒక ఉద్యోగి డిస్మిస్ ఐతే అతను ఏమి కోల్పోతాడు? 

 జవాబు:రూల్ 24 ప్రకారం పెన్షన్ బెనిఫిట్ లురావు.ఐతే రూల్ 40 ప్రకారం అతను రిటైర్మెంట్ అయి ఉంటే వచ్చే పెన్షన్, గ్రాట్యుటీ లలో 2/3వ వంతు ప్రత్యేక పరిస్థితి లలో మంజూరు చేయవచ్చు. 

ప్రశ్న:నాకు 20 ఇయర్స్ సర్వీసు నిండినది. ఆగస్టు నెలలో వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకోవాలని అనుకొనుచున్నాను.నాకు కొత్త PRC ప్రకారం బెనిఫిట్స్ వస్తాయా?

పూర్తి పెన్షన్ వస్తుందా? 

జవాబు:పూర్తి పెన్షన్ రాదు.వాస్తవంగా 11వ PRC ,2018 జులై నుంచి అమల్లోకి రావాలి.ఐతే నోషనల్, మానిటరి బెనిఫిట్స్ ఎప్పటి నుంచి ఉంటాయో ఇప్పుడే చెప్పలేము. 

ప్రశ్న:మెడికల్ సెలవు కోసం డాక్టర్ సెర్టిఫికెట్ మరియు ఫిట్ నెస్ సెర్టిఫికెట్ ఒకే డాక్టర్ వద్ద తేవాలా? 

జవాబు:ఒకే డాక్టర్ వద్ద అవసరం లేదు. రెండూ వేర్వేరు డాక్టర్ల దగ్గర తేవచ్చు. 

ప్రశ్న:నా తలిదండ్రులకి వైట్ కార్డు ఉంది.పొరపాటున EHS లో నమోదు చేశాను. ఇపుడు తొలగించాలి అంటే నేను ఏమి చేయాలి? 

జవాబు:ehf పోర్టల్ లో ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.లేదా సంబంధిత ddo ను సంప్రదించాలి. 

ప్రశ్న:నేను పేరు మార్చుకోవాలని అనుకుంటున్నాను.ఐతే ఏమి చెయ్యాలి? 

జవాబు:జీఓ.102 తేదీ:24.4.1985 ప్రకారం 5రూ స్టాంపు పేపర్ మీద అఫిడవిట్ చేఇ0చి,DDO, తెలిసిన ఇద్దరితో సాక్షి సంతకాలు చేఇ0చాలి.స్థానిక వార్తా పత్రికలలో మరియు గెజిట్ లో ప్రచురణ చేఇ0చాలి. 

ప్రశ్న:నేను PF నుండి ఋణం పొందియున్నాను. వాయిదాలు పూర్తి కాలేదు.మరలా ఋణం కావాలి.ఇస్తారా? 

జవాబు:ZPPF నిబంధనలు 14 ప్రకారం మరల ఋణం పొందవచ్చు. మిగిలి ఉన్న బకాయి,కొత్త ఋణం మొత్తం కలిపి వాయిదాలు నిర్ణయిస్తారు. 

ప్రశ్న:ఒక డీజేబుల్డ్ ఉపాధ్యాయునికి వృత్తి పన్ను మినహాయించాలి అంటే ఎంత శాతం అంగవైకల్యం ఉండాలి? 

జవాబు:జీఓ.1063 తేదీ:2.8.2007 ప్రకారం 40% డీజేబుల్డ్ ఉంటే వృత్తి పన్ను మినహాయింపు వర్తిస్తుంది. 

ప్రశ్న:ఒక టీచర్ ఫిబ్రవరి 29న జాబ్ లో చేరాడు.అతనికి వార్షిక ఇంక్రిమెంట్ ఏ నెలలో ఇవ్వాలి? 

జవాబు:ఆర్.సి.2071 తేదీ:21.7.2010 ప్రకారం లీపు సంవత్సరం ఫిబ్రవరి 29న విధుల్లో చేరిన ఉపాధ్యాయుల వార్షిక ఇంక్రిమెంట్ ఫిబ్రవరి నెల లోనే ఇవ్వాలి. 

ప్రశ్న:బిడ్డ పుట్టి వెంటనే మరణించిన, వారికి మెటర్నిటీ లీవు కి అర్హత ఉందా? 
జవాబు:Lds.1941 తేదీ:11.6.90 ప్రకారం మరణించిన బిడ్డను ప్రసవించినా,ప్రసూతి సెలవు వాడుకోవచ్చు.

------------------------------------------------------------------------------------------

 *అనుమతి లేని గైర్హాజరు సమాచారం:*

- సలవు ఉద్యోగుల హక్కు కాదు.కానీ సర్వసాధారణంగా సంబంధిత అధికారి నుండి ఎలాంటి పూర్వానుమతి లేకుండా విధులకు గైర్హాజరు అవుతూ ఉంటారు.అలాంటి ఉపాధ్యాయులు రాష్ట్రవ్యాప్తంగా 106 మంది ఉన్నారని వారిపై చర్యలు తీసుకోవాలని పాఠశాల విద్యాశాఖ సంచాలకులు 27.9.2019 న ఆర్.సి.నెం.2000/Ser.IV/2019 ద్వారా జిల్లా విద్యాశాఖ అధికారులను 
ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఈ అంశంపై వివరణ.
- అనుమతి లేకుండా
ఉద్యోగి విధులకు గైర్హాజరు అయిన కాలాన్ని ఫండమెంటల్ రూల్-18 ప్రకారం *డైస్ నాన్* గా పరిగణిస్తారు.
- ఏ ఉద్యోగికి వరుసగా ప్రభుత్వ అనుమతి లేకుండా 5 సంవత్సరాలకు మించి ఏ రకమైన సెలవు మంజూరు చేయకూడదు.
*FR-18 and Rule 5A of AP Leave Rules-1933*

-కనీ తదుపరి 1 సంవత్సరమునకు మించి గైర్హాజరు అయినా ఉద్యోగిని సర్వీసు నుంచి తొలగించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
*G.O.Ms.No.11 Fin Dated: 13.1.2004 Read with G.O.Ms.No.260 GAD Dated:4.9.2003*

- 1 సంవత్సరం మించి విధులకు గైర్హాజరైన ఉద్యోగి తన పదవికి రాజీనామా చేసినట్లు పరిగణించాలని ఫండమెంటల్ రూల్-18 కు  సవరణ ఉత్తర్వులు. *G.O.Ms.No.128 F&P Dt: 1.6.2007* జారీ చేసింది.
- ఉద్యోగిపై చర్యలు తీసుకునే ముందు ఆ ఉద్యోగి తన వాదనను వినిపించు కొనుటకు తగిన అవకాశం ఇవ్వవలెను.
*Rule 5B of A.P Leave Rules-1933* మరియు *G.O.Ms.No.129 F&P Dt: 1.6.2007*
- వధులకు గైర్హాజరైన ఉద్యోగి ఏ పరిస్థితుల్లోనైనా తన పదవికి రాజీనామా చేసిన ఎడల A.P.State Subordinate Service Rules-1996 లోని రూలు-39 ప్రకారం ఆమోదించవచ్చు.
- వధులకు గైర్హాజరైన ఉద్యోగి ఏ కారణం చేతనైనా ఏ.పి రివైజ్డ్ పెన్షన్ రూల్స్-1980 లోని రూలు 43 మరియు 44 మేరకు స్వచ్ఛంద పదవి విరమణ చేయదలచుకున్న నిబంధనల మేరకు అనుమతించ వచ్చును. అలాంటి సందర్భాలలో కూడా శాఖాపరమైన చర్యలు తీసుకొనవచ్చును.
*Govt.Cir.Memo.No.9101-4/8/FRI/91 Dt: 25.12.1991*
- వధులకు అనుమతి లేకుండా గైర్హాజర్ అయినా ఉద్యోగి కొంతకాలం తర్వాత జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చిన సందర్భంలో తిరస్కరించటం సరికాదు. అతనిని వెంటనే విధులలో చేర్చుకొని తదుపరి తగిన విధంగా క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి.
*Govt.Cir.Memo.No.9101-4/8/FRI/91 Dt: 25.12.1991*
-------------------------------------------------------------------------------------------
*ఎన్ని సంవత్సరాల సర్వీస్ ఉంటే ఫుల్ పెన్షన్ కు ఎలిజిబిలిటీ ఉంటుంది?*
*ఏయే బెనిఫిట్స్ వర్తిస్తాయి?*
*జవాబు*
20 సంవత్సరాల సర్వీసు నిండిన ఉద్యోగి యొక్క కోరిక ప్రకారం రిటైర్ అగుటకు అనుమతించబడును.
( *G.O (P) No. 88, Finance and Planning (Finance Wing) P.N.C. Dept, Date: 26-01-1980* ) *రూల్ : 42,43*
*పెన్షన్ కమ్యూటేషన్:*                 
*వాలెంటరీ రిటైర్మెంటు పొందిన ఉపాధ్యాయుడు తన పెన్షన్ లో 40% అమ్ముకోవచ్చును.* దీనినే *పెన్షన్ కమ్యూటేషన్* అంటారు.
( *G.O.m.s.No: 158, Finance and Planning ; Date: 16-09-1999*)
గమనిక:- *రిటైరైన సంవత్సరంలోగా సంబంధిత అధికారిగారికి దరఖాస్తు చేసుకోవాలి.* సంవత్సరం దాటితే *మెడికల్ టెస్టులు, అనేక వివరాలతో జాప్యం జరుగుతోంది

*పెన్షన్*
*పదవీ విరమణ చేయునాటికి 10 సంవత్సరములు అంతకంటే ఎక్కువ సర్వీసు చేసిన వారికి పెన్షన్ ఇస్తారు.*
*పెన్షన్ లెక్కించు విధానము*:-
*చివరి నెల వేతనం× అర్థ సం„యూనిట్లు × 1/2 × 1/66 సూత్రం ప్రకారం లెక్కిస్తారు*
20 సంవత్సరాలకు వాలెంటరీ రిటైర్మెంటు కోరితే 5సంవత్సరాల వెయిటేజిని కలిపి సర్వీస్ కాలమునకు కలిపి పెన్షన్ నిర్ణయిస్తారు.

  *కుటుంబ పెన్షన్ వివరాలు*
*రిటైర్మెంట్ గ్రాట్యుటీ*
మినిమం క్వాలిఫైయింగ్ సర్వీస్:
5 ఇయర్స్ ఫైనాన్షియల్ బెనిఫిట్: క్వాలిఫైయింగ్ సర్వీస్ పొడవు ఆధారంగా. సుమారు మొత్తం Rs.12.00 లక్షల .
*డెత్ గ్రాట్యుటీ*
0-1 సంవత్సరాలు సేవ: 6 టైమ్స్/ 4 (చెల్లింపు రోజు)
1-5 సంవత్సరాల సేవ: 18 సార్లు / 4 (పే,డీఏ )
5-18 సంవత్సరాల సర్వీస్: 36 సార్లు 4 (పే-డే) > 18 సంవత్సరాల సేవ: 38
/4 (చెల్లించాల్సిన రోజు)
మాక్సిమం మొత్తం: Rs.12.00 లక్షల. కుటుంబ పింఛను ఉద్యోగి / పెన్షనర్ యొక్క కుటుంబ సభ్యులకు ఇవ్వబడుతుంది.
*పెన్షన్ రకాలు*
1. *పెంపొందించిన కుటుంబ పెన్షన్* :-
*మిని క్వాలిఫైయింగ్ సర్వీస్:*
ఏడు సంవత్సరాలు కంటే ఎక్కువ ఏడు సంవత్సరాల కాలానికి 50% చివరి చెల్లింపు మరియు ఏడు సంవత్సరాలు లేదా 65 సంవత్సరాలుగా చెల్లింపులు.
2.  *కుటుంబ పెన్షన్* : -
  *మిని క్వాలిఫైయింగ్ సర్వీస్:*
 ఒక సంవత్సరం నుండి 7 సంవత్సరాల. పెంచిన కుటుంబ పెన్షన్ ముగిసిన తరువాత, కుటుంబ పింఛను ఇవ్వబడుతుంది. మొత్తం చెల్లింపు మరియు అనుమతుల యొక్క 30%
3.  *అదనపు సాధారణ కుటుంబ పెన్షన్*:-
 అతని / ఆమె విధులను నిర్వర్తిస్తున్నప్పుడు మరణించిన ఉద్యోగుల కుటుంబ సభ్యులకు అతని పింఛను ఇవ్వబడుతుంది,      
*FAMILY PENSION*
 సర్వీస్ లో ఉండి గానీ, రిటైర్ ఐన తరువాత గానీ ఉద్యోగి మరణించిన ,అతని భార్య కు ఇచ్చే పెన్షన్ ను ఫ్యామిలీ పెన్షన్ అంటారు .
 7ఇయర్స్ సర్వీస్ లోపు చనిపోతే, భార్యకు పే లో 30% ఫ్యామిలీ పెన్షన్ గా ఇస్తారు.
 7ఇయర్స్ సర్వీస్ పైన చేసి రిటైర్మెంట్ లోపు చనిపోతే రెండు రకాలుగా భార్యకు ఫ్యామిలీ పెన్షన్ చెల్లిస్తారు...టీపీటీఫ్
a) మొదటి 7 ఇయర్స్ కి 50%
b) 7 ఇయర్స్ తరువాత నుండి 30%.
EXample* 1:

ఓక ఉద్యోగి సర్వీస్ లో ఉండగా మరణించెను.అప్పటికి అయన సర్వీస్ 3y 6m. అపుడు ఆతని పే 7740 ఐన, భార్య కు వచ్చే ఫ్యామిలీ పెన్షన్
 ➡️ 7740×30/100 =2322.00
ఇది భార్య కు జీవితాంతం ఇస్తారు.
 Example* 2:
 ఉద్యోగి మరణించే నాటికి చేసిన సర్వీస్ 8y 4m. అపుడు పే 11530.ఐన, అతని భార్య కు మొదటి 7ఇయర్స్ వచ్చే ఫ్యామిలీ పెన్షన్
 11530×50/100=5765.00.
 7 ఇయర్స్ తరువాత నుండి జీవితాంతం వచ్చే ఫ్యామిలీ పెన్షన్👉11530×30/100 = 3459.00
CPS ఖాతాదారుడు తన ఖాతా నుండి డబ్బు ను తిరిగి పొందు విధానం (ఉపసంహరణ విధానం)టీపీటీఫ్
రాష్ట్ర ప్రభుత్వం జి.ఓ.ఎస్.నెం-62 . తేది=07/03/2014 ఉత్తర్వుల ద్వారా ఖాతా దారుడు
1.స్వచ్ఛంద పదవి విరమణ.
2.పదవీ విరమణ
3.ఆకాలమరణం
ఈ మూడు సందర్భాలలో CPS ఖాతా నుండి డబ్బును తిరిగిపొందగలరు.
*1.స్వచ్ఛంద పదవీవిరమణ* 
ఉద్యోగి స్వచ్ఛంద పదవీ విరమణ పొందినప్పుడు తన ఖాతాలో ఉన్న మొత్తము నుండి 80 % ను నెలవారి పెన్షన్గా ఇవ్వడానికి A.S.Pలో ఎంచుకున్న రకానికి చెందిన పెన్షన్ అందజేస్తారు. 20%నిధి ని చెల్లిస్తారు.టిపీటీఫ్ 
*సూచన* 
మొత్తం నిధి 1 లక్ష లోపు ఉంటే ఆ మొత్తాన్ని చెల్లిస్తారు.
దీనికోసం FORM 102-GP ను పూర్తిచేసి సంభాదిత నోడల్ ఏజెన్సీ కి (treasurer)కి పంపవలెను.
*2.సాధారణ పదవీ విరమణ* 
ఉద్యోగి పదవీ విరమణ పొందినప్పుడు తన ఖాతాలో ఉన్న మొత్తములో నుండి 40%ను నేలవారి పెన్షన్ గా ఇవ్వడానికి  A.S.P లో ఎంచుకున్న రకానికి పెన్షన్ అందజేస్తారు.60% నిధిని చెల్లిస్తారు.
 టిపీటీఫ్....
*సూచన*
మొత్తం నిధి  2లక్ష లలోపు ఉంటే ఆ మొత్తాన్ని చెల్లిస్తారు.
దీనికోసం FORM 101-GS ను పూర్తిచేసి సంభాదిత నోడల్ ఏజెన్సీ కి (treasurer)కి పంపవలెను
*3.ఆకాలమరణం పొందిన సందర్భంలో*
ఉద్యోగి ఖాతాలో ఉన్న మొత్తం(100%) నిధిని నామినీ కి చెల్లిస్తారు.

దీనికోసం FORM 103-GD ను పూర్తిచేసి సంభాదిత నోడల్ ఏజెన్సీ కి (treasurer)కి పంపవలెను
---------------------------------------------------------------------------‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‎ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‎ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‎ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‎ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‎ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‏ ‎ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‎ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‎ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‎ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‎ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‎ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‎ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‎ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‎ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‏ ‎
 *చైల్డ్ కేర్ లీవ్ సందేహాలు-సమాధానాలు:*
-సందేహము: 
చైల్డ్ కేర్ లివ్ ఒక స్పెల్ కు మాగ్జిమం ఎన్ని రోజులు  పెట్టుకోవచ్చు. 1,2 రోజులు కూడా పెట్టుకోవచ్చునా ?
-సమాధానము:
G.O.Ms.No.209 Fin తేది:21.11.2016 ప్రకారంవివాహిత మహిళా ఉపాధ్యాయులు ప్రతి స్పెల్ కు మాగ్జిమం 15 రోజుల చొప్పున 6 స్పెల్ లకు తగ్గకుండా 90 రోజులు వాడుకోవచ్చును.జీవోలో 6 స్పెల్ లకు తగ్గకుండా అన్నారు కాబట్టి
1,2 రోజులు కూడా వాడుకొనవచ్చును.
-సందేహము:
చైల్డ్ కేర్ లివ్ ముందుగానే మంజూరు చేయించుకోవాలా? సెలవు కాలంలో పూర్తి జీతం చెల్లిస్తారా ?
-సమాధానము:
చైల్డ్ కేర్ లివ్ ను DDO తో ముందుగానే మంజూరు చేయించుకుని, ప్రొసీడింగ్స్ ద్వారా వివరాలను సర్వీసు పుస్తకములో నమోదు చేయించుకోవాలి.ఆ నెల వేతనాన్ని యధావిధిగా మంజూరు చేయాలసీన బాధ్యత DDO దే.
-సందేహము:
చైల్డ్ కేర్ లివ్ పెట్టిన సెలలో ఇంక్రిమెంట్ ఉన్నట్లయితే మంజూరు చేయవచ్చునా ?
-సమాధానము:
వీలుపడదు. సెలవు కాలంలో వేతన వృద్ధి ఉండదు.కావున సెలవు అనంతరం విధులలో చేరిన నాటినుండే ఇంక్రిమెంట్ మంజూరుచేస్తారు.
- సందేహము:
మెటర్నిటి లీవుకు కొనసాగింపుగా చైల్డ్ కేర్ లీవు పెటుకోవచ్చునా ?
-సమాధానము:
చైల్డ్ కేర్ లీవును అన్ని విధాలుగా  Other than casual,spl. casual leave తో కలిపి పెట్టుకోవచ్చునని జీవో.209 లోని రూలు 3(i) సూచిస్తోంది
-సందేహము:
సర్రోగసి,దత్తత ద్వారా సంతానం పొందిన .మహిళా ఉద్యోగులు చైల్డ్ కేర్ లివ్ కు అర్హులేనా ?
-సమాధానము:
అర్హులే,90 రోజుల సెలవు వాడుకొనవచ్చును.
-సందేహము: 
భార్య మరణించిన పురుష ఉద్యోగికి చైల్డ్ కేర్ లివ్ మంజూరు చేయవచ్చునా ?
-సమాధానము:
వీలు లేదు. ఇందుకు సంబంధించిన GO.209 లో *Women Employees* అని ఉన్నది.
- సందేహము:
చైల్డ్ కేర్ లీవ్ కు అప్లై చేసిన ప్రతిసారి పుట్టినతేది వివరాలు సమర్పించాలా?
-సమాధానము:
అవసరం లేదు. మొదటి సారి అప్లై చేసేటపుడు మాత్రమే కుమారుడు/కుమార్తె డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ సమర్పించాలి. ప్రతి దఫా అప్లికేషన్ సమర్పిస్తే సరిపోతుంది.
-సందేహము:
పిల్లల అనారోగ్యం,చదువుల కొరకు మాత్రమే చైల్డ్ కేర్ లీవ్ మంజూరుచేస్తారా ?
-సమాధానము:
GO.209 point.3 లో  ఇలా ఉన్నది "Children needs like examinations,sickness etc", అని ఉన్నది కావున పై రెండు కారణాలకే కాకుండా ఇతరత్రా కారణాలకు కూడా చైల్డ్ కేర్ లీవు మంజూరు చేయవచ్చును.
-సందేహము:
చైల్డ్ కేర్ లీవ్ కు ప్రిఫిక్స్,సఫిక్స్  వర్తిస్తాయా ?
-సమాధానము:
వర్తిస్తాయి,ప్రభుత్వ సెలవు దినాలతో ఇట్టి సెలవును అనుసంధానం చేసుకోవచ్చును.
---------------------------------------------------------------------------------------------

 *అర్ధవేతన సెలవును నగదుగా మార్చుకోవడం:*
- పదవీ విరమణ చేసిన చేసిన ఉద్యోగులకు తన ఖాతాలో నిల్వయున్న అర్ధవేతన సెలవును నగదుగా మార్చుకోను అవకాశాన్ని రాష్ట్రప్రభుత్వం G.O.Ms.No109 ఆర్ధిక తేది:29.7.2015 ద్వారా కల్పించింది.
- అర్ధవేతన సెలవు నగదును పొందడానికి సూత్రం = పదవీ విరమణ తేదికి అర్ధవేతనం + అర్ధవేతనం పై ఆ రోజుకు చెల్లిస్తున్న డి.ఏ/30 x అర్ధవేతన సెలవులు
-300 రోజుల పరిమితికి లోబడి  లెక్కిస్తారు.
- ఆర్జిత సెలవుకు పూర్తి బేసిక్ పే,డి.ఏ,హెచ్.ఆర్.ఏ చెల్లించబడును.
 -ఎయిడెడ్ సిబ్బందికి అర్ధవేతన సెలవును నగదుగా మార్చుకునే అవకాశాన్ని ప్రభుత్వం ఆర్.సి.నెం.22/బి2-2/2011 తేది:26.3.2013 కల్పించింది.
-ఉదాహరణ: ఒక ఉద్యోగి 37,100  వేతనంతో సెప్టెంబర్ 2013 న పదవీ విరమణ చెందేనాటికి అతని ఖాతాలో 120 ఆర్జిత సెలవులు,290 అర్ధవేతన సెలవులు ఉన్నాయనుకుంటే,300 రోజుల గరిష్ట పరిమితికి లోబడి 120 రోజుల ఆర్జిత సెలవులు పోగా,180 రోజుల అర్ధవేతన సెలవుల జీతం నగదుగా లభిస్తుంది.
- డి.ఏ శాతం 54.784
-అర్ధవేతన సెలవుల జీతం నగదు  = 18550+10565/30x180 = 
Rs.1,74,690---
----------------------------------------------------------------------------------------

 *సస్పెన్షన్లు-జీవనాధార భత్యము:* (Subsistance Allowance)
- జవనాధారభత్యము అంటే జీత భత్యములు పొందకుండా సస్పెన్షనులో ఉన్న ఉద్యోగి నెలవారి చెల్లించే భత్యము.
- సస్పెన్షను అనునది ఉద్యోగికి విధించిన శిక్ష కాదు.సస్పెన్షను కాలములో ఉద్యోగి జీవనాధారంగా ఉన్న ఉద్యోగం ద్వారా జీతభత్యాలు పొందు అర్హత ఉండదు కాబట్టి అట్టి ఉద్యోగికి జీవనాధారంగా భత్యములు చెల్లించు అవకాశం ఫండమెంటల్ రూల్ 53 లోని నియమ నిబంధనలకు లోబడి చెల్లించే విధానాలు ప్రభుత్వం కల్పించింది.

 *జీవనాధార భత్యం ఎలా లెక్కించాలి:*
- మదటి మూడు నెలలకు,ఉద్యోగి అర్ధజీతపు సెలవులో వెళ్ళియుంటే పొందునటువంటి సెలవు జీతమునకు సమానంగా వచ్చు మొత్తాన్ని చెల్లిస్తారు-ఎఫ్.ఆర్.53(1)(ii)(a)
- మూడు నెలల తర్వాత కూడా సస్పెన్షన్ కొనసాగిన,అట్టి కొనసాగింపునకు ఉద్యోగి ఏ విధంగాను బాధ్యుడు కానప్పుడు మొదటి మూడు నెలలకు చెల్లించిన దానిపై 50 శాతం అధికం చేయవచ్చు.ఒకవేళ సస్పెన్షన్ కొనసాగింపునకు ఉద్యోగి బాధ్యుడైన పక్షంలో మొదటి మూడు నెలలకు చెల్లించిన దానిపై 50 శాతం తగ్గించవచ్చు.చదవండి.
-  ఏ అధికారి అయితే ఉద్యోగిని సస్పెండు చేసాడో అట్టి అధికారి రివ్యూ చేసి నిర్ణయం తీసుకోవచ్చు.
- సస్పెండు ఆయిన ఉద్యోగి తాను సస్పెండు అయిన తరువాత ఏ విధమైన ఉద్యోగం గాని/వృత్తి గాని/ఇతరత్రా వ్యాపకం గాని చేయటం లేదని ధ్రువీకరణ పత్రం అధికారికి అందజేయాలి.
- సస్పెండయిన ఉద్యోగి అట్టి ధ్రువీకరణ పత్రము ఇవ్వని పక్షంలో జీవనాధారభత్యములు నిలుపుదల చేయవచ్చు-ఎఫ్.ఆర్.53(2)
- జవనాధారభత్యము సస్పెండు ఆయిన ఉద్యోగి తిరస్కరించారాదు. జీవనాధార భత్యము చెల్లింపులు తిరస్కరించడం శిక్షించదగ్గ నేరము.
Govt. Memo.No.29730/A/458/SE/FR-II/96-F తేది:14.10.1996,STUTS
- సస్పెండు కాకముందు తేది నాటికి ఉద్యోగి పొందుచున్న మూలవేతనంలో సగం మొత్తం.
- అట్టి సగం మూలవేతనం పై వచ్చు దామాషా కరువు భత్యం.
- సస్పెండు కాకముందు తేది నాటికి  పొందుచున్న మూలవేతనంపై పూర్తి ఇంటి అద్దె మరియు సిటీ కాంపెంసెటరీ అలవెన్సులు పరిమిత కాలానికి అనుగుణంగా పూర్తిగా చెల్లిస్తారు.
- జవనాధార భృతి పెంచిన సందర్భాలలో వెనుకటి తేది నుండి పెంచుటకు ఉత్తర్వులు ఇవ్వకూడదు.
- ఉద్యోగి సస్పెన్షనులో ఉన్న కాలానికంతటికి రివ్యూలతో సంబంధం లేకుండా జీవన భృతి చెల్లించాలి.
                                                    Next Page   Page No 2