ఉద్యోగ , ఉపాధ్యాయ మిత్రులకు స్వాగతం సుస్వాగతం పి అర్ టి యు పినపాక మండల శాఖ ......

E-TDS Filing Q4 (Jan-Feb-March) FY 2023-24 Due Date is 31st May 2024.......

సెలవులు - నియమ నిబంధనలు (Casual Leaves, Special Casual Leaves & Disability Leaves)

సాధారణ సెలవు - నియమ నిబంధనలు
(CASUAL LEAVE RULES)
 సెలవు ప్రత్యేక పరిస్థితులలో తక్కువ కాలం డ్యూటీకి గైర్హాజరు అయిన సందర్భంలో వాడుటకు ఉద్దేశించబడింది .ప్రాథమిక నియమావళి లోని రూలు 25 రూలింగ్ 04 అనుబంధం VII లో సాధారణ సెలవు నియమాలు ప్రత్యేకంగా పొందుపర్చారు.ప్రతి క్యాలెండర్ సంకి 15 చొప్పున మంజూరు చేయబడతాయి.(G.O.Ms.No.52 Dt:04-02-1981)
సాధారణ సెలవులు,ఆప్షనల్ సెలవులు,ఆదివాములు ఇతర అనుమతించిన సెలవులతో ముందు,వెనుకా జతపరుచుకోవచ్చును.కాని మొత్తం కలిపి 10 రోజులకు మించకూడదు.
(G.O.Ms.No.2465 Fin Dt: 23-12-1959
(G.O.Ms.No.2094 Fin Dt: 22-04-1960)
ఒక క్యాలెండర్ సం లో ఆప్షనల్ హాలిడేస్ ను,3 లోకల్ హాలిడేస్ ను వినియోగించుకోవచ్చును.లోకల్ హాలిడేస్ అకాడమిక్ సం॥ వాడుకోవాలి.(G.O.Ms.No.1205 Edn Dt:23-10-1981)
సెలవు నియమావళి ప్రకారం అర్ధజీతసంపాదితజీతనష్టపు సెలవుతో గాని,జాయినింగ్ కాలంతో గాని,వెకేషన్ తో గాని సాధారణ సెలవును జతపరుచుటకు వీలులేదు.
సెలవు అనేది హక్కుగా పరిగణించరాదు.ప్రజా ప్రయోజనాల దృష్ట్యా మంజూరుచేసే అధికారికి  రకమైన సెలవునైనా సహేతుక కారణాలతో నిరాకరించుటకు లేదా మధ్యలోనే రద్దుచేయుటకు విచక్షణాధికారం ఉంటుందిFR 67  అర్ధ రోజునకు కూడా సాధారణ సెలవు మంజూరు చేయవచ్చును
అయితే ఒంటిపూట బడుల విషయంలో వీలుపడదు.(G.O.Ms.No.112 Fin Dt:03-06-1966)
విధినిర్వాహణ ద్వారా మాత్రమే సెలవు సంపాదించబడుతుంది FR-60
సెలవు లేకుండా డ్యూటీకి గైర్హాజరు కారాదునిబంధనల ప్రకారం సెలవు గాని,పర్మిషన్ గాని ముందస్తు అనుమతితోనే వినియోగించుకోవాలి.ఎట్టి దరఖాస్తు పంపనపుడు ప్రధానోపాధ్యాయుడు గర్హాజరును హాజరు పట్టికలో నమోదు చేయవచ్చును-A.P.E.R Rule-155
ప్రత్యేక ఆకస్మిక సెలవులు
Special Casual Leaves
(ఫండమెంటల్ రూలు-85 రూలింగ్ లోని అనుబంధం-VII ఐటమ్ 11 లో విశదీకరించారు.)
@  ఉద్యోగి వ్యక్తిగత ప్రయోజనాలతో సంబంధలేకుండా ప్రత్యేక ఆకస్మిక సెలవు మంజూరుచేయవచ్చు.
@   ప్రత్యేక ఆకస్మిక సెలవు సాధారణ,యాదృచ్చిక సెలవు 15 రోజులకు అదనంగా మంజూరుచేయవచ్చు. 
@  క్యాలెండర్ సంలో రోజులకు మించకుండా ప్రత్యేక సాధారణ సెలవు వాడుకోవచ్చు.
    (G.O.Ms.No.47,Fin తేది:19-02-1965)
@  సాధారణ సెలవు నిల్వయున్నపటికి Spl.CL వాడుకోవచ్చు.Spl.CL ఇతర సాధారణ సెలవుదినాలతో కలిపి 10 రోజులకు మించకుండా వాడుకోవాలి.
@  రక్తదానం చేసిన ఉద్యోగికి ఒకరోజు Spl.CL ఇవ్వబడుతుంది.
    (G.O.Ms.No.137 M&H తేది:23-2-1984)
పురుష ఉద్యోగులు వేసక్టమి ఆపరేషన్ చేయించుకున్న సందర్భంలో వారికి ఆరు రోజులకు (6) మించకుండా ఆకస్మిక సెలవు మంజూరుచేస్తారు.ఒకవేళ అట్టి ఆపరేషన్  కారణంచేతనైన ఫలించనియెడల మెడికల్ అధికారి సర్టిఫికెట్ ఆధారంగా మరల ఆరు(6) రోజులు మంజూరుచేయవచ్చు.
        (G.O.Ms.No.1415 M&H తేది:10-06-1968)
        (G.O.Ms.No.257 F&P తేది:05-01-1981)

మహిళా ఉద్యోగులు ట్యూబెక్టమి  ఆపరేషన్ చేయించుకున్న సందర్భంలో వారికి పధ్నాలుగు రోజులకు (14)మించకుండా ఆకస్మిక సెలవు మంజూరుచేస్తారు.
ఒకవేళ అట్టి ఆపరేషన్  కారణంచేతనైన ఫలించనియెడల మెడికల్ అధికారి సర్టిఫికెట్ ఆధారంగా మరల పద్నాలుగు(14) రోజులు మంజూరుచేయవచ్చు.
    (G.O.Ms.No.1415 M&H తేది:10-06-1968)
    (G.O.Ms.No.124 F&P తేది:13-04-1982)

కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స భార్య చేయించుకున్నచో ఆమెకు సహాయం చేయుటకు ఉద్యోగి అయిన భర్తకు ఏడు(7) రోజుల ప్రత్యేక ఆకస్మిక సెలవు మంజూరుచేస్తారు.
    (G.O.Ms.No.802 M&H తేది:21-04-1972)
మహిళా ఉపాధ్యాయులు గర్భనిరోధక సాధనం(LOOP) అమర్చుకున్నరోజు ఒక(1) రోజు ప్రత్యేక ఆకస్మిక సెలవు మంజూరుచేస్తారు. (G.O.Ms.No.128 F&P తేది:13-04-1982)
ఇద్దరికంటే తక్కువ పిల్లలున్నప్పుడు,ఆపరేషన్ తరువాత మగ,ఆడ పిల్లలందరూ చనిపోయినపుడు రీకానలైజేషన్ చేయించుకునే మహిళా ఉద్యోగికి 21 రోజులు లేదా అవసరమైన రోజులు ఏది తక్కువైతే ఆమేరకు మంజూరుచేస్తారు. (G.O.Ms.No.102 M&H తేది:19-02-1981)
మహిళా ఉద్యోగి హిస్టరెక్టమి ఆపరేషన్(గర్భసంచి తొలగింపుశస్త్రచికిత్స చేయించుకున్న సందర్భంలో సివిల్ అసిస్టెంట్ సర్జన్ సిఫారసుమేరకు 45 రోజుల ప్రత్యేక ఆకస్మిక సెలవు మంజూరుచేస్తారు. (G.O.Ms.No.52 F&P తేది:01-04-2011)
మహిళా ఉద్యోగులు గర్భవిచ్చితి(Medical Termination of Pragnancy) తర్వాత Salpingectomy(గర్భాశయనాళతొలగింపుఆపరేషన్ చేయించుకున్నచో సందర్భంలో పద్నాలుగు(14) రోజులకు మించకుండా ప్రత్యేక ఆకస్మిక సెలవు పొందవచ్చు.
    (G.O.Ms.No.275 F&P తేది:15-05-1981)
చట్టబద్దంగా గాని,అప్రయత్నంగా గాని గర్భస్రావం(Abortion) జరిగినచో వారాల సెలవు మంజూరుచేయబడును.(G.O.Ms.No.762 M&H తేది:11-08-1976)
పురుష ఉద్యోగులకు భార్య ప్రసవించినపుడు 15 రోజుల పితృత్వ సెలవు మంజూరుచేస్తారు.
    (G.O.Ms.No.231 తేది:16-09-2005)
ప్రభుత్వ గుర్తింపు కలిగి సివిల్ సర్వీసెస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో సభ్యత్వం గల ఉద్యోగ,ఉపాధ్యాయ సంఘాలకు చెందిన జిల్లా ప్రధాన బాధ్యులకు సంఘ కార్యకలాపములకు  హాజరగు నిమిత్తం అదనంగా 21 రోజుల స్పెషల్ క్యాజువల్ సెలవుమంజూరు సదుపాయం కలదు.
    (G.O.Ms.No.470 GAD తేది:16-09-1994)
    (G.O.Ms.No.1036 GAD తేది:29-11-1995).
చైల్డ్ కేర్ లీవ్ప్రభుత్వం చైల్డ్ కేర్ లీవ్ కింద 2016లో జీఓ నెంబర్ 209 ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులకు 90 రోజులు సెలవులు మంజూరుచేస్తుంది.
రీకానలైజేషన్ సెలవులు1981లో జీఓ నెంబర్ 102 ప్రకారం రీకానలైజేషన్ కింద 21 రోజుల సెలవులు మంజూరు చేస్తారు.

DISABILITY LEAVE 
  • ఎవరైనా ఉద్యోగి ఎన్నికల విధులు నిర్వహించుట కొరకు బయలుదేరేటపుడు మధ్యలో ఎక్కడైనా ఆక్సిడెంట్ జరిగి గాయలై హాస్పిటల్ లో చేరితే  ఉద్యోగి ఎటువంటి సెలవులు పొందవచ్చు?
  • ప్రభుత్వ ఉద్యోగులు / ఉపాధ్యాయులు తాను ఉద్యోగ బాధ్యత నిర్వహణలో ఉన్న సమయంలో గానిలేదా ఎన్నికల విధులు నిర్వర్తించుచున్న సమయంలో గానికార్యాలయం పనికై తమ కార్యాలయం నుండి లేదా  కోర్టు కేసు విషయంలో వెళ్లుచున్నపుడు గానిఏదైనా రోడ్ ఆక్సిడెంట్ కు గురయినపుడు వైద్యుల సిపారసు మేరకు మూడు నెలల వరకు స్పెషల్ డీసెబిలిటీ లీవ్ మంజూరి చేయవచ్చునురెండు నెలల వరకు అయితే గవర్నమెంట్ మెడికల్ అధికారి నుండి తెచ్చిన ధ్రువీకరణ సరిపోవును.

  • ఒకవేళ మొదటిసారి చికిత్స తరువాత అంగవైకల్యం తిరిగి పునరావృతము అయి డీసెబిలిటీ ఏర్పడితే తిరిగి  సెలవు పొందవచ్చు డెసెబిలిటీ లీవ్ కు నెలలకు మించినదయితే సివిల్ సర్జెన్ గారు వైద్య ధ్రువపత్రము జారీ చేస్తారు కానీ మొత్తం  సెలవు 24 నెలలకు మించరాదు.
  • కార్యాలయము నుండి ఇంటికి లేదా ఇంటి నుండి కార్యాలయమునకు ప్రయాణించునపుడు యాక్సిడెంట్ జరిగితే సెలవుకు అర్హులు కాదు.
  •  డెసెబిలిటీ సెలవును ఇతర సెలవులతో కలిపి పొందవచ్చును.
  •  సెలవు పెన్షన్ కు డ్యూటీగా లెక్కించబడును.
  • మొదటి నెలల వరకు పూర్తి వేతనం లభించును తరువాత కాలమునకు అర్ధవేతనము సెలవుగా లెక్కించి సగము వేతనం లభించును.

(జి..యం.ఎస్.నం 133 ఫైనాన్స్ & ప్లానింగ్ డిపార్ట్మెంట్ తేది 10-06-1981 అండ్ FR 83).


మీకు తెలుసా.......

  • సాధారణ సెలవులు (cl)  వరుసగా 10 రోజులు వాడరాదు.
  • జాతీయ,అంతర్జాతీయ స్థాయి స్పోట్స్ లో పాల్గొనే ఉపాధ్యాయులకు 30 రోజులు Spl CL లు ఇస్తారు.
  • దీర్ఘకాలిక వ్యాధులు గలవారికి ( క్యాన్సర్మూత్రపిండాలు వ్యాధులు) 6 నెలలు పూర్తి వేతనం తో గల Halfpay Leave ఇస్తారు.
  • COMPRENSIVE CASUAL LEAVE ని GOVT అనుమతి ఇచ్చిన DATE నుండి 6 నెలల లోపు వాడుకోవాలి.
  • EARN LEAVE ని ప్రతి జనవరి 1 నుండి జూలై 1 వరకు ADVANCE గా 3 రోజులు జమచేయవచ్చు.
  • EL లు service మొత్తంలో 300 రోజులు encashment చేసికోవచ్చు GO.MS.NO.232, DT 16.9.2005.
  • EOL లో 5A,5B ప్రకారం అనుమతి లేకుండా ప్రభుత్వ ఉద్యోగి ONE YEAR  ఉద్యోగానికి ABSENT అయితే రాజీనామా చేసినట్లు భావిస్తారు GO. MS NO.129 ,DT 1.6.2007.
  • HALF PAY LEAVE(PERSONAL WORK).180 DAYs అనగా 6 నెలలు వరకు HRA, CCA లను పూర్తిగా చెలిస్తారు.
  • HALFPAY LEAVE కి ? PREFIX, SUFIX కూడా వాడుకోవచ్చు.
  • HALFPAY LEAVE లో COMMUTATIVE LEAVE ని వాడుకుంటే మీకు ఉన్న ML లు వాడుకున్న రోజులకు రెట్టింపు తగ్గించును.
  • ఇవి సర్వీస్ లో 480 గాను 240 రోజులు వాడుకోవచ్చుఇవి వాడుకోను సందర్భం లో దీర్ఘకాలిక వ్యాధులు గలవారికి, 8 నెలల వరకు HRA, CCA లు పూర్తిగా చెలిస్తారు.
  • Surrender Leave లు 15/30 రోజులు సంవత్సరం లో ఏ నెలలోనైనా Encashment చేసికోవచ్చు, SURRENDER LEAVE కి IR ఇవ్వరు.
  • వేసవికాలంలో.. పనిచేసిన ఏ డ్యూటీలో నయినా వారికి ELS అనేవి దామాషా పద్దతిలో నమోదు చేయును.GO MS NO.382/E1-1/2013,date 16.11.2013.
  • MATERNATIVE LEAVE ని కాన్పు జరిగిన రోజునుండి 180 రోజులు జీతంలో కూడిన సెలవు ఇచ్చును.
  • ఈ సెలవు వేసవిలో కాన్పు జరిగినా ,జరిగిన తేదీ నుండే 180 రోజులు వచ్చును.
  • ఈ సెలవులో ఉన్నప్పుడు ఆర్థిక లాభం ఉంటే తిరిగి జాయిన్ ఐన తరువాతే ఇచ్చును.
  • ఈ సెలవులో ఉండగా Transfer అయితే కొత్త పాఠశాలలో Report చేసి  సెలవులో ఉండాలి Join అయితే Leave Cancel అగును.
  • అబార్షన్ జరిగిన వారికి 6 week సెలవు ఇచ్చును. GO MS NO 762,DT 11.08.1976.
  • PATERNATIVE LEAVE ని 15 రోజులు ప్రసవించిన తేదీ నుండి 6 నెలల లోపు వాడుకోవాలి.
  • CHILD CARE LEAVE  అనేది 90 రోజులు.
  • పిల్లలకు 18 సంవత్సరాలు వచ్చువరకె అనుమతి.
  • ప్రత్యేక అవసరతలు గల పిల్లల సందర్భంలో 22 YEARS  పూర్తి అయ్యే వరకు ఇస్తారు.
  • దీనికి Children Date of Birth Certificate Submit చేయాలి.
  • ఈ leave ని CL, SPL CL తో కలిపి వాడరాదు కాని  మిగతా leaves  కలిపి వాడుకోవచ్చు.
  • 15 రోజులు దాటిన సెలవులు VACATION అంటారు...దీనికి  PREFIX, SUFIX వాడుకోవచ్చు.
  • 10 రోజులు దాటని సెలవులకు ముందువెనుక రెండు రోజులు రావాలి.
  • 10 రోజులు లోపు సెలవులు వస్తే  ముందువెనుక రోజుకు  ముందు CL వాడుకోవచ్చు.