ఉద్యోగ , ఉపాధ్యాయ మిత్రులకు స్వాగతం సుస్వాగతం పి అర్ టి యు పినపాక మండల శాఖ ......

Teachers (Employees) Income Tax Software 2024- 25 Available now ........

PENSION


❇ *పెన్షన్ లోని రకాలు* ❇


👉 *నార్మల్ ఫ్యామిలి పెన్షన్ రూల్-50:*
ఉద్యోగిగా ఉంటూ లేక విరమణ పొందిన అనంతరం మరణిస్తే అతని కుటుంబ సభ్యులకు ఇచ్చునదే ఫ్యామిలి పెన్షన్.చివరి నెల జీతంలో 30% కుటుంబ పెన్షన్ గా చెల్లిస్తారు.

👉 *ఎన్ హేన్స్ ఫ్యామిలి పెన్షన్:*
దీన్ని సాధారణంగా కుటుంబ పెన్షన్ అందురు.ఉద్యోగిగా ఉంటూ లేక పదవీ విరమణ పొందిన అనంతరం మరణిస్తే అతని కుటుంబ సభ్యులకు మరణించిన తేది నుండి 7 సం॥ వరకు గానీ,జీవించియుంటే 65 సం॥ వయస్సు పూర్తగు తేది వరకు గాని ఏది తక్కువైతే ఆ తేది వరకు ఉద్యోగి చివరి జీతంలో 50% కుటుంబ పెన్షన్ గా చెల్లిస్తారు.అయితే ఇది పదవీ విరమణ వయస్సు నుండి పొందే పెన్షన్ కు మించరాదు.ఎన్ హేన్స్ ఫ్యామిలి పెన్షన్ తేది తర్వాత నార్మల్ ఫ్యామిలి పెన్షన్ 30% వస్తుంది.

👉 *సూపరాన్యూ యేషన్ పెన్షన్ రూలు-32,33 మరియు 42:*
ప్రభుత్వం నిర్ణయించిన పదవీ విరమణ వయస్సు సుపీరియర్ సర్వీసు ఉద్యోగికి 58 సం॥ క్లాస్-IV సర్వీసు ఉద్యోగికి 60 సం॥ నిండిన వారికి ఇట్టి పెన్షన్ ఇస్తారు.

👉 *ఇన్వాలిడ్ పెన్షన్ రూలు-37:*
ఉద్యోగి అనారోగ్యం వల్ల ఉద్యోగము చేయుటకు అనర్హుడని వైద్యాధికారి ధృవీకరణపై రిటైరగు వారికి ఇవ్వబడు పెన్షన్.

👉 *కంపల్సరీ రిటైర్మెంటు పెన్షన్ రూలు- 39,40:*
ఉద్యోగిని ప్రభుత్వం నిర్భంధ పదవీ విరమణ చేయించినపుడు ఇచ్చు పెన్షన్.ఇది ఇన్వాలిడ్ పెన్షన్,గ్రాట్యూటీల కు మించకుండా 2/3 వంతుకు తక్కువగా ఉండాలి.కనీస పెన్షన్ కు తగ్గకూడదు.17-4-2001 నుండి కమ్యూటేషన్ కూడా మంజూరు చేస్తారు.

👉 *ప్రోవిజినల్ పెన్షన్ రూలు-52:*
ఏదైనా క్రమశిక్షణ చర్యలు,ఉద్యోగి రిటైరయ్యే నాటికి పెండింగ్ ఉంటే ఆ క్రమశిక్షణా చర్యలు పూర్తయ్యే వరకు చెల్లించే పెన్షన్.ఇది చట్ట ప్రకారం పదవీ విరమణ చేసే ఉద్యోగికి అనుమతించే
పెన్షన్ లో 75% తగ్గకుండా ఉండాలి.కేసు యొక్క తీవ్రతను బట్టి పెన్షన్ పెంచుకోవచ్చును.అయితే ఇది ఎప్పుడూ 100% ఇవ్వకూడదు.పూర్తయి ఫైనల్ ఇచ్చేటప్పుడు ప్రోవిజినల్ పెన్షన్ కు సర్ధుబాటు చేసి మిగిలింది చెల్లించబడును.గ్రాట్యూటీ చెల్లించబడదు.

**************

@    సందేహం :-ఎన్ని సంవత్సరాల సర్వీస్ ఉంటే ఫుల్ పెన్షన్ కు ఎలిజిబిలిటీ ఉంటుంది?ఏయే బెనిఫిట్స్ వర్తిస్తాయి?

జవాబు- 20 సంవత్సరాల సర్వీసు నిండిన ఉద్యోగి యొక్క కోరిక ప్రకారం రిటైర్ అగుటకు అనుమతించబడును.
( G.O (P) No. 88, Finance and Planning (Finance Wing) P.N.C. Dept, Date: 26-01-1980* ) రూల్ : 42,43


పెన్షన్ కమ్యూటేషన్:
               
వాలెంటరీ రిటైర్మెంటు పొందిన ఉపాధ్యాయుడు తన పెన్షన్ లో 40% అమ్ముకోవచ్చును.* దీనినే *పెన్షన్ కమ్యూటేషన్* అంటారు.
( G.O.m.s.No: 158, Finance and Planning ; Date: 16-09-1999)
గమనిక:- రిటైరైన సంవత్సరంలోగా సంబంధిత అధికారిగారికి దరఖాస్తు చేసుకోవాలి. సంవత్సరం దాటితే మెడికల్ టెస్టులు, అనేక వివరాలతో జాప్యం జరుగుతుంది


పెన్షన్:

పదవీ విరమణ చేయునాటికి 10 సంవత్సరములు అంతకంటే ఎక్కువ సర్వీసు చేసిన వారికి పెన్షన్ ఇస్తారు.
పెన్షన్ లెక్కించు విధానము:-
*చివరి నెల వేతనం× అర్థ సం„యూనిట్లు × 1/2 × 1/66 సూత్రం ప్రకారం లెక్కిస్తారు

*20 సంవత్సరాలకు వాలెంటరీ రిటైర్మెంటు కోరితే 5సంవత్సరాల వెయిటేజిని కలిపి సర్వీస్ కాలమునకు కలిపి పెన్షన్ నిర్ణయిస్తారు.

* కుటుంబ పెన్షన్ వివరాలు

*రిటైర్మెంట్ గ్రాట్యుటీ

మినిమం క్వాలిఫైయింగ్ సర్వీస్:
5 ఇయర్స్ ఫైనాన్షియల్ బెనిఫిట్: క్వాలిఫైయింగ్ సర్వీస్ పొడవు ఆధారంగా. సుమారు మొత్తం Rs.12.00 లక్షల .

డెత్ గ్రాట్యుటీ

0-1 సంవత్సరాలు సేవ: 6 టైమ్స్/ 4 (చెల్లింపు రోజు)
1-5 సంవత్సరాల సేవ: 18 సార్లు / 4 (పే,డీఏ )
5-18 సంవత్సరాల సర్వీస్: 36 సార్లు 4 (పే-డే) > 18 సంవత్సరాల సేవ: 38
/4 (చెల్లించాల్సిన రోజు)
మాక్సిమం మొత్తం: Rs.12.00 లక్షల. కుటుంబ పింఛను ఉద్యోగి / పెన్షనర్ యొక్క కుటుంబ సభ్యులకు ఇవ్వబడుతుంది.

పెన్షన్ రకాలు

1. పెంపొందించిన కుటుంబ పెన్షన్ :-

 మిని క్వాలిఫైయింగ్ సర్వీస్:
ఏడు సంవత్సరాలు కంటే ఎక్కువ ఏడు సంవత్సరాల కాలానికి 50% చివరి చెల్లింపు మరియు ఏడు సంవత్సరాలు లేదా 65 సంవత్సరాలుగా చెల్లింపులు.

2.  కుటుంబ పెన్షన్ : -

 మిని క్వాలిఫైయింగ్ సర్వీస్:

 ఒక సంవత్సరం నుండి 7 సంవత్సరాల. పెంచిన కుటుంబ పెన్షన్ ముగిసిన తరువాత, కుటుంబ పింఛను ఇవ్వబడుతుంది. మొత్తం చెల్లింపు మరియు అనుమతుల యొక్క 30%

3.  అదనపు సాధారణ కుటుంబ పెన్షన్:-

 అతని / ఆమె విధులను నిర్వర్తిస్తున్నప్పుడు మరణించిన ఉద్యోగుల కుటుంబ సభ్యులకు అతని పింఛను ఇవ్వబడుతుంది,

                                                                    *FAMILY PENSION*

 సర్వీస్ లో ఉండి గానీ, రిటైర్ ఐన తరువాత గానీ ఉద్యోగి మరణించిన ,అతని భార్య కు ఇచ్చే పెన్షన్ ను ఫ్యామిలీ పెన్షన్ అంటారు .

 7ఇయర్స్ సర్వీస్ లోపు చనిపోతే, భార్యకు పే లో 30% ఫ్యామిలీ పెన్షన్ గా ఇస్తారు.

 7ఇయర్స్ సర్వీస్ పైన చేసి రిటైర్మెంట్ లోపు చనిపోతే రెండు రకాలుగా భార్యకు ఫ్యామిలీ పెన్షన్ చెల్లిస్తారు.

a) మొదటి 7 ఇయర్స్ కి 50%

b) 7 ఇయర్స్ తరువాత నుండి 30%.

EXample 1:

ఓక ఉద్యోగి సర్వీస్ లో ఉండగా మరణించెను.అప్పటికి అయన సర్వీస్ 3y 6m. అపుడు ఆతని పే 7740 ఐన, భార్య కు వచ్చే ఫ్యామిలీ పెన్షన్
 ➡ 7740×30/100 =2322.00
ఇది భార్య కు జీవితాంతం ఇస్తారు.

 Example2:

 ఉద్యోగి మరణించే నాటికి చేసిన సర్వీస్ 8y 4m. అపుడు పే 11530.ఐన, అతని భార్య కు మొదటి 7ఇయర్స్ వచ్చే ఫ్యామిలీ పెన్షన్
 11530×50/100=5765.00.

 7 ఇయర్స్ తరువాత నుండి జీవితాంతం వచ్చే ఫ్యామిలీ పెన్షన్👉11530×30/100 = 3459.00

కుటుంబ పెన్షన్ కొన్ని ముఖ్యాంశాలు
కుటుంబ పెన్షన్ కొన్ని ముఖ్యాంశాలు:Family pension for teachers
(R U L E 50 to 59)


ఉద్యోగిగా ఉంటూ మరణించినా,పదవీ విరమణ చేసిన తర్వాత మరణించినా అతను/ఆమె కుటుంబమునకు ఫ్యామిలీ పెన్షన్ ఇస్తారు.

✍ సర్వీసులో వుండి మరణిస్తే మొదటి 7సం॥ వరకు,ఉద్యోగి 65సం॥ వయస్సు నిండే వరకు ఏది ముందు అయితే అంతవరకు చివరి నెల జీతంలో 50% పెన్షన్గా చెల్లిస్తారు.

✍ పెన్షనర్ రిటైరయిన తదుపరి చట్టబద్ధంగా వివాహం చేసుకోన్నచో పెన్షనర్ భార్య/భర్తకు వారికి కలిగిన సంతానం కూడా కుటుంబ పెన్షన్కు అర్హులే.

✍ అదృశ్యమైన,ఆచూకి తెలియని ఉద్యోగుల కుటుంబాలకు సంవత్సరం తదుపరి కుటుంబ పెన్షన్ ఇస్తారు.

✍ సంపాదనా పరులుకాని అంగవికలురైన పిల్లలకు కూడా కుటుంబ పెన్షన్ సౌకర్యం వర్తిస్తుంది.

✍ పెన్షనర్ చనిపోయిన రోజునకు కూడా పెన్షన్ చెల్లిస్తారు.ఆ మరుసటి రోజు నుండి కుటుంబ పెన్షన్ చెల్లిస్తారు.

✍ కుటుంబ పెన్షన్ పై D.R చెల్లిస్తారు.

✍ ఫామిలీ పెన్షనర్ పునర్వివాహము చేసుకుంటే ఫామిలీ పెన్షన్ రద్దవుతుంది.
(Rule 50(5) (I)

✍ చనిపోయిన మొదటి భార్య పిల్లలు రెండవ భార్యతోపాటు కుటుంబ పెన్షన్ వాటాకు అర్హులు.
(Rule 50(6)(A)(1)

✍ మొదటి భార్య బ్రతికి వుండగా ప్రభుత్వ అనుమతి లేకుండా పెళ్ళి చేసుకుంటే రెండవ భార్య కుటుంబ పెన్షన్కు అర్హురాలు కాదు.
(Cir.Memo.No.4027/B/26/pensn-1/87 Fin  Dt:20-8-1981)

✍ విడాకులు పొందిన భార్య పిల్లలు కుటుంబ పెన్షన్లో వాటాకు అర్హులే.
(G.O.Ms.No.20 Dt:24-1-1981)

✍ స్పెషల్ టీచర్ సర్వీసు పెన్షన్కు లెక్కించబడుతుంది.
(G.O.Ms.No.119 Edn Dt:21-4-1998)
(G.O.Ms.No.92 Edn Dt:8-8-2000)

@@@@


COMMUTATION

@ ఉద్యోగికి లభించే పింఛను నుంచి 40% మించ కుండా ఒకేసారి నియమ నిబంధనల మేరకు ఏకమొత్తంగా అతను నగదుగా మార్చుకునే పద్దతినే "కమ్యూటేషన్" గా పరిగణిస్తారు.

@ ఈ పద్దతి 1-4-1999 నుండి అమలులోకి వచ్చింది.1-4-1999 తేదీన గాని,అటు తర్వాత గాని పదవీ విరమణ గాని,చనిపోయిన ఉద్యోగి విషయంలో గాని ఈ సూత్రం వర్తిస్తుంది.
(G.O.Ms.No.158 F&P తేది:1-4-1999)

@ శాఖాపరమైన న్యాయస్థానాలలో గనుక ఉద్యోగిపై క్రమశిక్షణా చర్యలు అపరిష్కృతంగా ఉన్నట్లయితే కమ్యూటేషన్ మంజూరు చేయబడదు.
(Rule 3(3) of Commutation Rules 1994)

@ కమ్యూటేషన్ కోసం ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోనవసరంలేదు. ప్రభుత్వం
G.O.M.No.263 తేది:23-11-1998 ద్వారా నిర్దేశించిన పింఛను ఫారంలోనే,పింఛనుతో పాటు కమ్యూటేషన్ ను కూడా తెలియజేయవచ్చు.
(G.O.Ms.No.356 F&P తేది:28-11-1989)

@ పెన్షన్ కమ్యూటేషన్ చేసిన తరువాత తగ్గిన పెన్షన్ 15సం॥ తర్వాత మాత్రమే తిరిగి పూర్తి పింఛను వస్తుంది.ఈ విధంగా మరల పూర్తి పెన్షన్ పొందిన తర్వాత రెండవసారి కమ్యూట్ చేయు అవకాశం లేదు.
(G.O.Ms.No.44 F&P తేది:19-02-1991)

@ 15 సం॥ కాలపరిమితిని కమ్యూట్ చేసిన మొత్తం పొందిన తేది నుంచి గానీ లేక ఆ మొత్తం వసూలు చేసుకోమ్మని జారీచేసిన ఉత్తర్వులు 3 నెలల తర్వాత గానీ ఏది ముందైతే ఆ తేది నుండి లెక్కిస్తారు.
(G.O.Ms.No.324 F&P తేది:20-08-1977)

@ కమ్యూటేషన్ మొత్తం పొందిన తర్వాత ఏ కారణము చేతనైనా పెన్షన్ సవరించినయెడల,తత్ఫలితంగా పెన్షన్ ఎక్కువ అయిన సందర్భాలలో తదనుగుణంగా పెరిగినటువంటి కమ్యూటేషన్ మొత్తం కూడా చెల్లించవలసియుంటుoది.
(G.O.Ms.No.392 F&P తేది:02-12-1993)

@ కమ్యూటేషన్ మొత్తానికి,గ్రాట్యూటి మాదిరిగా గరిష్ట మొత్తంను నిర్దేశించలేదు.ఎంతమేరకు అర్హులో అంతవరకూ పొందవచ్చు.
**************
@     సర్వీసులో ఉండి చనిపోయిన ఉద్యోగ,ఉపాధ్యాయులకు అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం Rs.20,000 చెల్లిస్తారు.
(G.O.Ms.No122 తేది:11-04-2016)

@    మరణించిన ఫామిలీ మరియు సర్వీసు పెన్షనర్లందరికీ అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం ఒకనెల పెన్షన్ లేదా Rs.20,000 చెల్లిస్తారు.పెన్షనర్ కన్నా ముందే మరణించే భార్యకు కూడా మొత్తాన్ని చెల్లిస్తారు.
(G.O.Ms101 తేది:21-04-2015)

@    ఎయిడెడ్ విద్యాసంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు అంత్యక్రియల ఖర్చు నిమిత్తం Rs.10,000 చెల్లిస్తారు.
(G.O.Ms.No.38 తేది:28-05-2013)

@    ఫామిలీ పెన్షనర్ చనిపోతే కుటుంబంలో ఎవరూ లేనిచే వారసులకు చెల్లిస్తారు.
(G.O.Ms.No.136 తేది:29-06-2011)

***********

Example of  Pension Calculation :

@  పుట్టిన తేదీ:...10/06/1972
@  నియామకపు తేదీ:....26/10/1998
Basic pay....38130
Cadre.....SGT
DATE OF RETIREMENT.....30/06/2030

ప్రశ్న: *నేను స్వచ్ఛంద పదవీవిరమణ 01/06/2020 నాడు తీసుకుంటే  నాకు రావలసిన పెన్షన్ మరియు బెనెఫిట్స్ దయచేసి తెలుపగలరు.*

జవాబు:

*వాలంటరీ రిటైర్మెంట్ కు 5 సంవత్సరాల వెయిటెజి కలుపుతారు*

*పూర్తిచేసిన సర్వీసు 22 సంవత్సరాలు+ 5 సంవత్సరాల వెయిటేజి మొత్తం సర్వీసు 27 సంవత్సరాలు*

 *33 సంవత్సరాలు 66 అర్ధ సంవత్సర యూనిట్లు ఆ ప్రకారం 27 సంవత్సరాలకు 54  సంవత్సర యూనిట్లు*

 *ప్రస్తుత DA 33.536%*

*పెన్షన్: 38130×27/66 =15,599/-*

*గ్రాట్యుటీ: 38130*12787( DA )×54×1/4 = 6,87,339/-

*కమ్యూటేషన్: (40%)=38130×40/100=6240/-

         *6240×12×8.913= 6,13,492/-*

 *మొత్తం పెన్షన్ 15,599 లో నుండి 40% కమ్యూటేషన్ మొత్తం తీసివేయగా 15,599-6240 = 9,359*

* 9359 ki ప్రస్తుతం DR కలుస్తుంది (33.356%)
9359+3138= 12,677*

*మొత్తం చేతికొచ్చే పెన్షన్ = 12,677*

 *GO.100 Dt:21.7.2015 ప్రకారం 350 మెడికల్ అలవెన్స్ కూడా పెన్షన్ కు కలుపుతారు.*