ఉద్యోగ , ఉపాధ్యాయ మిత్రులకు స్వాగతం సుస్వాగతం పి అర్ టి యు పినపాక మండల శాఖ ......

ఉపాధ్యాయుల కోసం వనరులు

FLN Year Plans, Unit Plans & Lesson Plans Free Download

Foundation Literacy and Numeracy (FLN) Programme లో భాగంగా ప్రతి ఉపాధ్యాయుడు పాఠశాలలో వార్షిక, వారాంతపు మరియు పీరియడ్ ప్రణాళికలు తయారు చేయాల్సి ఉంటుంది. కాబట్టి తరగతి వారీగా వార్షిక ప్రణాళిక మరియు పాఠ్య ప్రణాళికలు (Lesson Plans) క్రింద ఇవ్వడం జరిగింది. ఆయా లింకుల పై క్లిక్ చేసి నేరుగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

తొలిమెట్టు (Tholimettu) ప్రోగ్రాం వివరాలు:

Category Details / Download Link
Subject TS DSE launched the Tholimettu Programme under FLN mission
Category Learning Enhancement Programme
Website https://scert.telangana.gov.in/
FLN Mission Foundational Literacy and Numeracy Mission
తొలిమెట్టు Download Tholimettu Programme details
FLN Highlights Download FLN Highlights PDF file

Download Class Wise Period Plans:

Model Period Plans:

Subject Download Model Plans
Telugu
English
EVS
8th Maths (EM)

Download Year Plans:

ఇవి ఒకసారి తయారు చేసుకుంటే చాలు. ఈ క్రింద క్లిక్ చేసి డౌన్ లోడ్ చేసుకుని ప్రింట్/జిరాక్స్ తీసుకుంటే చాలు, రాయవలసిన అవసరం లేదు.

తొలిమెట్టు ఉద్దేశం & మార్గదర్శకాలు:

ఉద్దేశం: కనీస అభ్యసన స్థాయిని సాధింపచేసి విద్యార్థులను వారి ప్రస్తుత తరగతి స్థాయికి తీసుకొనిపోవడం.

లక్ష్యాలు: పుస్తకాలను సరిగ్గా వినియోగించడం, సామర్థ్యాల సాధన ముఖ్యం, చదవడం, రాయడం, చతుర్విద ప్రక్రియలను నేర్పడం మరియు ప్రణాళిక బద్దంగా బోధన చేయడం.

మార్గదర్శకాలు:

  1. విద్యాసంవత్సరంలో జూన్, జూలై, ఆగష్టు మాసాల్లో మొదట 2 నుండి 5 వ తరగతి విద్యార్థులకు ఆయా తరగతుల్లో కొనసాగుటకు అవసరమైన కనీస సామర్థ్యాల మీద దృష్టిపెట్టి బోధనాభ్యసన ప్రణాళికలను రూపొందించుకొని అమలుపరచాల్సి ఉంటుంది.
  2. సెప్టెంబరు మాసం నుండి తరగతి వారీగా సామార్థ్యాల వారీగా అభ్యసన ఫలితాల సాధనకోసం కృషిచేయాలి. మొత్తం పనిదినాలు 220 రోజుల్లో బోధనాభ్యసన ప్రక్రియల నిర్వహణకోసం 140 రోజులు అనగా 28 వారాలను దృష్టిలో పెట్టుకొని ప్రణాళికను రూపొందించారు.
  3. సాధారణంగా ఒక వారానికి 6 పనిదినాలు ఉంటాయి. వీటిలో 5 రోజులు బోధనాభ్యసన ప్రక్రియల నిర్వహణకోసం, 1 రోజు మూల్యాంకనం, పునరభ్యాసం కోసం కేటాయించారు.
  4. ఇందుకోసం అర్థవంతంగా, కృత్యాధార పద్ధతుల్లో, పిల్లలందరూ భాగస్వాములు అయ్యేలా 1) వార్షిక 2) పాఠ్య / వారపు 3) రోజు వారీ కాలాంశం లేదా పీరియడ్ ప్రణాళికలను రూపొందించుకోవాలి.
  5. వీటిపట్ల అవగాహన పెంపొందించుకొని ప్రణాళికాబద్ధంగా నిర్వహించడానికి వీటి ప్రణాళిక నమూనాలను రూపొందించారు.
  6. 28 వారాల్లో ఆగష్టు వరకు 11 వారాలలో తరగతి వారీగా కనీస సామర్థ్యాల సాధన మీద దృష్టిపెట్టాలి. సెప్టెంబరు మాసం నుండి పాఠ్యాంశాల వారీగా, తరగతి వారీగా సాధించాల్సిన సామర్థ్యాలు, అభ్యసన ఫలితాల మీద దృష్టిపెట్టాలి.